కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఉత్తమ బడ్జెట్ ప్రవేశపెట్టారని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. పేదల అభ్యున్నతిని మెరుగు పరిచేందుకు ఈ బడ్జెట్ దోహదం చేస్తుందన్నారు. గత రెండున్నరేళ్లుగా తాము తీసుకున్న చర్యలకు ఊతమిచ్చేలా బడ్జెట్ ఉందన్నారు. ఉద్యోగాల కల్పనలో తమ ప్రభుత్వ చిత్తశుద్ధి బడ్జెట్ లో కనిపిస్తోందన్నారు. రైతులు, గ్రామీణులు బలహీన వర్గాల కోసం బడ్జెట్ లో ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. రైతుల ఆదాయం రెండింతలు చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు.