Domestic stock
-
స్టాక్, కమోడిటీ మార్కెట్లలోఎఫ్డీఐల పరిమితి పెంపు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మరిన్ని విదేశీ ఇన్వెస్ట్మెం ట్లను ఆకర్షించడం కోసం దేశీ స్టాక్, కమోడిటీ మార్కెట్లలో వాటి పెట్టుబడుల పరిమితిని 15 శాతం వరకు పెంచింది. ఇదివరకు ఈ పరిమితి 5 శాతంగా ఉండేది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో ప్రాథమిక కేటాయింపుల ద్వారా షేర్లను పొందటానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. తాజా చర్యలతో అంతర్జాతీయ విధానాలను, సాంకేతికతను మన స్టాక్ ఎక్స్ఛేంజీలలో ప్రవేశపెట్టడం వల్ల వీటి సామర్థ్యం మరింత పెరగనున్నది. -
రూపాయి.. 50 పైసలు అప్
ముంబై: బ్యాంకులు డాలర్ల విక్రయాన్ని కొనసాగించడంతో వరుసగా రెండో రోజూ రూపాయి బలపడింది. డాలర్‌తో పోలిస్తే గురువారం మరో 50 పైసలు పెరిగి దాదాపు నాలుగు వారాల గరిష్ట స్థాయి 62.67కి ఎగిసింది. దేశీ స్టాక్‌మార్కెట్లు పటిష్టంగా ఉండటంతో మరిన్ని పెట్టుబడులు రాగలవన్న అంచనాలు కూడా ఇందుకు దోహదపడ్డాయి. గురువారం ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో క్రితం ముగింపు 63.17తో పోలిస్తే కాస్త బలహీనంగా 63.20 వద్ద రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది. అయితే, బ్యాంకులు, ఎగుమతి సంస్థలు మళ్లీ డాలర్లను విక్రయించడంతో ఆ తర్వాత 62.58కి పెరిగింది. చివరికి 0.79 శాతం లాభంతో 62.67 వద్ద ముగిసింది. డిసెంబర్ 12 నాటి 62.29 క్లోజింగ్ తర్వాత ఈ స్థాయిలో ముగియడం ఇదే ప్రథమం. మొత్తం మీద వరుసగా రెండు రోజుల్లో రూపాయి మారకం విలువ 90 పైసలు (1.42 శాతం) పెరిగినట్లయింది.