రేపు దేశీయ మార్కెట్లకు సెలవు
ముంబై: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశీయ మార్కెట్లకు శుక్రవారం సెలవు ప్రకటించారు. బాంబే స్టాక్ ఎక్చ్సెంజ్, నేషనల్ స్టాక్ ఎక్చ్సెంజ్, ఫారెక్స్, మనీ, ఇతర కమాడిటీ మార్కెట్లతోపాటు బులియన్, ఆయిల్, ఆయిల్ సీడ్స్ మార్కెట్లు రేపు కార్యకలాపాలు నిర్వహించవు.
దేశీయ మార్కెట్లన్ని యధావిధిగా సోమవారం తమ కార్యకలాపాలను కొనసాగిస్తాయి.