దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి.
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. ఫెడ్ భయంతో ఆసియా మార్కెట్లు ట్రెండ్ బలహీనంగా ఉంది. దీంతో అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నేపథ్యంలో ఇన్వెస్టర్ సెంటిమెంట్ బలహీనంగా ఉండడటంతో ప్రస్తుతం సెన్సెక్స్ 29 పాయింట్లు తగ్గి 26,673 వద్ద, నిఫ్టీ 19 పాయింట్లు క్షీణించి 8207వద్ద ట్రేడ్ అవుతోంది. అమెరికా ఫెడ్ నుంచి వడ్డీ పెంపు అంచనాలతో ట్రేడర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో మార్కెట్లు నష్టాలలోకి జారుకుంటున్నాయి.
ఐటీ, రియల్టీ కూడా 0.4 శాతం పుంజుకోగా, మెటల్స్, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్ 0.8-0.2 శాతం మధ్య నీరసించాయి. కోల్ ఇండియా టాటా మోటార్స్, అల్ట్రాటెక్, ఐషర్ టాప్ లూజర్స్ గా ఉన్నాయి. ఏషియన్ పెయింట్స్, యాక్సిస్, ఆర్‌ఐఎల్, సన్ ఫార్మా, ఇన్‌ఫ్రాటెల్ స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి.
మరోవైపు రెండు రోజుల ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షా సమావేశాలు నేడు(బుధవారం) ముగిమనున్నాయి. ఈ రోజు రాత్రికి నిర్ణయాలు వెలువడే అవకాశముంది. ఈ అంచనాల నేపథ్యంలో అమెరికా మార్కెట్లు రికార్డు స్తాయిలను నమోదు చేస్తున్నాయి.
అటు డాలర్ మారకంలో రూపాయి 0.05 పైసల నష్టంతో 67.47 వద్ద, ఎంసీఎక్స్ మార్కెట్ లో పది గ్రా.పసిడి రూ.135 నష్టంతో రూ. 27,531 వద్ద ఉంది.