ఛాయ్ వాలా మొత్తం ఆస్తులు రూ.400కోట్లు
సూరత్: డిమానిటైజేషన్ తరువాత సూరత్ లో వడ్డీ వ్యాపారి , మనీ లాండరింగ్ కింగ్ కిషోర్ భాజీవాలా ఇంటిపై దాడిచేసిన ఐటీ అధికారులే షాకయ్యారు. గుజరాత్ లోని సూరత్ కు చెందిన అవినీతి తిమింగలం కూడబెట్టిన మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ.400 కోట్లకు చేరింది. వడ్డీవ్యాపారిగా అవతరించిన టీ బజ్జీలు అమ్ముకునే వ్యక్తి ఆదాయం ఇంత భారీగా ఉండడం ఆదాయ పన్ను అధికారులను సైతం విస్మయ పరిచింది.
ఆదాయ పన్ను అధికారులు తాజాగా ఆయన ఇంటిపై చేసిన సోదాల్లో మరో రూ. 150 కోట్ల విలువైన ఆస్తులు పట్టుబడ్డాయి. సుమారు రూ. 1.33 కోట్లను నగదును రికవరీ చేసినట్టు ఐటీ అధికారులు తెలిపారు. ఇందులో రూ.95 లక్షల విలువైన కొత్త రెండు వేల నోట్లు ఉన్నాయి. దీంతోపాటుగా రూ.7 కోట్ల విలువగల బంగారు ఆభరణాలు, రూ.72 లక్షల విలువైన వెండిని స్వాధీనం చేసుకున్నారు. (5కేజీల బంగారం బిస్కట్లు, 8 కేజీల బంగారు ఆభరణాలు, కేజీ డైమండ్ నగలు) రూ. 4.50 లక్షల కిసాన్ వికాస పత్రాలు, బంగ్లా, ఫ్లాట్స్, ఇళ్లు, షాపు లు సహా వ్యవసాయ భూమి సుమారు 70 ఆస్తుల పత్రాలను అధికారులు సీజ్ చేశారు. ఈ మొత్తం విలువ సుమారు నాలుగువందల కోట్లని అధికారులు అంచనావేశారు.
పెద్దనోట్ల రద్దు ప్రకటించిన మరుసటి రోజు సూరత్ లోని ఉధానా బ్యాంకుకు భారీ సంచులతో రావడం సీసీటీవీలో రికార్డు అయింది. దీనిపై విచారణ సందర్భంగా సదరు వ్యక్తి సమాధానం చెప్పడంలో విఫలం కావడం ఐటి అధికారులు ఆయన ఇంటిపై సోదారు నిర్వహించారు. సూరత్ పీపుల్స్ కో ఆపరేటివ్ బ్యాంక్, బరోడా, హెచ్ డీఎఫ్ సీ తదితర బ్యాంకుల్లో 30కి పైగా బ్యాంకు అకౌంట్లు, 16 లాకర్లు ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సేర్లతో ఈ నకిలీ ఖాతాలు, లాకర్లను ఆపరేట్ చేస్తున్నాడని అధికారులు తెలిపారు. విచారణ నిమిత్తం అక్రమ ఖాతాలను సీజ్ చేసినట్టు చెప్పారు. మరోవైపు రాష్ట్ర మంత్రి,బీజేపీ నేత పురుషోత్తం రూపాలను అభినందిస్తున్న ఫోటో ఒకటి నెట్ లో చక్కర్లు కొడుతోంది.
ఐటీ అధికారులు అందించిన సమాచారం ప్రకారం 31 సం.రాల క్రితం సౌరాష్ట్ర నుంచి ఉద్నాగాంకి వలస వచ్చిన కిషోర్ భాజియావాలా ఓ చిన్న, టీస్టాల్ ద్వారా జీవనం మొదలు పెట్టారు. ఆతరువాత బజ్జీల అమ్మడం మొదలు పెట్టాడు. అలా మెల్లిగా వడ్డీ వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. స్థానిక రాజకీయనాయకులు, పో్లీసు అధికారులతో సన్నిహిత సంబంధాలున్న ఈయన రుణం తిరిగి చెల్లించనివారిపై బెదరింపులకు పాల్పడేవారిని తెలిపారు. ఈ క్రమంలోరుణాలు చెల్లించలేని వారిదగ్గరనుండి ఆస్తులను లాక్కొనేవాడు. ఈక్రమంలోబ ఇతని నెలవారీ ఆదాయం 7.5కోట్లని విచారణలో తెలిపింది. వీటికితోడు 4.5 కోట్లు వడ్డీ రూపంలో వస్తుండగా, వివిధ ఆస్తుల మీద అ ద్దెరూపంలో మరో 3కోట్లు ఆదాయం. 150 కోట్ల విలువైన ఆస్తుల పత్రాలతో కలిపి మొత్తం అక్రమ సంపద నాలుగువందల కోట్లకుచేరింది. మరోవైపు తమ సంవత్సర ఆదాయాన్నిరూ.1.5కోట్లుగా ఐటీ రికార్డులో చూపించడం విశేషం. డిసెంబర్ 13న మొదలైన ఈ ఐడీ దాడులు ప్రారంభమైన సంగతి తెలిసిందే.