లోక్సభ నుంచి వైఎస్ఆర్ సీపీ వాకౌట్ | ysrcp mps walkout from loksabha | Sakshi
Sakshi News home page

లోక్సభ నుంచి వైఎస్ఆర్ సీపీ వాకౌట్

Published Wed, Feb 1 2017 3:12 PM | Last Updated on Tue, Oct 2 2018 4:19 PM

లోక్సభ నుంచి వైఎస్ఆర్ సీపీ వాకౌట్ - Sakshi

లోక్సభ నుంచి వైఎస్ఆర్ సీపీ వాకౌట్

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, రైల్వే జోన్ లను ప్రకటించనందుకు నిరసనగా లోక్సభ నుంచి వైఎస్ఆర్ సీపీ  వాకౌట్ చేసింది. బుధవారం  కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2017-18 ఏడాదికిగాను బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ప్రకటించనందుకు వైఎస్ఆర్ సీపీ ఎంపీలు నిరసన తెలియజేస్తూ వాకౌట్ చేశారు.

అనంతరం వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల ఆశలను కేంద్ర ప్రభుత్వం వమ్ము చేసిందని విమర్శించారు. కేపిటల్ గెయిన్స్ పన్ను రద్దు వల్ల రైతులకు ఒరిగేదేమీ లేదని చెప్పారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అమరావతిలో భూములు ఇచ్చిన రైతులకు ట్యాక్స్ గెయిన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement