ముంబై: దేశీయ ప్రధాన బులియన్ స్పాట్ మార్కెట్ ముంబైలో శుక్రవారం పసిడి, వెండి ధరలు భారీగా తగ్గి, రూ. 31 వేల దిగువకు పడ్డాయి. పూర్తి స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.795 తగ్గి రూ.30,930కి చేరింది. ఆభరణాల బంగారం ధర రూ.780 దిగి రూ.30,780కి వచ్చింది. ఇక వెండి కేజీ ధర రూ. 1,615 దిగివచ్చి రూ.54,185కు పడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బలహీన సంకేతాలు, స్టాకిస్టులు-ఇన్వెస్టర్ల భారీ అమ్మకాలు, తగ్గిన డిమాండ్, డాలర్ మారకంలో రూపాయి బలోపేతం వంటి అంశాలు దీనికి కారణం.
తగ్గిన బంగారం మెరుపు
Published Sat, Sep 7 2013 2:34 AM | Last Updated on Thu, Aug 2 2018 3:54 PM
Advertisement