
‘పార్టీ’ టైమ్ కాదులెండి బాబూ!!
పార్టీల ఖాతాల్లో కోట్లకు కోట్లు పడతాయి. కానీ లెక్కలుండవు. ఎవరిచ్చారండీ... అని చూస్తే రూ.20వేలకన్నా ఎక్కువ ఇచ్చిన వారి పేర్లే నమోదవుతాయి. చాలామంది అంతకన్నా తక్కువే ఇస్తారు. ఈ రహస్యాన్ని జైట్లీ ‘హ్యాక్’ చేసినట్టున్నారు. లిమిట్‌ను ఏకంగా రూ.2,000కు తగ్గించేశారు. అంతకు మించి ఎవరిచ్చినా... చెక్కో, డిజిటలో!! కాకుంటే ఆర్‌బీఐ బాండ్లు కూడా కొని పార్టీలకు విరాళంగా ఇవ్వొచ్చట. దీనర్థం... రూ.2,000కు మించి ఎవరెంత ఇచ్చినా ఊరూ పేరూ ఉంటుంది మరి!!. కాకపోతే మనది అనంతకోటి ఉపాయాల భారతం. రూ.2000 చొప్పున లక్షల మంది ‘క్యాష్ కరో’ అనేసినా ఆశ్చర్యంలేదు.
దేశంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు : 1,703
(2015 ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం)