‘ఈ బడ్జెట్ మన భవిష్యత్తు’ | The FM has presented an 'Uttam' Budget: PM Modi | Sakshi
Sakshi News home page

‘ఈ బడ్జెట్ మన భవిష్యత్తు’

Published Wed, Feb 1 2017 2:23 PM | Last Updated on Wed, Aug 15 2018 2:30 PM

The FM has presented an 'Uttam' Budget: PM Modi

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఉత్తమ బడ్జెట్ ప్రవేశపెట్టారని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. పేదల అభ్యున్నతిని మెరుగు పరిచేందుకు ఈ బడ్జెట్ దోహదం చేస్తుందన్నారు. గత రెండున్నరేళ్లుగా తాము తీసుకున్న చర్యలకు ఊతమిచ్చేలా బడ్జెట్ ఉందన్నారు. ఉద్యోగాల కల్పనలో తమ ప్రభుత్వ చిత్తశుద్ధి బడ్జెట్ లో కనిపిస్తోందన్నారు. రైతులు, గ్రామీణులు బలహీన వర్గాల కోసం బడ్జెట్ లో ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. రైతుల ఆదాయం రెండింతలు చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు.

అసంఘటిత కార్మికులను సంఘటిత రంగంవైపు మళ్లించే ప్రయత్నం చేశామని వెల్లడించారు. వ్యక్తిగత ట్యాక్స్ ను తగ్గించే నిర్ణయం సాహసోపేతమైందన్నారు. అవినీతి, నల్లధనం నిర్మూలనపై తాము చేపట్టిన చర్యలు బడ్జెట్ లో ప్రతిఫలించాయని చెప్పారు. ఈ బడ్జెట్ మన భవిష్యత్తు అని పేర్కొన్నారు. సాధారణ బడ్జెట్ లో రైల్వే బడ్జెట్ ను విలీనం చేయడంతో రవాణా రంగం ఊపంచుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement