ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 4 పాయింట్ల నష్టంతో ప్రారంభమైనా క్రమంగా పుంజుకుంది. 30 పాయింట్లు ఎగిసి 31,2340 వద్ద, నిఫ్టీ 10పాయింట్లు లాభపడి 9623వద్ద కొనసాగుతోంది. ముఖ‍్యంగా ఉత్తర కొరియా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం నేపథ్యంలో అంతర్జాతీయంగా నెలకొన్న ఆందోళన నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రతమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో మార్కెట్లు అక్కడక్కడే కదులుతున్నాయి.
ఎఫ్‌ఎంసీజీ, ఐటీ రంగాలు బలహీనంగా, బ్యాంకింగ్, రియల్టీ, ఆటో స్వల‍్ప లాభాల్లో ఉన్నాయి. టాటా పవర్, ఆర్‌ఐఎల్, ఎంఅండ్‌ఎం, అల్ట్రాటెక్, ఐబీ హౌసింగ్ లాభాల్లో ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ నష్టపోతున్నాయి. మార్కెట్‌దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ మరోసారి మార్కెట్ క్యాపిటల్ లో టాప్‌లో నిలిచింది. వెంకీస్ 4శాతం లాభంతో, బీపీసీఎల్ టాప్ విన్నర్‌గా ఉన్నాయి.
ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు
Published Wed, Jul 5 2017 9:32 AM | Last Updated on Tue, Sep 5 2017 3:17 PM
Advertisement