రూపాయి.. 50 పైసలు అప్ | MarketsUS dollar eyes 11 year high on rate bets | Sakshi
Sakshi News home page

రూపాయి.. 50 పైసలు అప్

Published Fri, Jan 9 2015 9:18 AM | Last Updated on Sat, Sep 2 2017 7:24 PM

రూపాయి.. 50 పైసలు అప్

రూపాయి.. 50 పైసలు అప్

ముంబై: బ్యాంకులు డాలర్ల విక్రయాన్ని కొనసాగించడంతో వరుసగా రెండో రోజూ రూపాయి బలపడింది. డాలర్‌తో పోలిస్తే గురువారం మరో 50 పైసలు పెరిగి దాదాపు నాలుగు వారాల గరిష్ట స్థాయి 62.67కి ఎగిసింది. దేశీ స్టాక్‌మార్కెట్లు పటిష్టంగా ఉండటంతో మరిన్ని పెట్టుబడులు రాగలవన్న అంచనాలు కూడా ఇందుకు దోహదపడ్డాయి.

గురువారం ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో క్రితం ముగింపు 63.17తో పోలిస్తే కాస్త బలహీనంగా 63.20 వద్ద రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది. అయితే, బ్యాంకులు, ఎగుమతి సంస్థలు మళ్లీ డాలర్లను విక్రయించడంతో ఆ తర్వాత 62.58కి పెరిగింది. చివరికి 0.79 శాతం లాభంతో 62.67 వద్ద ముగిసింది. డిసెంబర్ 12 నాటి 62.29 క్లోజింగ్ తర్వాత ఈ స్థాయిలో ముగియడం ఇదే ప్రథమం. మొత్తం మీద వరుసగా రెండు రోజుల్లో రూపాయి మారకం విలువ 90 పైసలు (1.42 శాతం) పెరిగినట్లయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement