ముంబై: పారిశ్రామిక రసాయనాలు, ఎరువుల దిగ్గజం దీపక్ ఫెర్టిలైజర్స్ అండ్ పెట్రోకెమికల్స్ కార్పొరేషన్(డీఎఫ్‌పీసీఎల్).. కార్పొరేట్ పునర్వ్యవస్థీకరణకు తెరతీయనుంది. తద్వారా మైనింగ్ కెమికల్స్, ఫెర్టిలైజర్ బిజినెస్‌లను విడదీయనుంది. డీఎఫ్‌పీసీఎల్‌కు సొంత అనుబంధ సంస్థ స్మార్ట్‌కెమ్ టెక్నాలజీస్(ఎస్‌టీఎల్) బోర్డు గురువారం ఇందుకు అనుమతించినట్లు ఒక ప్రకటనలో కంపెనీ వెల్లడించింది.
మైనింగ్ కెమికల్స్(టీఏఎన్) బిజినెస్‌ను ఎస్‌టీఎల్ నుంచి విడదీసి పూర్తి అనుబంధ సంస్థ డీఎంఎస్‌పీఎల్‌కు బదిలీ చేయనున్నట్లు పేర్కొంది. ఎస్‌టీఎల్‌కు సొంత అనుబంధ సంస్థ మహాదాన్ ఫామ్ టెక్నాలజీస్‌ను ఎస్‌టీఎల్‌లోనే విలీనం చేయనున్నట్లు తెలియజేసింది.
(ఈ వార్తల నేపథ్యంలో దీపక్ ఫెర్టిలైజర్స్ షేరు బీఎస్‌ఈలో 1.1 శాతం బలపడి రూ. 812 వద్ద ముగిసింది.)
Comments
Please login to add a commentAdd a comment