సాక్షి, ముంబై: ఫెడ్ వడ్డీరేటు పెంపుతో, ఆసియా మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో దేశీయస్టాక్ మార్కెట్లు బలహీనంగా ప్రారంభమైనాయి. వరుస లాభాలకు చెక్ పెట్టిన కీలక సూచీ సెన్సెక్స్ 105 పాయింట్లు కోల్పోయి 35,633వద్ద, నిప్టీ 35 పాయింట్ల నష్టంతో 10,822వద్ద కొనసాగుతున్నాయి. తద్వారా నిష్టీ 10850 స్తాయిని కోల్పోయింది. బ్యాంకింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ ఐటీ షేర్లు నష్టపోతున్నాయి. ఫార్మ లాభపడుతోంది. ఇన్ఫోసిస్‌కు టాప్ ఎగ్జిక్యూటివ్‌లు గుడ్‌బై చెప్పడంతో ఇన్ఫీ నష్టపోతుండగా, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, జీ, ఎస్‌బ్యాంకు , బజాజ్ నష్టపోతున్నాయి. ఐటీసీ, టాటా గ్లోబల్ తదితరాలు లాభపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment