ఉద్యోగులదెప్పుడూ పన్ను గొడవే. వృద్ధులదైతే... వడ్డీ గొడవ. మరి కంపెనీలు..? రాయితీలడుగుతాయి. ప్రోత్సాహకాలు ఇవ్వమంటాయి. బడ్జెట్ ముందు ఎప్పుడూ వినిపించేవి ఇవే కదా!! అని అంతా అనుకోవచ్చు. అసలు బడ్జెట్ అంటేనే ఆదాయ–వ్యయాల చిట్టా. మరి చేతిలో కొంత ఆదాయం మిగలాలంటే పన్ను తగ్గటమో, మినహాయింపు పరిమితి పెరగటమో జరగాలి కదా? ఉద్యోగులకు అంతకన్నా పెద్ద విషయం ఏముంటుంది? ఎవరైనా కోరుకునేది చేతికి నాలుగు డబ్బులు రావాలనే. వచ్చిన డబ్బులు మిగలాలనే. మన దేశంలో అసలు పింఛన్ భరోసా ఉన్నది ఎంతమందికి? ప్రభుత్వోద్యోగం ఉన్నది ఎందరికి? కాబట్టే అంతా పొదుపు పథకాలపై ఆధారపడతారు