petro chemicals
-
దీపక్ ఫెర్టిలైజర్స్ పునర్వ్యవస్థీకరణ
ముంబై: పారిశ్రామిక రసాయనాలు, ఎరువుల దిగ్గజం దీపక్ ఫెర్టిలైజర్స్ అండ్ పెట్రోకెమికల్స్ కార్పొరేషన్(డీఎఫ్పీసీఎల్).. కార్పొరేట్ పునర్వ్యవస్థీకరణకు తెరతీయనుంది. తద్వారా మైనింగ్ కెమికల్స్, ఫెర్టిలైజర్ బిజినెస్‌లను విడదీయనుంది. డీఎఫ్పీసీఎల్కు సొంత అనుబంధ సంస్థ స్మార్ట్‌కెమ్ టెక్నాలజీస్(ఎస్టీఎల్) బోర్డు గురువారం ఇందుకు అనుమతించినట్లు ఒక ప్రకటనలో కంపెనీ వెల్లడించింది. మైనింగ్ కెమికల్స్(టీఏఎన్) బిజినెస్‌ను ఎస్టీఎల్ నుంచి విడదీసి పూర్తి అనుబంధ సంస్థ డీఎంఎస్పీఎల్కు బదిలీ చేయనున్నట్లు పేర్కొంది. ఎస్‌టీఎల్‌కు సొంత అనుబంధ సంస్థ మహాదాన్ ఫామ్ టెక్నాలజీస్‌ను ఎస్టీఎల్లోనే విలీనం చేయనున్నట్లు తెలియజేసింది. (ఈ వార్తల నేపథ్యంలో దీపక్ ఫెర్టిలైజర్స్ షేరు బీఎస్ఈలో 1.1 శాతం బలపడి రూ. 812 వద్ద ముగిసింది.) -
ఆదాయమే మార్గంగా..బీపీసీఎల్ రూ.1.4 లక్షల కోట్ల పెట్టుబడులు!
న్యూఢిల్లీ: పెట్రోకెమికల్స్, సిటీ గ్యాస్, పర్యావరణ అనుకూల ఇంధనాల వ్యాపార విభాగాల విస్తరణపై ప్రభుత్వ రంగ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) మరింతగా దృష్టి పెడుతోంది. వచ్చే అయిదేళ్లలో రూ. 1.4 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. వార్షిక నివేదికలో బీపీసీఎల్ సీఎండీ అరుణ్ కుమార్ సింగ్ ఈ విషయాలు తెలిపారు. రిస్కులను తగ్గించుకుంటూ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వ్యూహాలను సరి చేసుకుంటున్నామన్నారు. ద్రవ శిలాజ ఇంధనాల వ్యాపారం భవిష్యత్తులో క్షీణిస్తే హెడ్జింగ్ కోసం అదనంగా ఆదాయాన్ని తెచ్చిపెట్టే మార్గాలను తీర్చిదిద్దుకుంటున్నామని, వివిధ విభాగాల్లో వ్యాపారాలను విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నామని సింగ్ వివరించారు. ఇందుకోసం ఆరు ప్రధాన విభాగాలను (పెట్రోకెమికల్స్, గ్యాస్, పునరుత్పాదక ఇంధనాలు, వినియోగ వస్తువుల రిటైలింగ్, ఈ–మొబిలిటీ మొదలైనవి) ఎంపిక చేసుకున్నట్లు ఆయన చెప్పారు. -
రియలన్స్ ఇండస్ట్రీస్, ఆరామ్కో డీల్.. రీ ఎవాల్యుయేట్
రియలన్స్ ఇండస్ట్రీస్, సౌదీ ఆరామ్కో కంపెనీల మధ్య గతంలో కుదిరిన వ్యాపార ఒప్పందంలో తిరిగి కదలిక వచ్చింది. 2019 ఆగస్టులో ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. అయితే కరోనా కారణంగా ఆ తర్వాత ఈ ఒప్పంద విషయంలో మళ్లీ ఎటువంటి పురోగతి లేదు. కాగా సంప్రదాయేతర ఇంధన వనరుల విభాగంలో భారీగా పెట్టుబడులు పెట్టాలని ఇటీవల రిలయన్స్ నిర్ణయించింది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఏకంగా నాలుగు గిగా ఫ్యాక్టరీలో నెలకొల్పబోతుంది. ఈ నేపథ్యంలో తమ పెట్రోకెమికల్, ఆయిల్ రిఫైనరీలో 20 శాతం వాటాల విక్రయానికి సౌదీ అరామ్కోతో డీల్‌ను తిరిగి మదింపు చేయాలని నిర్ణయించినట్టు రిలయన్స్ ఇండస్ర్టీస్ ప్రకటించింది. రూ.1,.13 లక్షల కోట్ల విలువ గల ఈ డీల్ ఇప్పటికి రెండు సార్లు పట్టాలకెక్కడంలో విఫలమైంది. అయితే కొత్త ఇంధన రంగాల్లోకి ప్రవేశించాలన్న రిలయన్స్ ఆకాంక్షకు అనుగుణంగా ఆ డీల్‌ను పునఃపరిశీలించాలని నిర్ణయించినట్టు ఉభయ సంస్థలు తాజాగా ప్రకటించాయి. -
రూ.22 వేల కోట్లు ఆదా చేశాం: ధర్మేంద్ర ప్రధాన్
గడిచిన రెండేళ్లలో నకిలీ ఎల్పీజీ కనెక్షన్లు తొలగించడం ద్వారా రూ.22 వేల కోట్లు ఆదా చేశామని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. రానున్న ఐదేళ్లలో గ్యాస్, చమురు కేంద్రాల్లో లక్షకోట్ల పెట్టుబడులు సిద్ధంగా ఉన్నాయని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఓఎన్జీసీ, రిలయన్స్ సంస్థలు ఇన్వెస్ట్ చేయనున్నాయని ఆయన పేర్కొన్నారు. పెట్రో కెమికల్ పరంగా ఏపీకి చాలా ప్రాధాన్యం ఉందన్నారు. ఇప్పటికే విశాఖలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గుర్తుచేశారు.