దేశమంతటా ప్రవేశ పరీక్షలను సమర్థంగా నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఎన్టీఎస్)ను ఏర్పాటుచేయబోతున్నట్టు కేంద్ర బడ్జెట్‌లో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ప్రస్తుతం ప్రవేశ పరీక్షలను సీబీఎస్‌ఈ, ఐఐటీలు, ఏఐసీటీఈ వంటి విభిన్న సంస్థలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఎస్ పేరిట ఏర్పాటుచేస్తున్న నోడల్ ఏజెన్సీకి ఇక నుంచి దేశవ్యాప్తంగా నిర్వహించే అన్ని ప్రవేశ పరీక్షల బాధ్యతలను అప్పగించనున్నారు.