మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు!
పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడినా కూడా బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. శనివారం నాటి బులియన్ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర రూ. 100 మేర తగ్గి రూ. 28,400కు చేరుకుంది. నగల వ్యాపారులు, రీటైలర్ల నుంచి డిమాండ్ తగ్గడంతో పాటు అంతర్జాతీయంగా కూడా బలహీన ట్రెండ్లు కొనసాగడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
వెండి ధరలు కూడా కిలోకు రూ. 65 మేర తగ్గి, రూ. 40,035కు చేరుకున్నాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండు తగ్గడంతో వెండి ధర తగ్గిందని చెబుతున్నారు. ఢిల్లీలో 99.9, 99.5 శాతం స్వచ్ఛ బంగారం ధరలు పది గ్రాములకు రూ. 28,400, రూ. 28,200 చొప్పున ఉన్నాయి.