అనేక కారణాల రీత్యా ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలు చరిత్రాత్మకవైనవని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. మంగళవారం ఉదయం పార్లమెంట్ బడ్జెట్ మావేశాలను ప్రారంభించిన ఆయన.. దశాబ్దాల సంప్రదాయానికి విరుద్ధంగా రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. సబ్‌కా సాత్ - సబ్‌కా వికాస్(సమిష్టిగా సర్వతోముఖాభివృద్ధి) నినాదంతో ప్రభుత్వం ముందుకు వెళుతున్నదని చెప్పారు. పీడిత, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అహర్నిషలు కృషి చేస్తున్నదని తెలిపారు. ఈ క్రమంలోనే గడిచిన రెండేళ్లలో ప్రభుత్వం సాధించిన ప్రగతిని, భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు.