గడిచిన రెండేళ్లలో నకిలీ ఎల్పీజీ కనెక్షన్లు తొలగించడం ద్వారా రూ.22 వేల కోట్లు ఆదా చేశామని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. రానున్న ఐదేళ్లలో గ్యాస్, చమురు కేంద్రాల్లో లక్షకోట్ల పెట్టుబడులు సిద్ధంగా ఉన్నాయని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఓఎన్జీసీ, రిలయన్స్ సంస్థలు ఇన్వెస్ట్ చేయనున్నాయని ఆయన పేర్కొన్నారు. పెట్రో కెమికల్ పరంగా ఏపీకి చాలా ప్రాధాన్యం ఉందన్నారు. ఇప్పటికే విశాఖలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గుర్తుచేశారు.