Gold Price Today: దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. రెండు రోజుల క్రితం రోజున స్వల్పంగా తగ్గిన పసిడి రేట్లు నేడు (డిసెంబర్ 30) అంతే స్థాయిలో పుంజుకున్నాయి. బంగారం ధరలు ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి.
తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఈరోజు పసిడి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తే.. హైదరాబాద్ (Hyderabad), విశాఖపట్నం, విజయవాడ సహా ఇరు తెలుగు రాష్ట్రాలోని వివిధ ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.71,500 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ.78,000 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోల్చితే వీటి ధరలు వరుసగా రూ.150, రూ.160 చొప్పున పెరిగాయి.
ఇక దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.150 పెరిగి రూ.71,650 వద్దకు, 24 క్యారెట్ల పసిడి రూ.160 ఎగిసి రూ.78,150 వద్దకు చేరాయి. చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాలలో 22 క్యారెట్ల బంగారం రూ.150, 24 క్యారెట్ల బంగారం రూ.160 పెరిగాయి. వీటి ధరలు ప్రస్తుతం రూ.71,500, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.78,000 లుగా ఉన్నాయి.
మరోవైపు దేశవ్యాప్తంగా వెండి ధరలు (Silver Price Today) నేడు నిలకడగా ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో వెండి కేజీ ధర రూ.99,900 వద్ద, ఢిల్లీలో రూ.92,400 వద్ద ఉన్నాయి.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)
Comments
Please login to add a commentAdd a comment