Commodity Markets
-
దేశంలో బంగారం ధరలు..రూ.60 వేల మార్కును దాటేసింది..
ఏప్రిల్ 1 నుంచి బంగారం కొనుగోళ్ల సీజన్ ప్రారంభం కానుంది. ఈ తరుణంలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్, క్రెడిట్ సూసే బ్యాంకు సంక్షోభాల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా మరిన్ని దేశాలకు విస్తరించొచ్చన్న భయాలు బంగారం ధరల పెరుగుదలకు దారితీశాయి. దీంతో గత రెండు వారాల్లో బంగారం ధరలు 7 శాతం పెరిగాయి. తాజాగా మంగళవారం రోజు బంగారం ధర మరింత పెరిగింది. మార్చి 21న దేశంలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,050 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,050గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,927 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,285 గా ఉంది. ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,150 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 60,150 గా ఉంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,000 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60వేలకు చేరింది ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,000 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.60వేలకు చేరింది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,000 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.60 వేలకు చేరింది వైజాగ్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,000 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.60వేలకు చేరింది. చదవండి👉 కొనడం కష్టమేనా : రాకెట్ వేగంతో దూసుకుపోతున్న బంగారం ధరలు! -
బలిప్రతిపాద: స్టాక్‌మార్కెట్లకు బుధవారం సెలవు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లకు బుధవారం సెలవు. బలిప్రతిపాద సందర్భంగా బీఎస్ఈ, ఎన్సీఈ మార్కెట్లు పనిచేయవు. బులియన్ సహా హోల్‌సేల్ కమోడిటీ మార్కెట్లు కూడా పనిచేయవు. ఫారెక్స్, కమోడిటీ ఫ్యూచర్స్ మార్కెట్లలో కూడా ఎలాంటి ట్రేడింగ్ కార్యకలాపాలు ఉండవు. బలి ప్రతిపాదను బలిపాడ్యమి, పాడ్వ, విరప్రతిపాద లేదా ద్యుతప్రతిపాద అని కూడా పిలుస్తారు. దీపావళికి నాలుగు రోజుల తరువాత వచ్చే ఈ పండుగను దైత్య రాజు బలి చక్రవర్తి భూమిపైకి వచ్చే రోజుగా భావిస్తారు. కాగా అక్టోబర్ 25న, సెన్సెక్స్ 287.70 పాయింట్లు లేదా 0.48శాతం క్షీణించి 59,544 వద్ద నిఫ్టీ 74.50 పాయింట్లు లేదా 0.42శాతం క్షీణించి 17,656 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. -
భారత్‌లో మంట రేపుతున్న ధరలు!
సాక్షి, హైదరాబాద్: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రభావం మన దేశంలో ధరల మంట రేపుతోంది. ఆ రెండు దేశాల నుంచి భారీగా దిగుమతి అయ్యే ఉత్పత్తులకు ఇప్పటికే రెక్కలురాగా.. త్వరలో పెట్రోల్, డీజిల్ పెరుగుతాయని, ఆ ప్రభావం నిత్యావసరాల ధరలపై పడుతుందన్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. యుద్ధం నేపథ్యంలో రష్యా, యూరోపియన్ దేశాలు, అమెరికాల మధ్య పరస్పర ఆంక్షల కారణంగా.. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్– సరఫరాల మధ్య సమతుల్యత దెబ్బతింటోంది. ఆయా దేశాల నుంచి జరిగే ఎగుమతులు, దిగుమతుల్లో మార్పులు ఉత్పత్తుల ధరలపై ప్రభావం చూపుతోంది. నూనెలు, స్టీల్, పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ఇప్పటికే మోతమోగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర శనివారం 118 డాలర్లకు చేరుకుంది. దీనితో అంతర్జాతీయంగా రవాణా వ్యయం పెరుగుతోంది. కాగుతున్న ‘సన్‌ఫ్లవర్’ మన దేశానికి ప్రధానంగా రష్యా, ఉక్రెయిన్ దేశాల నుంచే పొద్దుతిరుగుడు (సన్‌ఫ్లవర్) నూనె దిగుమతి అవుతుంది. యుద్ధానికి ముందు రిటైల్ మార్కెట్లో ఈ నూనె లీటర్‌కు రూ.135 నుంచి రూ.140 మధ్య ఉండేది. కానీ ఈ పది రోజుల్లోనే రూ.165 నుంచి రూ.175 వరకు పెరిగింది. దీనితోపాటు వాణిజ్య అవసరాలకు, సబ్బులు, కాస్మెటిక్స్ తయారీలో ఎక్కువగా వినియోగించే పామాయిల్ ధర కూడా లీటర్‌పై రూ.25కు పైగా పెరిగి రూ.153కు చేరింది. కొరత వస్తుందన్న ఉద్దేశంతో.. ఆయిల్ కంపెనీలు ధరలు పెంచక ముందే ఏజెన్సీలు, హోల్‌సేల్ డిస్ట్రిబ్యూటర్లు సన్‌ఫ్లవర్, పామాయిల్ నూనెను బ్లాక్ మార్కెట్‌కు తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. హైదరాబాద్ బేగంబజార్ హోల్‌సేల్ మార్కెట్లో వ్యాపారులు 15 లీటర్ల క్యాన్‌పై రూ.500 వరకు ధర పెంచి అమ్ముతున్నట్టు తెలిసింది. ఫర్టిలైజర్స్, ఫార్మా, మెటల్స్‌పై.. క్రూడాయిల్ ధరల పెరుగుదలతోపాటు అంతర్జాతీయంగా సరకు రవాణా నౌకాయానంపై ఆంక్షలు, షిప్పింగ్ చార్జీలు పెరగడం, రష్యా–యూరోపియన్ దేశాల మధ్య సంబంధాలకు గండిపడడం వంటి కారణాలతో.. ఆయా దేశాల్లో తయారయ్యే ముడిసరుకుల ధరలకు రెక్కలొస్తున్నాయని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ముడిసరుకుల దిగుమతి తగ్గిపోతే.. ఫర్టిలైజర్లు, ఫార్మాస్యుటికల్స్, పౌల్ట్రీ, వ్యవసాయ ఉత్పత్తులు, బంగారం, ఇతర మెటల్స్ ధరలు భారీగా పెరుగుతాయని స్పష్టం చేస్తున్నారు. వంటింటిపై పరోక్ష ప్రభావం విదేశాల నుంచి నౌకల ద్వారా సరకు రవాణాకు ఇబ్బంది వస్తే.. వంటింటి ఖర్చుల మీద దెబ్బపడనుంది. కోళ్ల దాణా కొరత, ఇతర కారణాలతో చికెన్ రేట్లు పెరుగుతున్నాయి. ధనియాలు, జీలకర్ర, సోయాబీన్ వంటివాటి ధరలు పెరుగుతాయి. గోధుమలు ధరలు పెరిగితే.. దాని ఉప ఉత్పత్తులన్నింటిపై ప్రభావం పడుతుంది. దేశ గోదాముల్లో నిల్వ ఉన్న గోధుమలు, బియ్యం ఎగుమతి చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ.. సామాన్యుడికి ఒరిగేదేమీ లేదని ఆర్థిక నిపుణుడు పాపారావు తెలిపారు. నూనె.. ఆ రెండు దేశాల నుంచే.. భారతదేశంలో ఏటా 25 లక్షల టన్నుల సన్‌ఫ్లవర్ నూనెను వినియోగిస్తారని కేంద్ర వాణిజ్య శాఖ లెక్కలు చెప్తున్నాయి. అందులో మన దేశంలో ఉత్పత్తి అయ్యేది కేవలం 50 వేల టన్నులే. 2020–21లో 22 లక్షల టన్నుల సన్‌ఫ్లవర్ నూనెను దిగుమతి చేసుకోగా.. అందులో ఉక్రెయిన్ నుంచి 17.4 లక్షల టన్నులు, రష్యా నుంచి 2.8 లక్షల టన్నులు ఉన్నట్టు సమాచారం. ఈ రెండింటితోపాటు అర్జెంటీనా నుంచి కూడా సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతి అవుతోంది. 2019–20లో మొత్తంగా 25 లక్షల టన్నుల నూనెను భారత్ దిగుమతి చేసుకుందని గణాంకాలు చెప్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు ఉక్రెయిన్, రష్యాల నుంచి 5,50,000 టన్నుల సన్‌ఫ్లవర్ నూనెను భారత్ దిగుమతి చేసుకుందని ఇంటర్నేషనల్ సన్‌ఫ్లవర్ ఆయిల్ అసోసియేషన్ అధ్యక్షుడు సందీప్ బజోరియా పేర్కొన్నారు. త్వరలో పెట్రోల్, డీజిల్ వాత యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. గత నెల 28వ తేదీన 100 డాలర్లుగా ఉన్న క్రూడాయిల్ బ్యారెల్ ధర ఐదు రోజుల్లో 18 డాలర్లు పెరిగి 118 డాలర్లకు చేరుకుంది. చమురు సంస్థలు ఇప్పటికే బల్క్ డీజిల్ ధరలను భారీగా పెంచారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో రిటైల్ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచకుండా కేంద్రమే భరిస్తోంది. ఈ ఎన్నికల ప్రక్రియ 7వ తేదీతో ముగియనుండడంతో.. రిటైల్ పెట్రోల్, డీజిల్ ధరల మోత మోగనుందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. సగటున లీటర్‌కు రూ.10 నుంచి రూ.15 వరకు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. అన్నింటి ధరలు పెరుగుతాయి యుద్ధం నేపథ్యంలో రష్యా, ఉక్రెయిన్ల నుంచి దిగుమతి చేసుకునే పెట్రోలియం, నేచురల్ గ్యాస్, సన్‌ఫ్లవర్, పామాయిల్ ధరలు సహజంగానే పెరుగుతాయి. వీటికి తోడు యుద్ధం వల్ల పరోక్షంగా కూడా వివిధ వస్తువులు, ఉత్పత్తుల ధరలపై ప్రభావం పడుతుంది. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. బంగారం, మినరల్స్, మెటల్స్, ఇతర ఆర్నమెంట్ల ధరలు పెరుగుతాయి. – ప్రొఫెసర్ నర్సింహారెడ్డి, ఆర్థిక నిపుణుడు సరకు రవాణాపై తీవ్ర భారం అమెరికాలో ఉద్ధీపన పథకాల వల్ల కొనుగోలు శక్తి పెరిగింది. తద్వారా అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగాయి. తాజాగా ఉక్రెయిన్, రష్యా యుద్ధంతో క్రూడాయిల్ ధరలకు రెక్కలొచ్చాయి. ఈ ప్రభావం మన దేశంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రతి రంగంపై పడుతుంది. నూనె, వ్యవసాయ ఉత్పత్తులు, పౌల్ట్రీ, మెటల్స్, కాస్మెటిక్స్‌తోపాటు ఫర్టిలైజర్స్, ఫార్మా ధరలు పెరిగే అవకాశం ఉంది. – పాపారావు, ఆర్థిక నిపుణుడు -
పసిడి భవితపై ‘ఫెడ్’ రేటు ప్రభావం
అమెరికా ఆర్థిక పరిస్థితి, కీలక వడ్డీ రేట్లపై (ప్రస్తుతం 2.25 నుంచి 2.50 శాతం శ్రేణి) బుధవారం (20వ తేదీ) ఫెడరల్ రిజర్వ్ పరపతి సమీక్షా కమిటీ తీసుకునే నిర్ణయంపై పసిడి సమీప భవిష్యత్ ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ ఫ్యూచర్స్ కమోడిటీ మార్కెట్– నైమెక్స్‌లో ఔన్స్ (31.1గ్రా) 1,200 డాలర్ల నుంచి ప్రారంభమైన పసిడి తాజా ర్యాలీకి 1,346 డాలర్ల వద్ద తీవ్ర నిరోధం ఎదురయిన సంగతి తెలిసిందే. అటు తర్వాత కీలకమైన 1,300 డాలర్ల లోపునకు పడిపోయినా, పటిష్టంగా కొనసాగుతోంది. 15వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో 4 డాలర్ల లాభంతో 1,302 డాలర్ల వద్ద ముగిసింది. అమెరికా ఆర్థిక వృద్ధి, డాలర్ కదలికలు (15వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో 96), అమెరికా, చైనా వాణిజ్య యుద్ధం వంటి అంశాలపై తదుపరి పసిడి కదలికలు ఆధారపడి ఉంటాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే సమీపకాలంలో పసిడి ధోరణి పటిష్టంగానే ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లో పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు సైతం తమ విదేశీ మారకద్రవ్య నిల్వల్లో భాగంగా పసిడి కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. దేశంలో 32–33 వేల మధ్య స్థిరీకరణ ... కాగా డాలర్ మారకంలో రూపాయి పటిష్టత దేశీయ పసిడి ధరపై ప్రభావం చూపుతోంది. దేశీయ ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో శుక్రవారం 24పైసలు లాభపడి 69.10కి చేరిన సంగతి తెలిసిందే. గడచిన ఐదు రోజుల్లో 104 పైసలు బలపడింది. అందువల్ల పసిడి అంతర్జాతీయ భారీగా పెరిగినా, దేశీయంగా సమీప కాలంలో అంతర్జాతీయ పెరుగుదల ధోరణి పూర్తిస్థాయిలో ప్రతిబింబించకపోవచ్చన్నది నిపుణుల అభిప్రాయం. అయితే ఆయా అంశాల నేపథ్యంలోదేశీయంగా పసిడి 10 గ్రాముల ధర రూ.32,000–33,000 మధ్య స్థిరీకరణ పొందవచ్చన్నది విశ్లేషణ. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ ఎంసీఎక్స్‌లో పసిడి 10 గ్రాముల ధర శుక్రవారం రూ. 31,826 వద్ద ముగిసింది. కాగా ముంబై స్పాట్ మార్కెట్లో 24, 22 క్యారెట్ల ధరలు వరుసగా రూ.32,870, రూ.31,300 వద్ద ముగిశాయి. -
స్టాక్, కమోడిటీ మార్కెట్లలోఎఫ్డీఐల పరిమితి పెంపు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మరిన్ని విదేశీ ఇన్వెస్ట్మెం ట్లను ఆకర్షించడం కోసం దేశీ స్టాక్, కమోడిటీ మార్కెట్లలో వాటి పెట్టుబడుల పరిమితిని 15 శాతం వరకు పెంచింది. ఇదివరకు ఈ పరిమితి 5 శాతంగా ఉండేది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో ప్రాథమిక కేటాయింపుల ద్వారా షేర్లను పొందటానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. తాజా చర్యలతో అంతర్జాతీయ విధానాలను, సాంకేతికతను మన స్టాక్ ఎక్స్ఛేంజీలలో ప్రవేశపెట్టడం వల్ల వీటి సామర్థ్యం మరింత పెరగనున్నది. -
పసిడి..పరుగో పరుగు
అంతర్జాతీయ మార్కెట్లో దూకుడు ♦ రెండేళ్ల గరిష్టానికి జూమ్, 1,300 డాలర్లపైకి ♦ దేశీయంగానూ అదే ధోరణి... ♦ 4 రోజుల్లో 10గ్రా.లకు రూ. 1,100 అప్ న్యూయార్క్/ముంబై: పసిడి పరుగులు పెడుతోంది. అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్ నెమైక్స్‌లో చురుగ్గా ట్రేడవుతున్న ఆగస్టు డెలివరీ ధర ఔన్స్ (31.1గ్రా)కు కీలకమైన 1,300 డాలర్ల స్థాయిని దాటింది.ఇది రెండేళ్ల గరిష్టస్థాయి. కడపటి సమాచారం అందే సరికి క్రితం కన్నా దాదాపు 17 డాలర్లు అధికంగా 1,305 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.ఈ స్థాయిని దాటితే పసిడి మరింత బలపడుతుందన్నది కొందరు నిపుణుల విశ్లేషణ. ఇక వెండి పరిస్థితి ఇదే ధోరణిగా ఉంది. దాదాపు ఒకశాతం లాభంతో 18 డాలర్లకు సమీపంలో ట్రేడవుతోంది. ఇదే బాటలో భారత్‌లోనూ పెరుగుతోంది. సోమవారం నుంచి గడచిన నాలుగు రోజుల్లో 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర ముంబై ప్రధాన బులియన్ మార్కెట్లో దాదాపు రూ.1,100 పెరిగింది. వెండి కేజీ ధర సైతం రూ.1,200కుపైగా పెరిగింది. బుధవారంతో పోల్చితే గురువారం ధరలు 99.9 స్వచ్ఛత రూ.475 ఎగిసి రూ.30,400కు చేరింది. 99.5 స్వచ్ఛత ధర సైతం అంతే స్థాయిలో ఎగిసి రూ.30,250కి చేరింది. ఇక వెండి ధర కేజీకి రూ.670 ఎగిసి రూ.42,340కి చేరింది. కాగా ఢిల్లీ, చెన్నై మార్కెట్లలో రూ.31,000 పైకి ఇప్పటికే పసిడి చేరడం గమనార్హం. ఫ్యూచర్స్ మార్కెట్లో పరుగు దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో గురువారం రాత్రి కడపటి సమాచారం అందేసరికి పసిడి పరుగులు పెడుతోంది. 10 గ్రాముల ధర 2 శాతం పైగా (రూ.650) లాభంతో రూ.31,092 వద్ద ట్రేడవుతోంది. వెండి సైతం 2 శాతం లాభంతో (రూ.700) రూ.42,235 వద్ద ట్రేడవుతోంది. కారణాలు ఏమిటి? అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఫండ్ రేటును 0.50 శాతం నుంచి పైకి పెంచకుండా... తటపటాయిస్తుండడం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఇంకా బలహీనతలోనే ఉందన్న అంచనాలకు బలం చేకూరాయి. పైగా ఉపాధి కల్పన, డిమాండ్లకు సంబంధించి అమెరికా మే గణాంకాలు ప్రతికూలంగా ఉండడమూ ఆందోళన కలిగించింది. దీనితో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు పసిడిని భద్రమైన మార్గంగా భావించడం మొదలుపెట్టారు. దీనికితోడు యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోతే... భవిష్యత్ ఆర్థిక పరిస్థితి ఏమిటన్న అంశంపై సైతం ఆందోళనలు మొదలయ్యాయి. ఆయా అంశాలు అంతర్జాతీయంగా పసిడి దూసుకుపోడానికి కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. డిస్కౌంట్లో బంగారం! పుత్తడి రూ. 30,000 దాటినా ప్రపంచ మార్కెట్లో పలుకుతున్న ధరకంటే మన దేశంలో తక్కువకే దొరికేస్తోంది. ఇక్కడ పుత్తడికి వున్న మోజు కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌తో పోలిస్తే గతంలో మన నగరాల్లో అధిక ధర వుండేది. అలాంటిది, అనూహ్యంగా భారత్‌లో డిమాండ్ లేక బులియన్ ట్రేడర్లు ఇప్పుడు 2-3 శాతం చౌకగా అమ్మేస్తున్నారు. పైగా జూన్-జూలై నెలల్లో సాధారణంగా బంగారానికి గిరాకీ తక్కువ. దాంతో ప్రపంచ మార్కెట్‌తో పోలిస్తే ఇక్కడ ఔన్సు బంగారం (31.1 గ్రాములు) 48 డాలర్ల డిస్కౌంట్లో లభిస్తోంది. అక్కడ రూ. 31,000, ఇక్కడ రూ. 30,000 వివిధ అంతర్జాతీయ అంశాల కారణంగా న్యూయార్క్‌లో గురువారం పసిడి ధర ఔన్సుకు 1,310 డాలర్లు దాటింది. అంటే పది గ్రాముల ధర 421.2 డాలర్లు. ప్రస్తుత డాలరుతో రూపాయి మారకపు విలువ 67.30 ప్రకారం ఇది రూ. 28,350 అవుతుంది. దీనికి 10 శాతం దిగుమతి సుంకాన్ని కలుపుకుంటే ధర 31,180కి చేరుతుంది. ఇదే ట్రెండ్‌ను అనుసరించే ఇక్కడి మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో రూ.31,000పైన ట్రేడవుతున్నా, ముంబై బులియన్ మార్కెట్లో 99.9 స్వచ్ఛత గల బంగారం ధర గురువారం రూ. 30,400కే లభించింది. హైదరాబాద్‌లోనైతే ఇది రూ. 30,000 మాత్రమే. ఆయా రాష్ట్రాలు విధించే వ్యాట్‌కు అనుగుణంగా వివిధ నగరాల్లో రేట్లలో స్వల్ప తేడాలుంటాయి. ఈ ప్రకారం ముంబైతో పోలిస్తే హైదరాబాద్‌లో సాధారణంగా ధర ఎక్కువ వుంటుంది. అలాంటిది ఇప్పుడు ఈ నగరంలో ఇంకా ఎక్కువ డిస్కౌంట్‌కే బులియన్ వర్తకులు బంగారాన్ని ఆఫర్ చేస్తున్నారు. పుత్తడి కొనుగోళ్లకు ఇది సీజన్కాకపోవడం, ధర అధికస్థాయిలో వుండటంతో కొనుగోలు ఆసక్తి సన్నగిల్లడం వ ంటి కారణాలతో డిమాండ్ లేదని వర్తకులు అంటున్నారు. పడిపోతున్న దిగుమతులు... ప్రపంచంలోనే బంగారం వినియోగంలో టాప్‌లో వున్న భారత్‌కు గత నాలుగు నెలల నుంచి పుత్తడి దిగుమతులు పడిపోతున్నాయి. మే నెలలో దేశంలోకి దిగుమతుల పరిమాణం రీత్యా 51% క్షీణించి 31 టన్నులకు పడిపోగా, విలువరీత్యా 56 శాతం తగ్గుదలతో 1.47 బిలియన్ డాలర్లకు చేరినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఏప్రిల్లోనైతే ఈ దిగుమతులు 22 టన్నులే. 2015 పూర్తి సంవత్సరంలో భారత్ 850 టన్నుల పసిడిని దిగుమతి చేసుకున్నదంటే (నెలకు సగటున 70 టన్నులు), ప్రస్తుత దిగుమతులు ఎంత క్షీణించాయో అర్థం చేసుకోవొచ్చు. -
సెబీలో ఎఫ్ఎంసీ విలీనం
ఒకటైన రెండు నియంత్రణ సంస్థలు... - కమోడిటీ మార్కెట్లో విశ్వాసం పెంచుతాం - విదేశీ ఇన్వెస్టర్లు, బ్యాంకులకు అనుమతిస్తాం - సెబీ చైర్మన్ యు.కె. సిన్హా ముంబై: కమోడిటీ మార్కెట్లో విశ్వాసం పెంచడానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని సెబీ చైర్మన్ యు.కె. సిన్హా చెప్పారు. ఈ మార్కెట్లో పాల్గొనడానికి విదేశీ ఇన్వెస్టర్లను, బ్యాంక్‌లను అనుమతించడం ద్వారా కమోడిటీ మార్కెట్ అభివృద్ధి కోసం ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. సెక్యూరిటీల మార్కెట్ సెబీలో కమోడిటీ మార్కెట్‌ను నియంత్రించే ఫార్వార్డ్ మార్కెట్స్ కమిషన్(ఎఫ్ఎంసీ) విలీనమైన సందర్భంగా ఆయన మాట్లాడారు. కమోడిటీల ట్రేడింగ్‌లో తప్పులు జరగకుండా జాగ్రత్తగా వ్యహరిస్తామని సిన్హా చెప్పారు. విదేశీ ఇన్వెస్టర్లు మాత్రమే మార్కెట్లో అవకతవకలకు పాల్పడుతారనేది అపోహ అని, దేశీ ఇన్వెస్టర్లు కూడా అలాంటి ప్రయత్నాలు చేస్తారని చెప్పారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం గంట కొట్టి ఈ విలీనాన్ని లాంఛనపూర్వకంగా పూర్తి చేశారు. రెండు నియంత్రణ సంస్థలు విలీనం కావడం ఇదే మొదటిసారి. ఈ విలీనం వల్ల కమోడిటీ డెరివేటివ్‌ల మార్కెట్లో అవకతవకలకు అడ్డుకట్ట పడుతుందని జైట్లీ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో మూడు జాతీయ, ఆరు ప్రాంతీయ ఎక్స్ఛేంజ్ల్లో కమోడిటీ ఫ్యూచర్స్ ట్రేడింగ్ జరుగుతోంది. -
రేపు దేశీయ మార్కెట్లకు సెలవు
ముంబై: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశీయ మార్కెట్లకు శుక్రవారం సెలవు ప్రకటించారు. బాంబే స్టాక్ ఎక్చ్సెంజ్, నేషనల్ స్టాక్ ఎక్చ్సెంజ్, ఫారెక్స్, మనీ, ఇతర కమాడిటీ మార్కెట్లతోపాటు బులియన్, ఆయిల్, ఆయిల్ సీడ్స్ మార్కెట్లు రేపు కార్యకలాపాలు నిర్వహించవు. దేశీయ మార్కెట్లన్ని యధావిధిగా సోమవారం తమ కార్యకలాపాలను కొనసాగిస్తాయి.