రూ.50వేలతో ఆభరణాలు కొంటున్నారా? అయితే...
రూ.50వేలతో ఆభరణాలు కొంటున్నారా? అయితే...
Published Tue, Jan 31 2017 11:32 AM | Last Updated on Tue, Sep 5 2017 2:34 AM
ముంబై : బంగారం లేదా వెండి ఆభరణాలు రూ.50వేల కంటే ఎక్కువ మొత్తంలో కొనదలుచుకున్నారా? అయితే తప్పనిసరి చేతిలో పాన్ కార్డు లేదా ఆధార్ నెంబర్ ఉండాల్సిందే. రూ.50 వేలు లేదా రూ.లక్ష కంటే ఎక్కువ మొత్తంలో బంగారం కొనుగోళ్లకు పాన్ కార్డు లేదా ఆధార్ నెంబర్ తప్పనిసరి చేయనున్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. 2017 బడ్జెట్ ప్రకటన అనంతరం నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం రూ.2 లక్షల కంటే ఎక్కువకు ఆభరణాలు కొనుగోలు చేస్తే, బంగారం మార్కెట్లో కేవైసీ కంప్లియన్స్ను సమర్పించాల్సి ఉంటుంది. బులియన్, జువెల్లరీలో కైవేసీ అవసరాన్ని ప్రస్తుతమున్న రూ. 2 లక్షల నుంచి మరింత తగ్గిస్తారని దేశంలోనే అతిపెద్ద బులియన్ అసోసియేసన్ సెక్రటరీ భార్గవ్ వైద్య అంచనావేస్తున్నారు.
రూ.50వేలకు కేవైసీ కంప్లియన్స్ను తీసుకొస్తారని చెబుతున్నారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం బ్లాక్మనీ హోల్డర్స్పై ఎక్కువగా దృష్టిసారించిన కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. పెద్ద నోట్లను రద్దు చేశాక, చాలామంది బ్లాక్మనీ హోల్డర్స్ తమ దగ్గరున్న నగదును జువెల్లరీ, బులియన్, రియల్ ఎస్టేట్లోకి మరలించినట్టు తెలిసింది. దీంతో డీమానిటైజేషన్ అనంతరం ఎవరు ఎంతమొత్తంలో బంగారం కొనుగోళ్లు చేపట్టి అక్రమాలకు పాల్పడ్డారో తెలుసుకోవడంలో ఇన్కమ్ ట్యాక్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, రెవెన్యూ ఇంటిలిజెన్సీ ఏజెన్సీలు నిమగ్నమై ఉన్నాయి. కేవైసీ అవసరాన్ని సమీక్షించి, వచ్చే బడ్జెట్లో రూ.లక్ష దాటిని కొనుగోళ్లకు ఈ నిబంధనలు తీసుకొస్తారని నేషనల్ సెక్రటరీ ఆఫ్ ఇండియా బులియన్ అండ్ జువెల్లర్స్ అసోసియేషన్ సురేంద్ర మెహతా సైతం చెబుతున్నారు.
Advertisement
Advertisement