న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను సరళీకరించడం, స్మార్ట్ పారిశ్రామిక టౌన్‌షిప్‌లు, టైర్–2, 3 పట్టణాల్లో రంగాల వారీ ప్రత్యేకమైన పారిశ్రామిక పార్క్‌ల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించిందని పరిశ్రమల ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి అమర్‌దీప్ సింగ్ భాటియా తెలిపారు. దేశ పారిశ్రామికీకరణకు ఈ చర్యలు ఊతమిస్తాయన్నారు.
ఫిక్కీ వార్షిక సమావేశంలో భాగంగా మాట్లాడారు. పలు శాఖల మద్దతుతో పారిశ్రామికాభివృద్ధికి అనుకూల ఎకోసిస్టమ్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. జాతీయ పారిశ్రామిక నవడా కార్యక్రమం, ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ), వ్యాపార సులభతర నిర్వహణ సంస్కరణలు పారిశ్రామికాభివృద్ధికి వీలు కల్పించినట్టు భాటియా తెలిపారు. విద్యుదీకరణ పారిశ్రామికీకరణను వేగవంతం చేసిందని భారీ పరిశ్రమల శాఖ కార్యదర్శి కరమ్ రిజ్వి ఇదే కార్యక్రమంలో భాగంగా అన్నారు.
తయారీలో పోటీతత్వం, దేశీయ వాటాను పెంచేందుకు తీసుకుంటున్న చర్యలను ప్రస్తావించారు. ప్రైవేటు పెట్టుబడులు అన్నవి దేశీయ డిమాండ్‌కు అనుగుణంగా ఉండాలని ఫిక్కీ వైస్ ప్రెసిడెంట్, ఆర్‌పీజీ గ్రూప్ చైర్మన్ అనంత్ గోయెంకా అన్నారు. రంగాల వారీ పారిశ్రామిక పార్క్‌లు ఎంతో మార్పును తీసుకురాగలవన్నారు. కాకపోతే స్థానికంగా, విదేశాల్లోని ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్‌లు) నుంచి పాఠాలను పరిగణనలోకి తీసుకోవాలని, తయారీ రంగంలో పోటీతత్వాన్ని పెంచాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment