బడ్జెట్ డే : ఫ్లాట్గా ఎంట్రీ
Published Wed, Feb 1 2017 9:30 AM | Last Updated on Tue, Sep 5 2017 2:39 AM
ముంబై : బడ్జెట్ ప్రవేశంపై సందిగ్థత నెలకొన్న పరిస్థితుల్లో మార్కెట్లు ఫ్లాట్గా ఎంట్రీ ఇచ్చాయి. సెన్సెక్స్ 16.91 పాయింట్ల లాభంలో 27672.87 వద్ద, నిఫ్టీ 8.20 పాయింట్ల లాభంలో 8569.50 వద్ద ప్రారంభమయ్యాయి. లుపిన్, ఎస్బీఐ, అదానీ పోర్ట్స్, హీరో మోటో, విప్రో లాభాలు పండిస్తుండగా.. ఐసీఐసీఐ బ్యాంకు, ఇన్ఫోసిస్, టీసీఎస్, సన్ఫార్మాలు నష్టాలు గడిస్తున్నాయి. ప్రారంభ ట్రేడింగ్లో డాలర్తో రూపాయి మారకం విలువ 22 పైసలు బలపడింది. మంగళవారంతో పోలిస్తే నేడు 67.65గా ప్రారంభమైంది.
నేడు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంది. కానీ మంగళవారం జరిగిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సమావేశాల ప్రారంభ ప్రసంగ సమయంలో మళ్లప్పురం(కేరళ) లోక్సభ ఎంపీ ఇ.అహ్మద్ గుండెపోటుతో అస్వస్థకు గురై, రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో మృతి చెందడంతో బడ్జెట్ ప్రవేశంపై సందిగ్థత నెలకొంది. నేడు బడ్జెట్ ప్రవేశపెడతారా? లేదా? అని మార్కెట్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
Advertisement