
ముందస్తు బడ్జెట్‌తో అభివృద్ధి: మోదీ
తన ప్రభుత్వాన్ని విమర్శించేందుకు విపక్షానికి ఏ అంశమూ కనిపించడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: తన ప్రభుత్వాన్ని విమర్శించేందుకు విపక్షానికి ఏ అంశమూ కనిపించడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేంద్ర సాధారణ బడ్జెట్‌ను ముందుకు జరపడాన్ని ఆయన సమర్థించుకున్నారు. దీని ద్వారా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టొచ్చని మంగళవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చెప్పారు. ‘ముందస్తు బడ్జెట్‌తో అభివృద్ధి కార్యక్రమాలను ముందే చేపట్టొచ్చు. గతంతో ఇవి రుతుపవనాలు ముగి శాక మొదలయ్యేవి’ అని అన్నారు.
గతంలో పద్మ అవార్డులు అధికార ప్రాపకం ఉన్నవారికే దక్కేవని, ఈ ఏడాది తొలిసారి సామాన్యులకు కూడా దక్కాయని పేర్కొన్నారు. సమాజ సంక్షేమం కోసం తాజా బడ్జెట్ సమావేశాల్లో సమగ్ర చర్చ జరపాలని, దీని కోసం అందరూ కలసి రావాలని కాంక్షిం చారు. సభాకార్యక్రమాలు నిరాటంకంగా సాగేందుకు ప్రభుత్వం అన్ని పార్టీలతో చర్చించిందని పార్లమెంటు వద్ద విలేకర్లతో అన్నారు.
పార్లమెంటులో నోట్లరద్దుపై ఆర్డినెన్సు
పెద్దనోట్ల రద్దుపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్సును లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రవేశపెట్టారు. గతేడాది, నవంబర్ 9న కేంద్ర కేబినెట్ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంపై డిసెంబర్ 30న కేంద్రం ‘నిర్దిష్ట బ్యాంకు నోట్ల (ఆస్తుల నిలుపుదల) ఆర్డినెన్సు, 2016ను తెచ్చిన సంగతి తెలిసిందే. దీంతోపాటు శత్రువుల ఆస్తుల (సవరణ, క్రమబద్ధీకరణ) ఆర్డినెన్సు, వేతన చెల్లింపుల (సవరణ) ఆర్డినెన్సులను కూడా పార్లమెంటు ఉభయసభల్లో ప్రవేశపెట్టినట్లు పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు.
డిజిటల్ రేడియోతో విప్లవం: వెంకయ్య
డిజిటల్ రేడియోతో శ్రోతలకు నాణ్యమైన ఆడియో సేవలు అందుబాటు ధరల్లో లభ్యమవుతాయని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ప్రధాని కోరుకుంటున్న డిజిటల్, అనుసంధాన విప్లవాన్ని సాధించడానికి ప్రజలకు, ప్రైవే టు రంగానికి ఇదొక విశిష్ట అవకాశమన్నారు.