బంగారం మళ్లీ తగ్గిందా.. తులం ఎంత? | Today Gold And Silver Prices December 16th, 2024 In India Hyderabad And Other Cities, See Cost Details Inside | Sakshi
Sakshi News home page

Today Gold And Silver Prices: బంగారం మళ్లీ తగ్గిందా.. తులం ఎంత?

Published Mon, Dec 16 2024 12:18 PM | Last Updated on Mon, Dec 16 2024 12:28 PM

Gold and Silver Price Today On 16 December 2024

Gold Price Today: దేశంలో బంగారం ధరలు తగ్గుముఖంలో పయనిస్తున్నాయి. రెండు రోజులు వరుస భారీ తగ్గుదల తర్వాత రెండురోజులుగా నిలకడగా కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా సోమవారం (డిసెంబర్‌ 16) పసిడి రేట్లు స్థిరంగా ఉన్నాయి. ఐదు రోజులుగా పుత్తడి ధరలు పెరగకపోవడంతో పసిడి ప్రియులు కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఈరోజు పసిడి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తే.. హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ సహా  ఇరు తెలుగు రాష్ట్రాలోని  వివిధ ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం  10 గ్రాముల ధర  రూ.71,400 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ.77,890 వద్ద ఉన్నాయి.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.71,550 వద్ద, 24 క్యారెట్ల పసిడి రూ.78,040 వద్ద కొనఉన్నాయి. చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాలలో 22 క్యారెట్ల బంగారం రూ.71,400, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.77,890 లుగా ఉన్నాయి.

ఇదీ చదవండి: పదేళ్లలో ఇదే ప్రచండ బంగారం! కొత్త ఏడాదిలోనూ కొనసాగుతుందా?

మరోవైపు దేశవ్యాప్తంగా వెండి ధరలు (Silver Price Today) కూడా నేడు నిలకడగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో వెండి కేజీ ధర రూ.1,00,000 వద్ద, ఢిల్లీలో రూ.92,500 వద్ద ఉంది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement