open flat
-
ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 4 పాయింట్ల నష్టంతో ప్రారంభమైనా క్రమంగా పుంజుకుంది. 30 పాయింట్లు ఎగిసి 31,2340 వద్ద, నిఫ్టీ 10పాయింట్లు లాభపడి 9623వద్ద కొనసాగుతోంది. ముఖ్యంగా ఉత్తర కొరియా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం నేపథ్యంలో అంతర్జాతీయంగా నెలకొన్న ఆందోళన నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రతమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో మార్కెట్లు అక్కడక్కడే కదులుతున్నాయి. ఎఫ్ఎంసీజీ, ఐటీ రంగాలు బలహీనంగా, బ్యాంకింగ్, రియల్టీ, ఆటో స్వల్ప లాభాల్లో ఉన్నాయి. టాటా పవర్, ఆర్ఐఎల్, ఎంఅండ్ఎం, అల్ట్రాటెక్, ఐబీ హౌసింగ్ లాభాల్లో ఐటీసీ, హెచ్డీఎఫ్సీ, ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ నష్టపోతున్నాయి. మార్కెట్దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ మరోసారి మార్కెట్ క్యాపిటల్ లో టాప్‌లో నిలిచింది. వెంకీస్ 4శాతం లాభంతో, బీపీసీఎల్ టాప్ విన్నర్‌గా ఉన్నాయి. -
బడ్జెట్ డే : ఫ్లాట్‌గా ఎంట్రీ
ముంబై : బడ్జెట్ ప్రవేశంపై సందిగ్థత నెలకొన్న పరిస్థితుల్లో మార్కెట్లు ఫ్లాట్‌గా ఎంట్రీ ఇచ్చాయి. సెన్సెక్స్ 16.91 పాయింట్ల లాభంలో 27672.87 వద్ద, నిఫ్టీ 8.20 పాయింట్ల లాభంలో 8569.50 వద్ద ప్రారంభమయ్యాయి. లుపిన్, ఎస్బీఐ, అదానీ పోర్ట్స్, హీరో మోటో, విప్రో లాభాలు పండిస్తుండగా.. ఐసీఐసీఐ బ్యాంకు, ఇన్ఫోసిస్, టీసీఎస్, సన్‌ఫార్మాలు నష్టాలు గడిస్తున్నాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 22 పైసలు బలపడింది. మంగళవారంతో పోలిస్తే నేడు 67.65గా ప్రారంభమైంది. నేడు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంది. కానీ మంగళవారం జరిగిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సమావేశాల ప్రారంభ ప్రసంగ సమయంలో మళ్లప్పురం(కేరళ) లోక్‌సభ ఎంపీ ఇ.అహ్మద్ గుండెపోటుతో అస్వస్థకు గురై, రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో మృతి చెందడంతో బడ్జెట్ ప్రవేశంపై సందిగ్థత నెలకొంది. నేడు బడ్జెట్ ప్రవేశపెడతారా? లేదా? అని మార్కెట్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. -
ఫెడ్ భయంలో మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. ఫెడ్ భయంతో ఆసియా మార్కెట్లు ట్రెండ్ బలహీనంగా ఉంది. దీంతో అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నేపథ్యంలో ఇన్వెస్టర్ సెంటిమెంట్ బలహీనంగా ఉండడటంతో ప్రస్తుతం సెన్సెక్స్ 29 పాయింట్లు తగ్గి 26,673 వద్ద, నిఫ్టీ 19 పాయింట్లు క్షీణించి 8207వద్ద ట్రేడ్ అవుతోంది. అమెరికా ఫెడ్ నుంచి వడ్డీ పెంపు అంచనాలతో ట్రేడర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో మార్కెట్లు నష్టాలలోకి జారుకుంటున్నాయి. ఐటీ, రియల్టీ కూడా 0.4 శాతం పుంజుకోగా, మెటల్స్, ఆటో, ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ 0.8-0.2 శాతం మధ్య నీరసించాయి. కోల్ ఇండియా టాటా మోటార్స్, అల్ట్రాటెక్, ఐషర్ టాప్ లూజర్స్ గా ఉన్నాయి. ఏషియన్ పెయింట్స్, యాక్సిస్, ఆర్ఐఎల్, సన్ ఫార్మా, ఇన్ఫ్రాటెల్ స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు రెండు రోజుల ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షా సమావేశాలు నేడు(బుధవారం) ముగిమనున్నాయి. ఈ రోజు రాత్రికి నిర్ణయాలు వెలువడే అవకాశముంది. ఈ అంచనాల నేపథ్యంలో అమెరికా మార్కెట్లు రికార్డు స్తాయిలను నమోదు చేస్తున్నాయి. అటు డాలర్ మారకంలో రూపాయి 0.05 పైసల నష్టంతో 67.47 వద్ద, ఎంసీఎక్స్ మార్కెట్ లో పది గ్రా.పసిడి రూ.135 నష్టంతో రూ. 27,531 వద్ద ఉంది.