బడ్జెట్ ప్రసంగం ప్రారంభం ఇలా..
కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ 2017-18 సంవత్సర బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. ముందుగా కేంద్ర మాజీమంత్రి ఇ.అహ్మద్ మృతికి సభ సంతాపం తెలిపింది. అనంతరం స్పీకర్ తన రూలింగ్ ఇస్తూ, అరుణ్ జైట్లీని బడ్జెట్ ప్రసంగం ప్రారంభించాల్సిందిగా కోరారు. అందుకు కాంగ్రెస్ సభ్యుడు, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఈతీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అహ్మద్ చాలా సీనియర్ సభ్యుడని, ఆయన పార్లమెంటు విధుల్లో ఉండగానే కుప్పకూలిపోయారని అన్నారు. అందువల్ల ఆయనకు గౌరవ సూచకంగా ఈరోజు సభను వాయిదా వేసి, రేపు బడ్జెట్ ప్రవేశపెట్టుకోవచ్చన్నారు. కానీ అందుకు స్పీకర్ అంగీకరించలేదు.
దాంతో అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. వసంత పంచమి శుభదినం రోజున బడ్జెట్ ప్రవేశపెడుతున్నానని, ఈ శుభదినం సందర్భంగా అందరికీ అభినందనలని చెప్పారు. నల్లధనం మీద పోరాటం ప్రారంభించామని, ద్రవ్యోల్బణాన్ని సింగిల్ డిజిట్‌లోకి తెచ్చామని అన్నారు. ప్రజాధనానికి ప్రభుత్వం కస్టోడియన్‌గా ఉందన్నారు.