ఎన్నికలకు ముందు కేంద్ర ఆర్థిక బడ్జెట్ ప్రవేశంపై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో యూనియన్ బడ్జెట్ ను నిలిపివేయాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. ఫిబ్రవరి 11న రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ జరగనున్న సందర్భంగా బడ్జెట్ ప్రవేశపెట్టడం సరి కాదన్నారు. వెంటనే నిలుపుదల చేయాలన్నారు. ఎన్నికల తరువాతే బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని ఆయన మోదీని కోరారు.