విజయవాడ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్కు దిశానిర్దేశం లేదని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి అన్నారు. ఇది బడ్జెట్లా గాక బిజినెస్ మోడల్‌లా ఉందని విమర్శించారు. గురువారం విజయవాడలో పార్థసారథి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అరుణ్ జైట్లీ తీవ్ర నిరాశ కలిగించారని అన్నారు.
బడ్జెట్ బాగుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం విడ్డూరమని విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖపట్నం రైల్వే జోన్ల ప్రస్తావన లేదని, అమరావతికి రైల్వే కనెక్షన్ ఏదని నిలదీశారు. ఏపీ ప్రజలకు న్యాయం జరగకపోయినా చంద్రబాబు, టీడీపీ నేతలు స్వీట్లు పంచుకున్నారని విమర్శించారు. యువత జీవితాలతో చంద్రబాబు ఆడుకుంటున్నారని, ప్రజల చెవిలో పూలు పెడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు ప్రజలకు భ్రమలు కల్పించడం మానుకోవాలని పార్థసారథి హితవు పలికారు.
'ప్రత్యేక హోదా, రైల్వే జోన్ల ప్రస్తావన లేదు'
Published Thu, Feb 2 2017 4:52 PM | Last Updated on Sat, Jul 28 2018 6:35 PM
Advertisement
Advertisement