jewellery purchases
-
జోయాలుక్కాస్ గుడ్‌న్యూస్: 50 శాతం మేకింగ్ చార్జెస్ తగ్గింపు
హైదరాబాద్: ప్రముఖ బంగారు ఆభరణాల సంస్థ జోయాలుక్కాస్ ‘సంవత్సరపు సాటిలేని జ్యువెలరీ సేల్’ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆభరణాల ముజూరీ చార్జీల (వీఏ)పై 50 శాతం తగ్గింపు ఇవ్వనున్నట్లు తెలిపింది. ‘‘ఈ మార్చి 26 వరకు అందుబాటులో ఉండే ఈ గొప్ప ఆఫర్‌తో ఇంతకు ముందు లేని విధంగా సాటిలేని జ్యువెలరీ అనుభవాన్ని ఆనందించవచ్చు’’ అని జోయాలుక్కాస్ గ్రూప్ చైర్మన్ జాయ్ అలూక్కాస్ పేర్కొన్నారు. కొనుగోలు చేసిన అన్ని ఆభరణాలపై ఒక సంవత్సరం ఉచిత బీమా, జీవిత కాల ఉచిత నిర్వహణ, బై బ్యాక్ ఆఫర్లను పొందొచ్చని జోయాలుక్కాస్ తెలిపింది. ఇది కూడా చదవండి: 250 కోట్ల బిగ్గెస్ట్ ప్రాపర్టీ డీల్: మాజీ ఛాంపియన్, బజాజ్ ఆటో చైర్మన్ రికార్డు రిలయన్స్ ‘మెట్రో’ డీల్ ఓకే, రూ.2,850 కోట్లతో కొనుగోలు -
పసిడికి ధన్‌తెరాస్ ధగధగలు..
న్యూఢిల్లీ/ముంబై: ఈ ఏడాది ధన్‌తెరాస్ రెండు రోజులు (శని, ఆదివారాలు) రావడంతో పసిడి, ఆభరణాలు, నాణేల విక్రయాలు జోరుగా జరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి అమ్మకాలు 35 శాతం వరకూ పెరిగి ఉంటాయని ఆభరణాల పరిశ్రమ అంచనా వేస్తోంది. ఆదివారం నాడు భారత్–పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ ఉండటంతో కొద్ది గంటల పాటు మార్కెట్లో కాస్తంత స్తబ్దత నెలకొన్నా, మ్యాచ్ తర్వాత అమ్మకాలు వేగం పుంజుకున్నట్లు ఆభరణాల విక్రేతలు తెలిపారు. పసిడి రేటు కాస్త పెరిగినప్పటికీ వినియోగదారులు కొనుగోళ్లు జరిపినట్లు పేర్కొన్నారు. ఆదివారం దేశ రాజధాని న్యూఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల పసిడి ధర రూ. 50,139 (పన్నులు కాకుండా) పలికింది. ధన్‌తెరాస్ రోజున విలువైన లోహాలు కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. సాధారణంగా ధన్‌తెరాస్ నాడు 20–30 టన్నుల బంగారం అమ్ముడవుతుంది. కోవిడ్ అనంతరం డిమాండ్ పుంజుకోవడంతో గతేడాదితో పోలిస్తే ఈసారి సుమారు 10–15 శాతం మేర అమ్మకాలు పెరిగి ఉంటాయని అంచనా వేస్తున్నట్లు ఆలిండియా జెమ్ అండ్ జ్యుయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ ఆశీష్ పేఠే తెలిపారు. మరోవైపు, ధన్‌తెరాస్ సందర్భంగా 15–25 శాతం వరకూ బంగారం అమ్మకాలు పెరిగి ఉండవచ్చని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రాంతీయ సీఈవో (భారత్) సోమసుందరం పీఆర్ పేర్కొన్నారు. ధన్‌తెరాస్ కోసం భారీ స్థాయిలో ప్రి–బుకింగ్స్ జరిగినట్లు కల్యాణ్ జ్యుయలర్స్ ఇండియా ఈడీ రమేష్ కల్యాణరామన్ చెప్పారు. ఈ ఏడాది దాదాపు కొనుగోళ్లలో దాదాపు 80 శాతం వాటా జ్యుయలరీ ఉంటుందని, మిగతాది బులియన్ ఉంటుందని పీఎన్జీ జ్యుయలర్స్ సీఎండీ సౌరభ్ గాడ్గిల్ తెలిపారు. ఎకానమీ కోలుకుందని ప్రజల్లో నమ్మకం కలగడాన్ని ఇది సూచిస్తోందని వివరించారు. రెండు రోజుల ధన్‌తెరాస్ సందర్భంగా తమ అమ్మకాలు పరిమాణంపరంగా 30–35 శాతం, విలువపరంగా 40–45 శాతం పెరిగాయని అంచనా వేస్తున్నట్లు పీఎం షా జ్యుయలర్స్ ఎండీ దినేష్ జైన్ తెలిపారు. వినియోగదారులు డిజిటల్ మాధ్యమాల ద్వారా చెల్లింపులు జరపడం ఈసారి ఆసక్తికరమైన ట్రెండ్ అని పేర్కొన్నారు. -
పసిడి డిమాండ్ మామూలుగా లేదుగా, ఆభరణాలు తెగ కొనేశారట..!
న్యూఢిల్లీ: పసిడికి డిమాండ్ ఏమాత్రం తగ్గట్లేదు. 2022 ఏప్రిల్-జూన్ కాలంలో భారతీయులు 170.7 టన్నుల బంగారం కొనుగోలు చేశారని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వెల్లడించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 43 శాతం అధికం. జూన్‌తో ముగిసిన మూడు నెలల్లో పుత్తడి కొనుగోలుకు కస్టమర్లు చేసిన వ్యయం 54 శాతం పెరిగి రూ.79,270 కోట్లకు చేరుకుంది. 2022లో మొత్తం 800-850 టన్నుల బంగారానికి డిమాండ్ ఉండవచ్చు. 2021లో భారత్‌లో 797 టన్నుల మేర పుత్తడి అమ్మకాలు నమోదయ్యాయి. అభరణాలే అధికం.. అక్షయ తృతీయ, సంప్రదాయ వివాహ వేడుకల కారణంగా జూన్ త్రైమాసికంలో ఆభరణాల డిమాండ్ 49 శాతం దూసుకెళ్లి 140.3 టన్నులుగా ఉంది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 94 టన్నులు మాత్రమే. వినియోగదార్లు కొనుగోలు చేసిన ఆభరణాల విలువ క్రితం ఏడాదితో పోలిస్తే జూన్ త్రైమాసికంలో రూ.40,610 కోట్ల నుంచి రూ.65,140 కోట్లకు ఎగసింది. పెట్టుబడి కోసం కొనుగోలు చేసిన బంగారం 20 శాతం వృద్ధి చెంది 30.4 టన్నులుగా ఉంది. వీటి కోసం చేసిన వ్యయం 29 శాతం పెరిగి రూ.14,140 కోట్లకు చేరుకుంది. పునర్వినియోగమైన (రీసైకిల్డ్) బంగారం 18 శాతం అధికమై 23.3 టన్నులకు దూసుకెళ్లింది. గడిచిన త్రైమాసికంలో 170 టన్నుల దిగుమతి అయింది. 2021 ఏప్రిల్-జూన్‌లో ఇది 131.6 టన్నులు. సెంటిమెంట్‌పై ప్రభావం.. ద్రవ్యోల్బణం, పసిడి ధర, రూపాయి-డాలర్ మారకం, విధాన చర్యలు వినియోగదార్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. రూపాయి, డాలర్ మారకంపై దృష్టి సారించినప్పటికీ ఆర్థిక దృక్పథంపై అనిశ్చితి, అధిక దిగుమతి సుంకం, తాత్కాలిక, వ్యూహాత్మక కారణాల వల్ల బంగారం కొనుగోలుపై అదనపు ఆంక్షలు విధించే అవకాశం కారణంగా ఈఏడాది రెండో అర్ధభాగంలో దేశీయంగా ఆభరణాల డిమాండ్ ప్రతికూల ముప్పును ఎదుర్కొంటుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఇలా.. అంతర్జాతీయంగా పుత్తడి డిమాండ్ ఏప్రిల్-జూన్‌లో 8 శాతం పడిపోయి 948.4 టన్నులకు వచ్చి చేరింది. గోల్డ్ ఎలక్ట్రానిక్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) నుంచి ఉపసంహరణలు పెరగడం, సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లలో క్షీణత, టెక్నాలజీ విభాగం నుండి డిమాండ్ తగ్గడం వంటి కారణాలు ఇందుకు కారణమని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. పెట్టుబడి కోసం కొనుగోలు చేసిన బంగారం 28 శాతం తగ్గి 205.8 టన్నులుగా ఉంది. భారత మార్కెట్ తోడుగా నిలవడంతో ఆభరణాల డిమాండ్ 6.15 శాతం పెరిగి 484.3 టన్నులకు చేరుకుంది. చైనాలో ఆభరణాల అమ్మకాలు 28 శాతం పడిపోయాయి. 2022 జనవరి-జూన్‌లో గోల్డ్ డిమాండ్ 12 శాతం అధికమై 2,189 టన్నులకు ఎగసింది. -
బంగారం కొనుగోలు దారులకు శుభవార్త! కేంద్రం కీలక నిర్ణయం!
న్యూఢిల్లీ: వినియోగదారులు తమ వద్దనున్న హాల్‌మార్క్‌లేని బంగారం ఆభరణాల స్వచ్ఛతను బీఐఎస్ ధ్రువీకృత కేంద్రాలకు వెళ్లి పరీక్షించుకోవచ్చు. నాలుగు ఆర్టికల్స్ (ఆభరణాలు) వరకు స్వచ్ఛత కోసం రూ.200 చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అదే ఐదు అంతకంటే ఎక్కువ ఆర్టికల్స్ ఉంటే ఒక్కో ఆర్టికల్‌కు రూ.45 చొప్పున చార్జీ ఉంటుందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రకటించింది. తద్వారా వినియోగదారులు తమవద్దనున్న హాల్‌మార్క్‌లేని ఆభరణాల స్వచ్ఛతను తెలుసుకునే సదుపాయాన్ని కల్పించినట్టు పేర్కొంది. భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్) గుర్తింపు కలిగిన అస్సేయింగ్ అండ్ హాల్‌మార్కింగ్ సెంటర్స్‌కు వెళ్లి పరీక్షించుకోవచ్చని సూచించింది. ఇక వినియోగదారులు తాము కొనుగోలు చేసిన ఆభరణాలకు సంబంధించి ‘హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్’ను బీఐఎస్ కేర్ యాప్ నుంచి పరిశీలించుకునే అవకాశం కూడా ఉన్నట్టు తెలిపింది. వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ ధ్యేయమని తెలిపింది. హాల్‌మార్క్ అంటే ? కస్టమర్ల ప్రయోజనాలు కాపాడేందుకు హాల్ మార్క్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీన్ని అమలుచేయడం ద్వారా కస్టమర్లు స్వచ్ఛమైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. గోల్డ్ హాల్‌మార్కింగ్ అనేది బంగారం స్వచ్ఛతను ధృవీకరిస్తూ ఇచ్చే లోగో. చదవండి: బంగారం కొనేవారికి అదిరిపోయే శుభవార్త..! -
రూ.50వేలతో ఆభరణాలు కొంటున్నారా? అయితే...
ముంబై : బంగారం లేదా వెండి ఆభరణాలు రూ.50వేల కంటే ఎక్కువ మొత్తంలో కొనదలుచుకున్నారా? అయితే తప్పనిసరి చేతిలో పాన్ కార్డు లేదా ఆధార్ నెంబర్ ఉండాల్సిందే. రూ.50 వేలు లేదా రూ.లక్ష కంటే ఎక్కువ మొత్తంలో బంగారం కొనుగోళ్లకు పాన్ కార్డు లేదా ఆధార్ నెంబర్ తప్పనిసరి చేయనున్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. 2017 బడ్జెట్ ప్రకటన అనంతరం నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం రూ.2 లక్షల కంటే ఎక్కువకు ఆభరణాలు కొనుగోలు చేస్తే, బంగారం మార్కెట్లో కేవైసీ కంప్లియన్స్ను సమర్పించాల్సి ఉంటుంది. బులియన్, జువెల్లరీలో కైవేసీ అవసరాన్ని ప్రస్తుతమున్న రూ. 2 లక్షల నుంచి మరింత తగ్గిస్తారని దేశంలోనే అతిపెద్ద బులియన్ అసోసియేసన్ సెక్రటరీ భార్గవ్ వైద్య అంచనావేస్తున్నారు. రూ.50వేలకు కేవైసీ కంప్లియన్స్ను తీసుకొస్తారని చెబుతున్నారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం బ్లాక్‌మనీ హోల్డర్స్పై ఎక్కువగా దృష్టిసారించిన కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. పెద్ద నోట్లను రద్దు చేశాక, చాలామంది బ్లాక్‌మనీ హోల్డర్స్ తమ దగ్గరున్న నగదును జువెల్లరీ, బులియన్, రియల్ ఎస్టేట్‌లోకి మరలించినట్టు తెలిసింది. దీంతో డీమానిటైజేషన్ అనంతరం ఎవరు ఎంతమొత్తంలో బంగారం కొనుగోళ్లు చేపట్టి అక్రమాలకు పాల్పడ్డారో తెలుసుకోవడంలో ఇన్కమ్ ట్యాక్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, రెవెన్యూ ఇంటిలిజెన్సీ ఏజెన్సీలు నిమగ్నమై ఉన్నాయి. కేవైసీ అవసరాన్ని సమీక్షించి, వచ్చే బడ్జెట్లో రూ.లక్ష దాటిని కొనుగోళ్లకు ఈ నిబంధనలు తీసుకొస్తారని నేషనల్ సెక్రటరీ ఆఫ్ ఇండియా బులియన్ అండ్ జువెల్లర్స్ అసోసియేషన్ సురేంద్ర మెహతా సైతం చెబుతున్నారు.