అప్పుడు విడిపోయింది.. ఇప్పుడు కలిసింది
అప్పుడు విడిపోయింది.. ఇప్పుడు కలిసింది
Published Wed, Feb 1 2017 11:55 AM | Last Updated on Tue, Sep 5 2017 2:39 AM
రైల్వే బడ్జెట్, సాధారణ బడ్జెట్ రెండు కలిసిపోయాయి. 92 ఏళ్ల వేరుకుంపటికి స్వస్తి పలికాయి. ఒకేరోజు కలిసి వస్తామంటూ పార్లమెంట్ ముందుకు వచ్చేశాయి. అయితే రైల్వే బడ్జెట్, సాధారణ బడ్జెట్ ఎప్పుడు విడిపోయాయో తెలుసా? సరిగ్గా తొంభై రెండేళ్ల క్రితం బ్రిటీష్ వారు భారత్ను పరిపాలించే సమయంలో 1924లో ఈ రెండు వేరు కుంపటి పెట్టాయి. ఆ సమయంలో రైల్వే దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక సంపద. బడ్జెట్లో వీటికి 75 నుంచి 85 శాతం కేటాయింపులుండేవి. జనరల్ బడ్జెట్లోరైల్వేలు ఎక్కువ స్థానాన్ని ఆక్రమించుకుంటుండంతో, దీన్ని వేరుగా తీసుకురావాలని బ్రిటీష్ అధికారులు ప్రతిపాదించారు. 10 మంది సభ్యులు అక్వర్త్ కమిటీ 192-21లో ఈ ప్రతిపాదన తీసుకొచ్చింది. అనంతరం 1924లో దీన్ని సాధారణ బడ్జెట్ నుంచి విడదీశారు.
దీని ద్వారా మంచి విధాన రూపకల్పన, అమలు చేయొచ్చని భావించారు. అప్పటినుంచి రెండు బడ్జెట్లు విడివిడిగా పార్లమెంట్ ముందుకు వస్తున్నాయి. ప్రస్తుతం మొత్తం సాధారణ బడ్జెట్లో రైల్వేలు కలిగి ఉంది కేవలం 4 శాతం మాత్రమే. దీంతో పాటు రైల్వే తీవ్ర నష్టాలను భరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రైల్వేను సాధారణ బడ్జెట్ లో కలుపాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు రెండు బడ్జెట్ లను కలిపి పార్లమెంట్లోకి తీసుకొచ్చింది. 70 ఏళ్ల క్రితం అంటే 1994 మార్చి 24న రైల్వే బడ్జెట్ను తొలిసారి లైవ్ టెలికాస్ట్ చేయడం ప్రారంభించారు. 1947 ఆగస్టు 15న భారత్ స్వాతంత్య్రం సాధించిన అనంతరం తొలి రైల్వే మంత్రి జాన్ మతాయి. మొదటి మహిళా రైల్వే మంత్రిగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పనిచేశారు.
Advertisement
Advertisement