తన మనుగడ కోసమే ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారని భారత ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. యూపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. త్వరలో ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఆదివారం అలీగఢ్‌లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజ్‌వాదిపార్టీ, కాంగ్రెస్ పార్టీని దుయ్యబట్టారు. ఇప్పటి వరకు దోచుకునే ప్రభుత్వాన్ని, శాంతిభద్రతలు గాలికొదిలేసిన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని, ఇప్పుడు మాత్రం ప్రజల సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కోరారు.