demerger
-
ఐటీసీ లాభం ఫ్లాట్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జూలై–సెపె్టంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం స్వల్పంగా 2 శాతం పెరిగి రూ. 5,054 కోట్లను అధిగమించింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 4,965 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 16 శాతం ఎగసి రూ. 22,282 కోట్లను తాకింది. గత క్యూ2లో రూ. 19,270 కోట్ల టర్నోవర్ సాధించింది. హోటళ్ల బిజినెస్ ఏకీకృతం ప్రస్తుతం హోటళ్ల బిజినెస్‌ను ప్రత్యేక కంపెనీగా విడదీసే ప్రణాళికల్లో ఉన్న ఐటీసీ బోర్డు తాజాగా ప్రత్యర్థి సంస్థలలో గల వాటాలను ఏకీకృతం చేసే ప్రతిపాదనకు గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. సొంత అనుబంధ సంస్థ రస్సెల్ క్రెడిట్(ఆర్సీఎల్) ద్వారా ఆతిథ్య రంగ దిగ్గజాలు ఒబెరాయ్, లీలా హోటళ్లలోగల వాటాలను కొనుగోలు చేయనుంది. ఈఐహెచ్(ఒబెరాయ్) లిమిటెడ్‌లో 1.52 కోట్ల ఈక్విటీ షేర్లను, హెచ్ఎల్వీ(లీలా)లో 34.6 లక్షల షేర్లను బుక్ విలువ ఆధారంగా కొనుగోలు చేయనుంది. దీంతో ఈఐహెచ్‌లో ఐటీసీకి 16.13 శాతం, హెచ్ఎల్వీలో 8.11 శాతం చొప్పున వాటా లభించనుంది. ప్రస్తుతం ఈఐహెచ్‌లో ఐటీసీకి 13.69 శాతం, ఆర్సీఎల్కు 2.44 శాతం చొప్పున వాటా ఉంది. ఇక హెచ్ఎల్వీలో ఐటీసీకి 7.58 శాతం వాటా ఉంది. ఫలితాల నేపథ్యంలో ఐటీసీ షేరు బీఎస్ఈలో 2 శాతం క్షీణించి రూ. 472 వద్ద ముగిసింది. -
రేమండ్ నుంచి రియల్టీ విడదీత
న్యూఢిల్లీ: రియల్టీ బిజినెస్ విభాగాన్ని ప్రత్యేక కంపెనీగా విడదీయనున్నట్లు టెక్స్టైల్స్ దిగ్గజం రేమండ్ లిమిటెడ్ తాజాగా వెల్లడించింది. ఇందుకు కంపెనీ బోర్డు ఆమోదముద్ర వేసినట్లు తెలియజేసింది. రేమండ్ రియల్టీ పేరుతో రియల్ ఎస్టేట్ బిజినెస్‌ను ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. దీంతో వాటాదారులకు మరింత విలువ చేకూరనున్నట్లు తెలియజేసింది. తద్వారా భారీ వృద్ధికి వీలున్న దేశీ ప్రాపర్టీ మార్కెట్లో మరింత పురోగతిని సాధించవచ్చని తెలియజేసింది. విడదీత పథకంలో భాగంగా వాటాదారులకు 1:1 ప్రాతిపదికన షేర్లను జారీ చేయనుంది. అంటే రేమండ్ లిమిటెడ్ వాటాదారులకు ప్రతీ షేరుకి 1 రేమండ్ రియల్టీ షేరుని కేటాయించనుంది. వాటాదారులు, రుణదాతలు, ఎన్సీఎల్టీ తదితర నియంత్రణ సంస్థల అనుమతుల తదుపరి రేమండ్ రియల్టీ లిమిటెడ్‌కు తెరతీయనున్నట్లు రేమండ్ వివరించింది. 24 శాతం వాటారేమండ్ లిమిటెడ్ మొత్తం ఆదాయంలో రియల్టీ బిజినెస్ 24 శాతం వాటాను ఆక్రమిస్తోంది. 2023–24లో విడిగా 43 శాతం వృద్ధితో రూ. 1,593 కోట్ల టర్నోవర్ సాధించింది. విడదీతలో భాగంగా రేమండ్ లిమిటెడ్ వాటాదారులకు రేమండ్ రియల్టీ 6,65,73,731 ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో రేమండ్ రియల్టీ లిస్ట్‌కానుంది. అనుబంధ సంస్థలుసహా కంపెనీ నిర్వహిస్తున్న రియల్టీ బిజినెస్‌ను పునర్వ్యవస్థీకరించే బాటలో తాజా పథకానికి తెరతీసినట్లు రేమండ్ లిమిటెడ్ వెల్లడించింది. విడదీత ద్వారా రియలీ్టలో భారీ వృద్ధి అవకాశాలను అందుకోవడం, కొత్త ఇన్వెస్టర్లను ఆకట్టుకోవడం, వ్యూహాత్మక భాగస్వాములను చేర్చుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలియజేసింది. మొత్తం రియల్టీ బిజినెస్‌ను ఒకే కంపెనీ నిర్వహణలోకి తీసుకురానున్నట్లు తెలియజేసింది. గతేడాది రియల్టీ విభాగం రూ. 370 కోట్ల నిర్వహణ లాభం(ఇబిటా) ఆర్జించింది. రియల్టీ తీరిలా రేమండ్ రియల్టీ థానేలో 100 ఎకరాల భూమిని కలిగి ఉంది. 40 ఎకరాలు అభివృద్ధి దశలో ఉంది. ఇక్కడ రూ. 9,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. రూ. 16,000 కోట్లకుపైగా అదనపు ఆదాయానికి వీలుంది. వెరసి థానే ల్యాండ్ బ్యాంక్ ద్వారా రూ. 25,000 కోట్ల ఆదాయానికి అవకాశముంది. ఇటీవల అసెట్‌లైట్ పద్ధతిలో ముంబై, బాంద్రాలో భాగస్వామ్య అభివృద్ధి(జేడీఏ) ప్రాజెక్టుకు తెరతీసింది. అంతేకాకుండా మహీమ్, సియోన్, బాంద్రాలలో మరో మూడు జేడీఏలకు సంతకాలు చేసింది. ఈ నాలుగు ప్రాజెక్టుల ద్వారా రూ. 7,000 కోట్ల టర్నోవర్‌కు వీలుంది.విడదీత వార్తల నేపథ్యంలో రేమండ్ షేరు బీఎస్ఈలో 0.7 శాతం నీరసించి రూ. 2,942 వద్ద ముగిసింది. -
అదానీ గ్రూప్ బిజినెస్‌ల విడదీత
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ బిజినెస్‌ల విడదీతకు ప్రణాళికలు వేసింది. హైడ్రోజన్, ఎయిర్‌పోర్టులు, డేటా సెంటర్లను ప్రత్యేక బిజినెస్‌లుగా ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ ప్రక్రియను 2025లో ప్రారంభించి 2028కల్లా ముగించాలని ఆశిస్తున్నట్లు సీఎఫ్‌వో జుగెశిందర్ సింగ్ తాజాగా తెలియజేశారు. కాగా.. ఇటీవల గ్రూప్‌లోని ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్(ఏఈఎల్) ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ ద్వారా రూ. 20,000 కోట్లను సమీకరించే సన్నాహాల్లో ఉన్న సంగతి తెలిసిందే. తొలుత పోర్టులు, విద్యుత్, సిటీ గ్యాస్ బిజినెస్‌లను ఏఈఎల్ ప్రారంభించి తదుపరి ప్రత్యేక కంపెనీలుగా విడదీసి లిస్ట్ చేసింది. ఈ బాటలోనే ప్రస్తుతం హైడ్రోజన్ తదితర నూతనతరం బిజినెస్‌లపై రానున్న పదేళ్లలో 50 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయాలని ప్రణాళికలు వేసింది. పెట్టుబడుల జాబితాలో విమానాశ్రయాల నిర్వహణ, మైనింగ్, డేటా సెంటర్లు, రహదారులు, లాజిస్టిక్స్ ఉన్నాయి. అయితే ప్రత్యేక కంపెనీలుగా ఏర్పాటు చేసేందుకు ఆయా బిజినెస్‌లు తగిన స్థాయిలో వృద్ధి చెందవలపి ఉన్నట్లు సింగ్ తెలియజేశారు. వెరసి 2025–2028 మధ్యలో ఇందుకు వీలు చిక్కవచ్చని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. -
దీపక్ ఫెర్టిలైజర్స్ పునర్వ్యవస్థీకరణ
ముంబై: పారిశ్రామిక రసాయనాలు, ఎరువుల దిగ్గజం దీపక్ ఫెర్టిలైజర్స్ అండ్ పెట్రోకెమికల్స్ కార్పొరేషన్(డీఎఫ్పీసీఎల్).. కార్పొరేట్ పునర్వ్యవస్థీకరణకు తెరతీయనుంది. తద్వారా మైనింగ్ కెమికల్స్, ఫెర్టిలైజర్ బిజినెస్‌లను విడదీయనుంది. డీఎఫ్పీసీఎల్కు సొంత అనుబంధ సంస్థ స్మార్ట్‌కెమ్ టెక్నాలజీస్(ఎస్టీఎల్) బోర్డు గురువారం ఇందుకు అనుమతించినట్లు ఒక ప్రకటనలో కంపెనీ వెల్లడించింది. మైనింగ్ కెమికల్స్(టీఏఎన్) బిజినెస్‌ను ఎస్టీఎల్ నుంచి విడదీసి పూర్తి అనుబంధ సంస్థ డీఎంఎస్పీఎల్కు బదిలీ చేయనున్నట్లు పేర్కొంది. ఎస్‌టీఎల్‌కు సొంత అనుబంధ సంస్థ మహాదాన్ ఫామ్ టెక్నాలజీస్‌ను ఎస్టీఎల్లోనే విలీనం చేయనున్నట్లు తెలియజేసింది. (ఈ వార్తల నేపథ్యంలో దీపక్ ఫెర్టిలైజర్స్ షేరు బీఎస్ఈలో 1.1 శాతం బలపడి రూ. 812 వద్ద ముగిసింది.) -
ఎన్ఎండీసీ నుంచి ఎన్ఎస్పీ విడదీత
న్యూఢిల్లీ: పీఎస్‌యూ సంస్థ ఎన్ఎండీసీ నుంచి నిర్మాణంలో ఉన్న నాగర్నర్ స్టీల్ ప్లాంటు(ఎన్ఎస్పీ)ను విడదీసేందుకు చర్యలు చేపట్టనున్నట్లు స్టీల్ శాఖ తాజాగా వెల్లడించింది. విలీన ప్రక్రియను వేగవంతం చేసే బాటలో కంపెనీకి చెందిన వాటాదారులు, రుణదాతలతో నేడు(7న) సమావేశాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. నాలుగు నుంచి ఐదు నెలల్లో ఎన్ఎస్పీని పూర్తిస్థాయిలో ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేసే లక్ష్యంతో కేంద్రం ఉన్నట్లు ఒక అధికారిక ప్రతిలో స్టీల్ శాఖ పేర్కొంది. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ సమీపంలో 3 మిలియన్ టన్నుల వార్షిక(ఎంటీపీఏ) సామర్థ్యంతో ఎన్ఎస్పీ ఏర్పాటవుతోంది. 1,980 ఎకరాలలో యూనిట్‌ను నిర్మిస్తున్నారు. ఇందుకు రూ. 23,140 కోట్లు వెచ్చిస్తున్నట్లు అంచనా. ఎన్ఎండీసీ నుంచి ఎన్ఎస్పీని విడదీసేందుకు 2020 అక్టోబర్‌లో కేంద్ర క్యాబినెట్ అనుమతించింది. తద్వారా కంపెనీలో కేంద్రానికున్న మొత్తం వాటాను వ్యూహాత్మక కొనుగోలుదారుడికి విక్రయించనుంది. మంగళవారం నిర్వహించనున్న సమావేశాలకు స్టీల్ శాఖ అదనపు కార్యదర్శి రాశికా చౌబే అధ్యక్షత వహించనున్నారు. ఈ వార్తల నేపథ్యంలో ఎన్ఎండీసీ షేరు ఎన్ఎస్ఈలో 1.6 శాతం నీరసించి రూ. 125 వద్ద ముగిసింది. -
రిలయన్స్ జియోకు ట్రిబ్యునల్‌లో విజయం
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ తన ఆప్టికల్ ఫైబర్, టవర్ వ్యాపారాలను వేరు చేయడాన్ని (డీమెర్జర్) వ్యతిరేకిస్తూ ఆదాయపన్ను శాఖ దాఖలు చేసిన పిటిషన్‌ను జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) కొట్టివేసింది. జియో డిజిటల్ ఫైబర్ ప్రైవేటు లిమిటెడ్, రిలయన్స్ జియో ఇన్ఫ్రాటెల్ ప్రైవేటు లిమిటెడ్ పేరుతో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ తన ఫైబర్, టవర్ వ్యాపారాలను వేరు చేయాలని నిర్ణయించుకుంది. ఇందుకు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ అహ్మదాబాద్ బెంచ్ అనుమతి మంజూరు చేసింది. దీనిపై ఆదాయపన్ను శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘‘డీమెర్జర్ స్కీమ్ ప్రకారం రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ రెడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్లను రుణాలుగా మార్చాల్సి ఉంటుంది. ఈక్విటీని డెట్‌గా మార్చడం అన్నది కంపెనీ లా సూత్రాలకు వ్యతిరేకం. అంతేకాదు బదిలీ కంపెనీ (జియోఇన్ఫోకామ్) లాభదాయక లేదా నికర ఆదాయం తగ్గిపోతుంది. ఇది ఆదాయపన్ను విభాగానికి ఆదాయ నష్టాన్ని కలిగిస్తుంది’’ అని ఆదాయపన్ను శాఖ వాదించింది. -
ఆర్‌కామ్ వైర్లెస్ డీమెర్జర్‌కు సెబీ ఆమోదం
ఓకే చెప్పిన బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్‌కామ్) కంపెనీ వైర్లెస్ కార్యకలాపాల డీమెర్జర్‌కు క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ ఆమోదం లభించింది. అంతే కాకుండా ఈ డీమెర్జర్‌కు బీఎస్ఈ, ఎన్ఎస్ఈల ఆమోదాలు కూడా లభించాయి. ఈ డీమెర్జర్ స్కీమ్‌కు ఆమోదం తెలపాలంటూ తాజాగా ఆర్‌కామ్, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ), ముంబై ధర్మాసనానికి దరఖాస్తు చేసింది. ఆర్‌కామ్ తన వైర్లెస్ వ్యాపారాన్ని ఎయిర్‌సెల్‌తో కలసి ఏర్పాటు చేస్తున్న జాయింట్ వెంచర్ కంపెనీ, ఎయిర్‌సెల్ లిమిటెడ్ అండ్ డిష్‌నెట్ వైర్లెస్ లిమిటెడ్‌కు బదిలీ చేస్తోంది. ఈ కంపెనీలో ఆర్‌కామ్‌కు, ఎయిర్‌సెల్ వాటాదారులు(మ్యాక్సిస్ కమ్యూనికేషన్స్ బెర్హద్)కు చెరో 50% వాటా ఉంటుంది. డైరెక్టర్ల బోర్డ్, కమిటీల్లో సమాన ప్రాతినిధ్యం ఉంటుంది. వైర్లెస్ టెలికం వ్యాపారాన్ని ఎయిర్‌సెల్ కంపెనీలో విలీనం చేయనున్నామని గత ఏడాది సెప్టెంబర్, 14న ఆర్‌కామ్ వెల్లడించింది. రూ.65,000 కోట్ల ఆస్తులతో రూ.35,000 కోట్ల నెట్‌వర్త్‌తో దేశంలో నాలుగో అతి పెద్ద టెల్కోగా విలీన సంస్థ అవతరిస్తుంది. ఈ వార్తలతో ఆర్‌కామ్ షేర్ 1.5% లాభంతో రూ.36.80 వద్ద ముగిసింది. -
అప్పుడు విడిపోయింది.. ఇప్పుడు కలిసింది
రైల్వే బడ్జెట్, సాధారణ బడ్జెట్ రెండు కలిసిపోయాయి. 92 ఏళ్ల వేరుకుంపటికి స్వస్తి పలికాయి. ఒకేరోజు కలిసి వస్తామంటూ పార్లమెంట్ ముందుకు వచ్చేశాయి. అయితే రైల్వే బడ్జెట్, సాధారణ బడ్జెట్ ఎప్పుడు విడిపోయాయో తెలుసా? సరిగ్గా తొంభై రెండేళ్ల క్రితం బ్రిటీష్ వారు భారత్‌ను పరిపాలించే సమయంలో 1924లో ఈ రెండు వేరు కుంపటి పెట్టాయి. ఆ సమయంలో రైల్వే దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక సంపద. బడ్జెట్లో వీటికి 75 నుంచి 85 శాతం కేటాయింపులుండేవి. జనరల్ బడ్జెట్లోరైల్వేలు ఎక్కువ స్థానాన్ని ఆక్రమించుకుంటుండంతో, దీన్ని వేరుగా తీసుకురావాలని బ్రిటీష్ అధికారులు ప్రతిపాదించారు. 10 మంది సభ్యులు అక్వర్త్ కమిటీ 192-21లో ఈ ప్రతిపాదన తీసుకొచ్చింది. అనంతరం 1924లో దీన్ని సాధారణ బడ్జెట్ నుంచి విడదీశారు. దీని ద్వారా మంచి విధాన రూపకల్పన, అమలు చేయొచ్చని భావించారు. అప్పటినుంచి రెండు బడ్జెట్లు విడివిడిగా పార్లమెంట్ ముందుకు వస్తున్నాయి. ప్రస్తుతం మొత్తం సాధారణ బడ్జెట్లో రైల్వేలు కలిగి ఉంది కేవలం 4 శాతం మాత్రమే. దీంతో పాటు రైల్వే తీవ్ర నష్టాలను భరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రైల్వేను సాధారణ బడ్జెట్ లో కలుపాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు రెండు బడ్జెట్ లను కలిపి పార్లమెంట్‌లోకి తీసుకొచ్చింది. 70 ఏళ్ల క్రితం అంటే 1994 మార్చి 24న రైల్వే బడ్జెట్‌ను తొలిసారి లైవ్ టెలికాస్ట్ చేయడం ప్రారంభించారు. 1947 ఆగస్టు 15న భారత్ స్వాతంత్య్రం సాధించిన అనంతరం తొలి రైల్వే మంత్రి జాన్ మతాయి. మొదటి మహిళా రైల్వే మంత్రిగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పనిచేశారు.