సాక్షి, న్యూడిల్లీ: అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ గుర్తింపు దక్కడం తమ సంస్కరణలకు మరింత ప్రోత్సాహాన్నిస్తుందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ జైట్లీ వ్యాఖ్యానించారు. మూడీస్ అప్‌గ్రేడ్ అనంతరం కేంద్రమంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మూడీస్ రేటింగ్ అప్‌గ్రేడ్‌ను స్వాగతించిన జైట్లీ ఈ అప్‌గ్రేడ్ లేట్‌గా ఇచ్చిందన్నారు. అయినా 13సంవతర్సాల తర్వాత ఇండియాకు బీఏఏ 2 ర్యాంక్ అప్ గ్రేడ్ రావడం సంతోషాన్నిస్తోందన్నారు.
జీఎస్‌టీ అమలును ప్రపంచవ్యాప్తంగా ప్రగతిశీల అడుగుగా అందరూ గుర్తిస్తున్నారు. ఆర్థిక క్రమశిక్షణలో భారతదేశం పురోగమిస్తోంది.ఇక తమ దృష్టి అంతా ఇన్‌ఫ్రా సంస్కరణలపై ఉండనుందన్నారు. గత మూడేళ్లుగా నిర్మాణ రంగం కీలక రంగంగా ఉందన్నారు. ఆర్థిక వ్యవస్థ స్థిరీకరణ మార్గంలో నడుస్తోంది..భారతదేశం సంస్కరణల ప్రక్రియపై సందేహాలు వ్యక్తం చేస్తున్న పలువురు ఇప్పుడు వారి అభిప్రాయాలను మార్చుకోవాలన్నారు. మూడు సంవత్సరాల్లో తాము చేపట్టిన సంస్కరణలు వేగవంతమైన పథం పెరుగుదలకు దారితీశాయని.. అయితే మూడీ గుర్తింపు ఆలస్యంగా లభించిందని పేర్కొన్నారు. అలాగే రేటింగ్స్‌కు ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదని జైట్లీ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment