
బడ్జెట్: ఏపీ ‘రాజధాని’పై కీలక ప్రకటన
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం పార్లమెంట్‌లో ప్రవేశపెడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంపై కీలక ప్రకటన చేశారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు, మూలధన పన్ను లాభాల నుంచి కూడా మినహాయింపు ఇచ్చారు. కాగా, ల్యాండ్ పూలింగ్‌లో ఉన్నవారికి మాత్రమే పన్ను రద్దు వర్తిస్తుందని అన్నారు.
‘ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు కోసం భూములు ఇచ్చిన వారికి ఆదాయపన్నులో మినహాయింపు ఇస్తున్నాం. మూలధన పన్ను లాభాల నుంచి కూడా మినహాయింపు ఇస్తున్నాం’ అని జైట్లీ ప్రకటించగానే తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ, టీడీపీ ఎంపీలు హర్షధ్వానాలు చేశారు. ఈ మినహాయింపులు రాష్ట్రం ఏర్పడిన తేదీ అంటే 2014, జూన్ 2 తర్వాతి నుంచి చోటుచేసుకున్న క్రయవిక్రయాలన్నింటికీ వర్తిస్తుందని జైట్లీ పేర్కొన్నారు.
సంబంధిత కథనాలు...
2017 కేంద్ర బడ్జెట్ ముఖ్యాంశాలు
బడ్జెట్ లో రైల్వే హైలెట్స్...
గృహ రంగానికి గుడ్‌న్యూస్
పేదలకు కేంద్ర బడ్జెట్లో వరాలు!