స్టాక్, కమోడిటీ మార్కెట్లలోఎఫ్డీఐల పరిమితి పెంపు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మరిన్ని విదేశీ ఇన్వెస్ట్‌మెం ట్లను ఆకర్షించడం కోసం దేశీ స్టాక్, కమోడిటీ మార్కెట్లలో వాటి పెట్టుబడుల పరిమితిని 15 శాతం వరకు పెంచింది. ఇదివరకు ఈ పరిమితి 5 శాతంగా ఉండేది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్‌లో ప్రాథమిక కేటాయింపుల ద్వారా షేర్లను పొందటానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. తాజా చర్యలతో అంతర్జాతీయ విధానాలను, సాంకేతికతను మన స్టాక్ ఎక్స్ఛేంజీలలో ప్రవేశపెట్టడం వల్ల వీటి సామర్థ్యం మరింత పెరగనున్నది.