bullion
-
గ్లోబల్ బులియన్ ఎక్ఛేంజీకి శ్రీకారం
న్యూఢిల్లీ: ప్రయోగాత్మక పద్ధతిలో గుజరాత్, గాంధీనగర్‌లోని గిఫ్ట్ సిటీలో అంతర్జాతీయ బులియన్ ఎక్ఛేంజీ ప్రారంభమైంది. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ(ఐఎఫ్ఎస్సీఏ) చైర్‌పర్శన్ ఇంజేటి శ్రీనివాస్ ఎఎక్ఛేంజీని పరిశీలనార్ధం తాజాగా ప్రారంభించారు. ఐఎఫ్ఎస్సీ వ్యవస్థాపక రోజు సందర్భంగా ఈ ఏడాది(2021) అక్టోబర్ 1 నుంచి బులియన్ ఎక్ఛేంజీ లైవ్ ట్రేడింగ్‌కు వేదిక కానుంది. ఆర్థిక సంస్థలు, ఫైనాన్షియల్ ప్రొడక్టులు, సర్వీసుల నియంత్రణ, అభివృద్ధి కోసం ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్(ఐఎఫ్ఎస్సీ)ను ఏర్పాటు చేసిన విషయం విదితమే. ప్రస్తుతం దేశీయంగా ఇది తొలి ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్కాగా.. 2020–21 బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అంతర్జాతీయ బులియన్ ఎక్ఛేంజీకి, క్లియరింగ్ కార్పొరేషన్, డిపాజిటరీ, వాల్ట్‌ల నిబంధనలను ప్రకటించారు. వీటిని 2020 డిసెంబర్ 11న నోటిఫై చేశారు. వీటితోపాటు కేంద్రం బులియన్ స్పాట్ ట్రేడింగ్, అండర్లైయింగ్ బులియన్ డిపాజిటరీ రిసీప్ట్స్ తదితర ఫైనాన్షియల్ ప్రొడక్టులు, సర్వీసులను సైతం నోటిఫై చేసిన సంగతి తెలిసిందే. -
రూ.50వేలతో ఆభరణాలు కొంటున్నారా? అయితే...
ముంబై : బంగారం లేదా వెండి ఆభరణాలు రూ.50వేల కంటే ఎక్కువ మొత్తంలో కొనదలుచుకున్నారా? అయితే తప్పనిసరి చేతిలో పాన్ కార్డు లేదా ఆధార్ నెంబర్ ఉండాల్సిందే. రూ.50 వేలు లేదా రూ.లక్ష కంటే ఎక్కువ మొత్తంలో బంగారం కొనుగోళ్లకు పాన్ కార్డు లేదా ఆధార్ నెంబర్ తప్పనిసరి చేయనున్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. 2017 బడ్జెట్ ప్రకటన అనంతరం నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం రూ.2 లక్షల కంటే ఎక్కువకు ఆభరణాలు కొనుగోలు చేస్తే, బంగారం మార్కెట్లో కేవైసీ కంప్లియన్స్ను సమర్పించాల్సి ఉంటుంది. బులియన్, జువెల్లరీలో కైవేసీ అవసరాన్ని ప్రస్తుతమున్న రూ. 2 లక్షల నుంచి మరింత తగ్గిస్తారని దేశంలోనే అతిపెద్ద బులియన్ అసోసియేసన్ సెక్రటరీ భార్గవ్ వైద్య అంచనావేస్తున్నారు. రూ.50వేలకు కేవైసీ కంప్లియన్స్ను తీసుకొస్తారని చెబుతున్నారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం బ్లాక్‌మనీ హోల్డర్స్పై ఎక్కువగా దృష్టిసారించిన కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. పెద్ద నోట్లను రద్దు చేశాక, చాలామంది బ్లాక్‌మనీ హోల్డర్స్ తమ దగ్గరున్న నగదును జువెల్లరీ, బులియన్, రియల్ ఎస్టేట్‌లోకి మరలించినట్టు తెలిసింది. దీంతో డీమానిటైజేషన్ అనంతరం ఎవరు ఎంతమొత్తంలో బంగారం కొనుగోళ్లు చేపట్టి అక్రమాలకు పాల్పడ్డారో తెలుసుకోవడంలో ఇన్కమ్ ట్యాక్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, రెవెన్యూ ఇంటిలిజెన్సీ ఏజెన్సీలు నిమగ్నమై ఉన్నాయి. కేవైసీ అవసరాన్ని సమీక్షించి, వచ్చే బడ్జెట్లో రూ.లక్ష దాటిని కొనుగోళ్లకు ఈ నిబంధనలు తీసుకొస్తారని నేషనల్ సెక్రటరీ ఆఫ్ ఇండియా బులియన్ అండ్ జువెల్లర్స్ అసోసియేషన్ సురేంద్ర మెహతా సైతం చెబుతున్నారు. -
ఛాయ్ వాలా మొత్తం ఆస్తులు రూ.400కోట్లు
-
ఛాయ్ వాలా మొత్తం ఆస్తులు రూ.400కోట్లు
సూరత్: డిమానిటైజేషన్ తరువాత సూరత్ లో వడ్డీ వ్యాపారి , మనీ లాండరింగ్ కింగ్ కిషోర్ భాజీవాలా ఇంటిపై దాడిచేసిన ఐటీ అధికారులే షాకయ్యారు. గుజరాత్ లోని సూరత్ కు చెందిన అవినీతి తిమింగలం కూడబెట్టిన మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ.400 కోట్లకు చేరింది. వడ్డీవ్యాపారిగా అవతరించిన టీ బజ్జీలు అమ్ముకునే వ్యక్తి ఆదాయం ఇంత భారీగా ఉండడం ఆదాయ పన్ను అధికారులను సైతం విస్మయ పరిచింది. ఆదాయ పన్ను అధికారులు తాజాగా ఆయన ఇంటిపై చేసిన సోదాల్లో మరో రూ. 150 కోట్ల విలువైన ఆస్తులు పట్టుబడ్డాయి. సుమారు రూ. 1.33 కోట్లను నగదును రికవరీ చేసినట్టు ఐటీ అధికారులు తెలిపారు. ఇందులో రూ.95 లక్షల విలువైన కొత్త రెండు వేల నోట్లు ఉన్నాయి. దీంతోపాటుగా రూ.7 కోట్ల విలువగల బంగారు ఆభరణాలు, రూ.72 లక్షల విలువైన వెండిని స్వాధీనం చేసుకున్నారు. (5కేజీల బంగారం బిస్కట్లు, 8 కేజీల బంగారు ఆభరణాలు, కేజీ డైమండ్ నగలు) రూ. 4.50 లక్షల కిసాన్ వికాస పత్రాలు, బంగ్లా, ఫ్లాట్స్, ఇళ్లు, షాపు లు సహా వ్యవసాయ భూమి సుమారు 70 ఆస్తుల పత్రాలను అధికారులు సీజ్ చేశారు. ఈ మొత్తం విలువ సుమారు నాలుగువందల కోట్లని అధికారులు అంచనావేశారు. పెద్దనోట్ల రద్దు ప్రకటించిన మరుసటి రోజు సూరత్ లోని ఉధానా బ్యాంకుకు భారీ సంచులతో రావడం సీసీటీవీలో రికార్డు అయింది. దీనిపై విచారణ సందర్భంగా సదరు వ్యక్తి సమాధానం చెప్పడంలో విఫలం కావడం ఐటి అధికారులు ఆయన ఇంటిపై సోదారు నిర్వహించారు. సూరత్ పీపుల్స్ కో ఆపరేటివ్ బ్యాంక్, బరోడా, హెచ్ డీఎఫ్ సీ తదితర బ్యాంకుల్లో 30కి పైగా బ్యాంకు అకౌంట్లు, 16 లాకర్లు ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సేర్లతో ఈ నకిలీ ఖాతాలు, లాకర్లను ఆపరేట్ చేస్తున్నాడని అధికారులు తెలిపారు. విచారణ నిమిత్తం అక్రమ ఖాతాలను సీజ్ చేసినట్టు చెప్పారు. మరోవైపు రాష్ట్ర మంత్రి,బీజేపీ నేత పురుషోత్తం రూపాలను అభినందిస్తున్న ఫోటో ఒకటి నెట్ లో చక్కర్లు కొడుతోంది. ఐటీ అధికారులు అందించిన సమాచారం ప్రకారం 31 సం.రాల క్రితం సౌరాష్ట్ర నుంచి ఉద్నాగాంకి వలస వచ్చిన కిషోర్ భాజియావాలా ఓ చిన్న, టీస్టాల్ ద్వారా జీవనం మొదలు పెట్టారు. ఆతరువాత బజ్జీల అమ్మడం మొదలు పెట్టాడు. అలా మెల్లిగా వడ్డీ వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. స్థానిక రాజకీయనాయకులు, పో్లీసు అధికారులతో సన్నిహిత సంబంధాలున్న ఈయన రుణం తిరిగి చెల్లించనివారిపై బెదరింపులకు పాల్పడేవారిని తెలిపారు. ఈ క్రమంలోరుణాలు చెల్లించలేని వారిదగ్గరనుండి ఆస్తులను లాక్కొనేవాడు. ఈక్రమంలోబ ఇతని నెలవారీ ఆదాయం 7.5కోట్లని విచారణలో తెలిపింది. వీటికితోడు 4.5 కోట్లు వడ్డీ రూపంలో వస్తుండగా, వివిధ ఆస్తుల మీద అ ద్దెరూపంలో మరో 3కోట్లు ఆదాయం. 150 కోట్ల విలువైన ఆస్తుల పత్రాలతో కలిపి మొత్తం అక్రమ సంపద నాలుగువందల కోట్లకుచేరింది. మరోవైపు తమ సంవత్సర ఆదాయాన్నిరూ.1.5కోట్లుగా ఐటీ రికార్డులో చూపించడం విశేషం. డిసెంబర్ 13న మొదలైన ఈ ఐడీ దాడులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. -
25 వేల దిగువకు పడిపోయిన బంగారం
బంగారం కొనాలనుకుంటే.. ఇదే మంచి తరుణం. డబ్బులు సిద్ధంగా పెట్టుకోండి. పది గ్రాముల బంగారం ధర 25 వేల రూపాయల దిగువకు పడిపోయింది. ఫ్యూచర్స్ మార్కెట్లో 524 రూపాయలు పడిపోయి.. ఐదేళ్ల కాలంలో ఎప్పుడూ లేనంత దిగువ స్థాయికి చేరుకుంది. ఎంసీఎక్స్‌లో ఆగస్టు డెలివరీకి సంబంధించిన బంగారం కాంట్రాక్టు ధర 2.06 శాతం తగ్గి 10 గ్రాములకు రూ. 24,974 వద్ద ట్రేడయింది. ఈ ధర వద్ద 597 లాట్లు అమ్ముడయ్యాయి. అక్టోబర్‌లో డెలివరీకి సంబంధించిన బంగారం పది గ్రాముల ధర రూ. 25,200 వద్ద 30 లాట్లు ట్రేడయింది. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన ట్రెండు కారణంగానే ఇక్కడ కూడా ధరలు తగ్గుతున్నాయని అనలిస్టులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లు చూసుకుంటే.. సింగపూర్ మార్కెట్లో ఔన్సు బంగారం 1,086.18 డాలర్ల వద్ద ట్రేడయింది. 2010 మార్చి తర్వాత ఇదే అత్యల్ప ధర. చైనాలో కూడా 2009 తర్వాత అత్యల్ప స్థాయిలో బంగారం ట్రేడయింది. -
మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు!
పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడినా కూడా బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. శనివారం నాటి బులియన్ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర రూ. 100 మేర తగ్గి రూ. 28,400కు చేరుకుంది. నగల వ్యాపారులు, రీటైలర్ల నుంచి డిమాండ్ తగ్గడంతో పాటు అంతర్జాతీయంగా కూడా బలహీన ట్రెండ్లు కొనసాగడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. వెండి ధరలు కూడా కిలోకు రూ. 65 మేర తగ్గి, రూ. 40,035కు చేరుకున్నాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండు తగ్గడంతో వెండి ధర తగ్గిందని చెబుతున్నారు. ఢిల్లీలో 99.9, 99.5 శాతం స్వచ్ఛ బంగారం ధరలు పది గ్రాములకు రూ. 28,400, రూ. 28,200 చొప్పున ఉన్నాయి. -
బంగారం ధరలో రికవరీ
ముంబై: దేశీయంగా దాదాపు రెండు సంవత్సరాల కనిష్ట స్థాయిలకు పడిపోయిన బంగారం ధరలు శనివారం తిరిగి కొంచెం కోలుకున్నాయి. ముంబై స్పాట్ మార్కెట్లో శుక్రవారం ముగింపుతో పోల్చితే 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.440 పెరిగి, రూ.26,100కు చేరింది. 22 క్యారెట్ల విషయంలోనూ ధర ఇంతే మొత్తం ఎగసి రూ.25,950కు ఎగసింది. వెండి కేజీ ధర సైతం రూ.750 పెరిగి తిరిగి రూ.36,000ను తాకింది. వడ్డీరేట్లపై అనిశ్చితితో అంతర్జాతీయంగా, దేశీయంగా ఫ్యూచర్స్ మార్కెట్లో ధరల ధోరణి ఇంకా సంక్లిష్టంగానే ఉన్నప్పటికీ దేశ ప్రధాన స్పాట్ మార్కెట్లో ధర పెరగడం విశేషం. పెళ్లిళ్ల సీజన్లో రిటైల్ ఆభరణాలకు డిమాండ్, ప్రస్తుత స్థాయిలో ధర వద్ద పెట్టుబడులకు ఎల్లో మెటల్ సరైనదన్న అభిప్రాయం తిరిగి దేశీయంగా పసిడి ధర పెరగడానికి కారణమని నిపుణుల విశ్లేషణ. -
భారీగా క్షీణించిన బంగారం, వెండి ధర!
ముంబై: అమెరికా ఆర్ధిక వ్యవస్థలో సానుకూల జాబ్ డేటా ప్రభావంతో డాలర్ బలపడటంతో బులియన్ మార్కెట్ క్షీణించింది. బులియన్ మార్కెట్ లో బంగారం ధర సోమవారం 15 నెలల కనిష్ట స్థాయికి చేరుకుంది. రష్యా, ఉక్రెయిన్, సిరియా సంక్షోభాల నేపథ్యంలో బంగారం ధర పెరగకపోవడంపై మార్కెట్ విశ్లేషకులకు సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సోమవారం మధ్యాహ్నం సమయానికి 10 గ్రాముల బంగారం ధర 1.73 శాతంతో 467 రూపాయలు క్షీణించి 26534 వద్ద, బంగారం 2.1 శాతం నష్టంతో 814 రూపాయలు పతనమై 37888 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. ప్లాటినమ్ ధర కూడా 2009 నాటి కనిష్టాన్ని నమోదు చేసుకుంది. 'డాలర్ బలపడటం బంగార ధరల క్షీణించడానికి కారణమవుతోంది. బులియన్ మార్కెట్ లో బేరిష్ సెంటిమెంట్ కోనసాగుతోంది. బంగారం ధరలు త్వరలో పుంజుకోవచ్చు' అని పలువురు మార్కెట్ విశ్లేషకులు వెల్లడించారు. జాతీయ సెలవు దినం కారణంగా చైనా మార్కెట్లు పనిచేయడం లేదు. చైనా మార్కెట్టు తిరిగి బుధవారం తమ వ్యాపార కార్యక్రమాల్ని బుధవారం ప్రారంభం కానున్నాయి. -
రేపు దేశీయ మార్కెట్లకు సెలవు
ముంబై: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశీయ మార్కెట్లకు శుక్రవారం సెలవు ప్రకటించారు. బాంబే స్టాక్ ఎక్చ్సెంజ్, నేషనల్ స్టాక్ ఎక్చ్సెంజ్, ఫారెక్స్, మనీ, ఇతర కమాడిటీ మార్కెట్లతోపాటు బులియన్, ఆయిల్, ఆయిల్ సీడ్స్ మార్కెట్లు రేపు కార్యకలాపాలు నిర్వహించవు. దేశీయ మార్కెట్లన్ని యధావిధిగా సోమవారం తమ కార్యకలాపాలను కొనసాగిస్తాయి. -
రంజాన్ సందర్భంగా మార్కెట్లకు సెలవు
ముంబై: ఈద్ ఎల్ ఫితర్ (రంజాన్ ఈద్) సందర్భంగా రేపు దేశీయ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. బాంబే స్టాక్ ఎక్చ్సెంజ్(బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్సెంజ్, ఫారెక్స్, మానీ మార్కెట్, మెటల్, ఆయిల్, ఆయిల్ సీడ్ మార్కెట్లకు సెలవు. అయితే బులియన్, షుగర్ మార్కెట్ లు యధావిధిగా కార్యకలాపాలు కొనసాగిస్తాయి. -
సగానికి తగ్గిన పసిడి ప్రీమియం
ముంబై/ సింగపూర్: బంగారం దిగుమతులపై ఆంక్షలను మోడీ ప్రభుత్వం సడలిస్తుందన్న అంచనాలతో పసిడిపై ప్రీమియం ఈ వారంలో సగానికి తగ్గిపోయింది. ఔన్సు (31.1 గ్రాములు) పుత్తడిపై ప్రీమియం గత వారంలో 80-90 డాలర్లుండగా ఇపుడది 30-40 డాలర్లకు క్షీణించిందని డీలర్లు తెలిపారు. ధరలు తగ్గినప్పటికీ ఇతర ఆసియా దేశాల్లో బంగారానికి డిమాండు పెరగలేదు. భారీగా పెరిగిన కరెంటు అకౌంటు లోటును అదుపు చేసేందుకు కేంద్రం గతేడాది జూలై నుంచి బంగారం దిగుమతులపై తీవ్ర ఆంక్షలు విధించింది. దిగుమతి చేసుకున్న పసిడిలో 20 శాతాన్ని తిరిగి ఎగుమతి చేయాలనే నిబంధన (80:20 ఫార్ములా) కూడా పెట్టింది. కరెంటు అకౌంటు లోటు అదుపులోకి వచ్చిన నేపథ్యంలో దిగుమతులపై ఆంక్షలను కొత్త ప్రభుత్వం సడలించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఆంక్షలను సడలించడానికి ముందు విధాన, ఆర్థికాంశాలనే కాకుండా ప్రజలు, వ్యాపారుల ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని ప్రధాని మోడీ చెప్పారు. పసిడి దిగుమతులకు స్టార్ ట్రేడింగ్ హౌస్‌లను అనుమతిస్తూ రిజర్వు బ్యాంకు ఇటీవలే ఆంక్షలు సడలించింది. త్వరలోనే మరిన్ని సడలింపులు ఉంటాయనే అంచనాతో ప్రీమియంలు భారీగా తగ్గిపోయాయని అఖిల భారత రత్నాలు, ఆభరణాల వ్యాపారుల సమాఖ్య డెరైక్టర్ బచ్‌రాజ్ బామాల్వా తెలిపారు. 80:20 ఫార్ములాను పూర్తిగా తొలగించే వరకు ప్రీమియంలు ఇక తగ్గబోవని భావిస్తున్నట్లు చెప్పారు. ఏమిటీ ప్రీమియం..: బంగారం దిగుమతి ధరతో పోలిస్తే ఏడాదికాలంగా భారత్‌లో ఎక్కువ రే టు పలుకుతోంది. ఈ అధిక ధరనే ప్రీమియంగా పరిగణిస్తాం. మన దేశంలోకి దిగుమతి చేసుకునే సంస్థలే ఈ ప్రీమియంను వసూలు చేస్తున్నాయి. ఉదాహరణకు ప్రపంచ మార్కెట్లో ఔన్సు బంగారం ధర ప్రస్తుతం 1245 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ధరకు 11.5 శాతం దిగుమతి సుంకాలు కలిపితే 1388 డాలర్ల చొప్పున ఇక్కడి మార్కెట్లో విక్రయించాలి. కానీ దీనికి మరో 30 డాలర్లను ప్రీమియంగా కలుపుకొని 1418 డాలర్ల వరకూ దిగుమతి సంస్థలు ఇక్కడి బులియన్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. దాంతో ఇక్కడ 10 గ్రాముల ధరపై అదనంగా రూ. 600 భారం వినియోగదారులపై పడుతోంది. గతేడాది ఈ ప్రీమియం రూ. 3,000 వరకూ కూడా చేరింది. తదుపరి క్రమేపీ తగ్గుతూ వచ్చింది. బంగారం, వెండిపై దిగుమతి టారిఫ్ విలువ తగ్గింపు న్యూఢిల్లీ: ప్రభుత్వం సోమవారం బంగారం, వెండి దిగుమతులపై టారిఫ్ విలువను తగ్గించింది. పసిడి 10 గ్రాముల టారిఫ్ విలువను 424 డాలర్ల నుంచి 408 డాలర్లకు తగ్గించింది. వెండి కేజీ విషయంలో ఈ విలువను 650 డాలర్ల నుంచి 617 డాలర్లకు తగ్గించింది. అంతర్జాతీయంగా ధరల బలహీన ధోరణి దీనికి కారణం. టారిఫ్‌లను తగ్గిస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రధానంగా దిగుమతులపై కస్టమ్స్ సుంకం విధింపునకు ఈ టారిఫ్ విలువ(బేస్ ధర)ను సీబీఈసీ పరిగణనలోకి తీసుకుంటుంది. విలువను తక్కువచేసి చూపేందుకు(అండర్ ఇన్వాయిసింగ్) ఆస్కారం లేకుండా చేయడమే దీని ప్రధానోద్దేశం. సహజంగా 5 శాతం మేర మార్పు ఉంటే స్పాట్ మార్కెట్లో ఈ విలువ ప్రభావం పడే అవకాశం ఉంటుందన్నది నిపుణుల విశ్లేషణ. -
రేపు భారత స్టాక్ మార్కెట్లకు సెలవు
న్యూఢిల్లీ: శ్రీరామ నవమి పండగ సందర్భంగా మంగళవారం భారత స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. బాంబే స్టాక్ ఎక్సేంజ్, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్, ఫారెక్స్, మనీ మార్కెట్లు రేపు పనిచేయవం. హోల్ సేల్ కమాడిటి, బులియన్, మెటల్ మార్కెట్లలకు కూడా పండగ సందర్భంగా సెలవు ప్రకటించారు. సోమవారం నాటి మార్కెట్లలో సెన్సెక్స్ (-16) పాయింట్ల నష్టంతో, నిఫ్టీ క్రితం ముగింపు వద్ద ముగిసాయి. -
తగ్గిన బంగారం మెరుపు
ముంబై: దేశీయ ప్రధాన బులియన్ స్పాట్ మార్కెట్ ముంబైలో శుక్రవారం పసిడి, వెండి ధరలు భారీగా తగ్గి, రూ. 31 వేల దిగువకు పడ్డాయి. పూర్తి స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.795 తగ్గి రూ.30,930కి చేరింది. ఆభరణాల బంగారం ధర రూ.780 దిగి రూ.30,780కి వచ్చింది. ఇక వెండి కేజీ ధర రూ. 1,615 దిగివచ్చి రూ.54,185కు పడింది. అంతర్జాతీయ మార్కెట్లో బలహీన సంకేతాలు, స్టాకిస్టులు-ఇన్వెస్టర్ల భారీ అమ్మకాలు, తగ్గిన డిమాండ్, డాలర్ మారకంలో రూపాయి బలోపేతం వంటి అంశాలు దీనికి కారణం. -
పసిడిపై సుంకాలు మరింత పెంపు
న్యూఢిల్లీ: రూపాయి పతనానికి అడ్డుకట్ట వేయడానికి, కరెంటు అకౌంటు లోటు(క్యాడ్) కట్టడికి కేంద్రం సోమవారం మరిన్ని చర్యలు ప్రకటించింది. వీటి కారణంగా బంగారం, వెండి, నిత్యావసరం కాని వస్తువుల దిగుమతులపై సుంకాలు మరింత పెరగనున్నాయి. ఇందుకు సంబంధించిన కస్టమ్స్ నోటిఫికేషన్లను మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంటు ఉభయసభల్లో ఈ మేరకు ప్రకటనలు చేసిన అనంతరం ఆర్థిక మంత్రి పి. చిదంబరం మీడియాకు ఈ విషయాలు చెప్పారు. అయితే, పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున, సుంకాల పెంపు ఎంత మేర ఉంటాయన్నది సభ వెలుపల వెల్లడించలేనని ఆయన తెలిపారు. ఈ చర్యలతో క్యాడ్ 3.7%కి(70 బిలియన్ డాలర్లు) కట్టడి కాగలదని ఆయన తెలిపారు. పసిడి, చమురు దిగుమతుల భారంతో 2012-13లో క్యాడ్ ఆల్‌టైం గరిష్టమైన 4.8 శాతానికి ఎగిసింది. విదేశీ రుణాల నిబంధనలు సడలించడంతో ఈ ఏడాది అదనంగా 11 బిలియన్ డాలర్ల నిధులు తరలిరావొచ్చని చిదంబరం చెప్పారు. చమురు సంస్థలకు విదేశీ రుణాలు.. పెట్టుబడులను పెంచే దిశగా తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ.. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు విదేశీ వాణిజ్య రుణ (ఈసీబీ) రూపంలో దాదాపు 4 బిలియన్ డాలర్ల మేర నిధులు సమీకరించేందుకు అనుమతించినట్లు చిదంబరం పేర్కొన్నారు. దీని ప్రకారం ఐవోసీ 1.7 బిలియన్ డాలర్లు, బీపీసీఎల్.. హెచ్‌పీసీఎల్ చెరి 1 బిలియన్ డాలర్ల మేర నిధులు సమీకరించుకోవచ్చు. మరోవైపు మౌలిక రంగ రుణ అవసరాల కోసం ఐఆర్ఎఫ్సీ, పీఎఫ్సీ, ఐఐఎఫ్‌సీఎల్ కలిసి క్వాసీ-సావరీన్ బాండ్ల ద్వారా 4 బిలియన్ డాలర్ల మేర నిధులు సమీకరించేందుకు అనుమతించనున్నట్లు చిదంబరం తెలిపారు. ఐఐఎఫ్‌సీఎల్, పీఎఫ్సీ చెరి 1.5 బిలియన్ డాలర్లు, ఐఆర్ఎఫ్సీ 1 బిలియన్ డాలర్ల దీర్ఘకాలిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రుణాలు సమీకరించవచ్చన్నారు. భారత్‌లో బహుళజాతి సంస్థల అనుబంధ కంపెనీలు తమ మాతృసంస్థల నుంచి నిధులు పొందేందుకు వీలు కల్పిస్తూ ఆర్బీఐ సర్క్యులర్ జారీ చేస్తుందని చిదంబరం చెప్పారు. ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థలు జారీ చేసే ట్యాక్స్ ఫ్రీ బాండ్లలోసావరీన్ వెల్త్ ఫండ్స్ సుమారు 30 శాతం దాకా ఇన్వెస్ట్ చేయొచ్చని పేర్కొన్నారు. ఎన్ఆర్ఈ డిపాజిట్స్ నిబంధనల సడలింపు.. నాన్ రెసిడెంట్ డిపాజిట్ పథకాల (ఎన్ఆర్ఈ/ఎఫ్సీఎన్ఆర్) వడ్డీ రేట్లపై నియంత్రణ ఎత్తివేస్తున్నట్లు చిదంబరం వివరించారు. ఎఫ్సీఎన్ఆర్ అకౌంట్లకు సంబంధించి మూడేళ్లు, అంతకు పైబడిన కాల వ్యవధికి సంబంధించిన డిపాజిట్లపై వడ్డీ రేట్లను డీరెగ్యులేట్ చేస్తున్నట్లు చిదంబరం తెలిపారు.