'బడ్జెట్.. చేదుమాత్రకు షుగర్ కోటింగ్'
హైదరాబాద్: కేంద్ర బడ్జెట్ పూర్తిగా అంకెల గారడీ అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. చేదు మాత్రకు చక్కెర పూతలా కేటాయింపులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. రైతు రుణాలు మాఫీ అవుతాయన్న ఆశలు నెరవేరలేదని తెలిపారు. రైతు ఆదాయం రెట్టింపు ఎలా అవుతుందో ప్రభుత్వం చెప్పలేదని ఆరోపించారు. నిర్దేశించిన లక్ష్యాల మేరకు రైతు రుణాలు గతంలో సగం కూడా ఇవ్వలేదు.
ఇప్పుడు ఇస్తామంటూ నమ్మబలుకుతున్నారని దుయ్యబట్టారు. ప్రధాని మోదీని పూర్తిగా సమర్ధిస్తున్న సీఎం కేసీఆర్ విభజన హామీలను నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బడ్జెట్ వాస్తవ విరుద్దమని కేటాయింపుల్లో చిత్తశుద్ధి లేదని విమర్శించారు.