Gold Price Today: దేశంలో బంగారం ధరలు తగ్గుముఖంలో పయనిస్తున్నాయి. రెండు రోజులు వరుస భారీ తగ్గుదల తర్వాత రెండురోజులు ఎలాంటి పెరుగుదల లేకుండా నిలకడగా కొనసాగాయి. అంతలోనే ఆశాభంగం.. దేశవ్యాప్తంగా మంగళవారం (డిసెంబర్ 17) పసిడి రేట్లు మళ్లీ పెరుగుదలను నమోదు చేశాయి.
రెండు తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఈరోజు పసిడి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తే.. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా ఇరు తెలుగు రాష్ట్రాలోని వివిధ ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.71,500 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ.78,000 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోల్చితే వీటి ధరలు వరుసగా రూ.100, రూ.110 చొప్పున పెరిగాయి.
ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.100 పెరిగి రూ.71,650 వద్దకు, 24 క్యారెట్ల పసిడి రూ.110 ఎగిసి రూ.78,150 వద్దకు చేరాయి. చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాలలో 22 క్యారెట్ల బంగారం రూ.100, 24 క్యారెట్ల బంగారం రూ.110 పెరిగాయి. వీటి ధరలు ప్రస్తుతం రూ.71,500, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.78,000 లుగా ఉన్నాయి.
ఇదీ చదవండి: పదేళ్లలో ఇదే ప్రచండ బంగారం! కొత్త ఏడాదిలోనూ కొనసాగుతుందా?
మరోవైపు దేశవ్యాప్తంగా వెండి ధరలు (Silver Price Today) మూడో రోజు కూడా నిలకడగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో వెండి కేజీ ధర రూ.1,00,000 వద్ద, ఢిల్లీలో రూ.92,500 వద్ద ఉంది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)
Comments
Please login to add a commentAdd a comment