
ఆటోమొబైల్‌కు ప్రోత్సాహకాలివ్వాలి
భారత ఆర్థిక రంగం అభివృద్ధికి ఆటోమొబైల్ రంగం ముఖ్య చోదకంగా ఉపయోగపడింది.
భారత ఆర్థిక రంగం అభివృద్ధికి ఆటోమొబైల్ రంగం ముఖ్య చోదకంగా ఉపయోగపడింది. అనేక మందికి ఉపాధి కల్పించడమే కాకుండా జీడీపీ వృద్ధికి కూడా సాయపడింది. కొన్నేళ్లుగా ఆర్థిక సంబంధ ఇబ్బందులతో ఈ రంగం ఆశించిన లక్ష్యాల్ని అందుకోలేదు. అందువల్ల 2017 కేంద్ర బడ్జెట్‌లో ఈ రంగానికి ప్రోత్సాహకాల్ని ఆశిస్తున్నాం. ఆటోమొబైల్ పరిశ్రమను ప్రోత్సహించేలా అనుకూల నిర్ణయాలు తీసుకుంటారని భావిస్తున్నాం. మా ఉద్దేశం ప్రకారం...
► వినియోగం, పెట్టుబడుల ప్రోత్సాహానికి ఆదాయ, కార్పొరేట్ పన్ను తగ్గించాలి.
► ఆర్ అండ్ డి ఖర్చుపై 200 శాతం తగ్గింపును మళ్లీ కొనసాగిస్తారని ఆశిస్తున్నాం.
►మౌలిక వసతుల నాణ్యతను మెరుగుపరచాలి. నాణ్యమైన రోడ్లు, జాతీయ రహదారులతో పాటు సప్లై చైన్ లాజిస్టిక్ సేవల్ని అభివృద్ధి చేయాలి.
► పోర్టుల్లో మౌలికవసతుల కోసం పెట్టుబడులు పెరిగేలా చూడాలి.
► మరిన్ని ఎఫ్‌డీఐల్ని ఆకర్షించేలా ఆటోమొబైల్ వ్యాపార నిర్వహణ సులభతరం చేయాలి.
– సుమిత్ సాహ్ని,సీఈవో అండ్ ఎండీ,రెనాల్డ్ ఇండియా