LPG connections
-
ఎల్పీజీ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం ఏమిటి?
దేశంలోని దాదాపు ప్రతి ఇంటిలోనూ వంటగ్యాస్ అంటే ఎల్పీజీ కనెక్షన్ ఉంది. గ్రామాల్లో కూడా మట్టి పొయ్యిలకు బదులు గ్యాస్ స్టవ్‌లు వినియోగిస్తున్నారు. అయితే ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు ఏడాదికేడాది పెరుగుతున్నాయి. ఉజ్వల పథకం ద్వారా పేద కుటుంబాలకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు అందించిన తర్వాత వంటగ్యాస్ వినియోగం మరింతగా పెరిగింది. గత 10 సంవత్సరాలలో ఎల్పీజీ వినియోగదారుల సంఖ్య 32 కోట్లకు పైగా పెరిగింది. గత ఐదేళ్లలో దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తి నాలుగు శాతం పెరిగింది. అయితే వినియోగం 22 శాతం మేరకు పెరిగింది. పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని గ్యాస్‌ను ప్రభుత్వం దిగుమతి చేస్తోంది. గత ఐదేళ్లలో ఎల్పీజీ దిగుమతులు 60 శాతం మేరకు పెరిగాయి. భారతదేశానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, సౌదీ అరేబియా, కువైట్ నుండి గ్యాస్ సరఫరా అవుతోంది. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అందించిన డేటా ప్రకారం గత కొన్నేళ్లుగా భారత్.. అమెరికా నుంచి కూడా గ్యాస్ దిగుమతి చేసుకుంటోంది. ఇలా ఎల్పీజీ దిగుమతులు పెరిగిన కారణంగానే వాటి ధరలు నిరంతరం పెరుగుతున్నాయి. భారతదేశంలో 90 శాతం ఎల్పీజీ గృహ వినియోగం కోసం ఉపయోగిస్తున్నారు. మిగిలిన మొత్తం పారిశ్రామిక, వాణిజ్యపరంగా ఉపయోగిస్తున్నారు. దేశంలో ఎల్పీజీ వినియోగంలో 13 శాతం ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతోంది. ఇది మహారాష్ట్రలో 12 శాతం మేరకు ఉంది. ఈ విషయంలో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది. -
PM Ujjwala Scheme: మరో 75 లక్షల ‘ఉజ్వల’కనెక్షన్లు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో బుధవారం జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన(పీఎంయూవై)కింద అదనంగా 75 లక్షల ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.1,650 కోట్లు కేటాయించింది. దీంతోపాటు, ఈ కోర్ట్స్’ ప్రాజెక్టు మూడో దశకు అనుమతి మంజూరుచేసింది. ఇందుకు గాను రూ.7,210 కోట్లు వెచి్చంచాలని తీర్మానించింది. ఇటీవల ముగిసిన జీ20ని విజయవంతం చేసి, భారత్ ప్రతిష్టను ఇనుమడింప జేసిన ప్రధాని మోదీని ఈ సమావేశం అభినందించింది. ఈ వివరాలను భేటీ అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు. కొత్తగా జారీ అయ్యే 75 లక్షల ఉజ్వల ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లను 2023–24 నుంచి 2025–26 ఆర్థిక సంవత్సరం వరకు అందజేస్తామని తెలిపారు. వీటితో కలిపి ఉజ్వల లబి్ధదారుల సంఖ్య 10.35 కోట్లకు చేరుకుంటుందన్నారు. దిగువ కోర్టుల్లో రికార్డుల డిజిటైజేషన్, క్లౌడ్ స్టోరేజీ, వర్చువల్ కోర్టుల ఏర్పాటు తదితరాల కోసం నాలుగేళ్లపాటు అమలయ్యే ఈకోర్ట్స్ ప్రాజెక్టు ఫేజ్–3కి రూ.7,210 కోట్లు కేటాయించేందుకు కూడా కేబినెట్ అంగీకరించిందని ఠాకూర్ చెప్పారు. ఇందులో భాగంగా 3,108 కోట్ల డాక్యుమెంట్లు డిజిటల్ రూపంలోకి మారుతాయని అంచనా. -
మిస్డ్ కాల్‌తో గ్యాస్ కనెక్షన్
న్యూఢిల్లీ: ఎల్పీజీ కనెక్షన్‌దారులకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) శుభవార్త చెప్పింది. కేవలం మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా ఎల్పీజీ కొత్త కనెక్షన్ తీసుకోవడం, ఎల్పీజీæ రీఫిల్ వంటి సదుపాయాలు పొందేలా సదుపాయం తీసుకొచ్చింది. కొత్త కస్టమర్లు, పాత కస్టమర్లు ఈ సదుపాయాన్ని 8454955555కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా పొందొచ్చని ఐఓసీ చైర్మన్ ఎస్ఎం వైద్య సోమవారం వెల్లడించారు. దీనితో పాటు ఒక సిలిండర్ కలిగిన వారు మరో సిలిండర్ పొందే సదుపాయాన్ని (డబుల్ బాటిల్ కనెక్షన్) ఇంటివద్దకే తీసుకొచ్చేందుకు కొత్త ప్రణాళిక రచించారు. 14.2 కేజీల సిలిండర్ ఉన్నవారు బ్యాక్అప్ కోసం మరో 5కేజీల సిలిండర్ ఐచ్ఛికాన్ని ఎంచుకోవచ్చని సూచించారు. -
రెండేళ్లలో కోటి ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు
న్యూఢిల్లీ: రానున్న రెండేళ్లలో కోటి ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వనున్నట్లు ఇంధనశాఖ కార్యదర్శి తరుణ్ కపూర్ చెప్పారు. వంటగదిలో మహిళలు కాలుష్యం బారిన పడకుండా ఉండేందుకు మోదీ ప్రభుత్వం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం తెచ్చిందని, దాని కిందే వీటిని ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇటీవల ప్రవేశ పెట్టిన 2021–22 బడ్జెట్లోనూ ఆర్థిక మంత్రి దీని ప్రస్తావన తీసుకొచ్చారు. రెండేళ్లలో కోటి కనెక్షన్లు ఇస్తామని మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అయితే దానికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. దీనిపై తరుణ్ స్పందిస్తూ.. ఒక్కో కనెక్షన్‌కు ఖర్చయ్యే రూ. 1,600లను సబ్సీడీ ద్వారా పూడ్చుకోవచ్చని, బడ్జెట్లో కేటాయించకపోయాన ఫరవాలేదని అన్నారు. కనెక్షన్లు ఇచ్చేందుకు ఉన్న నిబంధనలను సులభతరం చేసినట్లు చెప్పారు. అంతేగాక గ్యాస్ అయిపోయాక దగ్గర్లోనే ఉన్న డీలర్లను సంప్రదించి, నింపుకునేలా మూడు డీలర్లతో ఒప్పందాలు చేసుకోనున్నట్లు తెలిపారు. గత నాలుగేళ్లలో 8 కోట్ల ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చినట్లు చెప్పారు. తరచుగా ఊర్లు మారే వారికి కూడా ఎల్పీజీ కనెక్షన్లు దొరికేలా నిబంధనలు సరళతరం చేయాల్సిందిగా ఆయిల్ కంపెనీలను కోరినట్లు తెలిపారు. దీని కోసం మూడు కంపెనీలతో కలసి ఓ ఐటీ బేస్డ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చదవండి: మొత్తంగా మూడు సార్లు పెరిగిన సిలిండర్ ధర -
వినియోగదారులతో గ్యాస్ ఏజెన్సీల చెలగాటం
సాక్షి,సిటీబ్యూరో : నగరంలోని ముషీరాబాద్ నివాసం ఉండే శ్రీనివాస్‌కు సికింద్రాబాద్‌లోని ఒక గ్యాస్ ఏజెన్సీలో ఎల్పీజీ కనెక్షన్ ఉంది. గత పదేళ్లుగా రీఫిల్ బుక్ చేయగానే సంబంధిత గ్యాస్ ఏజెన్సీ ద్వారా డోర్ డెలివరీ జరుగుతూ వస్తోంది. గత ఏడాది క్రితం శ్రీనివాస్ కుటుంబం ముషీరాబాద్ నుంచి సికింద్రాబాద్‌కు నివాసం మారింది. అడ్రస్ మార్పు చేసుకునేందుకు వీలు పడక ఎప్పటి మాదిరిగా రీఫిల్ బుక్ చేసుకొని పాత అడ్రస్‌కు డెలివరీ జరిగిన సిలిండర్‌ను తీసుకుంటూ వస్తున్నారు. ఈ ప్రక్రియ కొంత ఇబ్బంది కరంగా ఉండటంతో కొత్త అడ్రస్‌కు గ్యాస్ కనెక్షన్ మార్చుకోవాలని భావించారు. సికింద్రాబాద్‌లోని గ్యాస్ ఏజెన్సీకి అడ్రస్ మార్పు కోసం సంప్రదించారు. అక్కడ కంప్యూటర్లో పరిశీలించి మీ కనెక్షన్ ఇక్కడ లేదని... ముషీరాబాద్ లోని ఏజెన్సీకి మార్పు చేశామని చెప్పారు. కనీసం సమాచారం ఇవ్వకుండా ఇతర ఏజెన్సీకి ఏలా మార్చుతారని నిలదీస్తే.. తమకు సంబంధం లేదని ఆయిల్ కంపెనీ అడ్రస్ ఆధారంగా కనెక్షన్ బదిలీ చేసిందని సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న నివాసానికి సికింద్రాబాద్ ఏజెన్సీ దగ్గర ని పేర్కొనగా, ముషీరాబాద్ ఏజెన్సీకి వెళ్లి అడ్రస్ బదిలీ చేసుకోవాలన్నారు. గత్యంతరం లేక గ్యాస్ కనెక్షన్ కాగితాలు, చిరునామా గుర్తింపు తదితరాలు తీసుకొని వెళ్లి ముషీరాబాద్ ఏజెన్సీ నుంచి తిరిగి సికింద్రాబాద్ ఏజెన్సీకి అడ్రస్ మార్పు కోవడంతో కనెక్షన్ (వినియోగదారుడి) నెంబర్ కాస్త మారింది. ఇదీ ఒక శ్రీనివాస్ ఎదుర్కొన సమస్య కాదు... నగరంలో వేలాది మంది వంట గ్యాస్ వినియోగదారుల సమస్య. వినియోగదారులతో చెలగాటం గృహోపయోగ వంట గ్యాస్ వినియోగదారులతో ఆయిల్ కంపెనీలు చెలగాటమాడుతున్నాయి. వినియోగదారులకు కనీసం సమాచారం లేకుండానే ఏజెన్సీలను మార్చేస్తున్నాయి. దీంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నా ఫలితం లేకుండా పోతుంది. తిరిగి కనెక్షన్లను బదిలీ కోసం నానా తిప్పలు పడాల్సిన వస్తోంది. అడ్రస్ మార్పు కాస్త ఏళ్ల తరబడి ఉన్న గ్యాస్ కనెక్షన్ నంబర్ పై ప్రభావం చూపుతోంది. వాస్తవంగా నగరంలో సొంత నివాసాల కంటే అద్దె గృహాల్లో ఉంటున్న గ్యాస్ వినియోగదారుల సంఖ్య అధికంగా ఉంటుంది. అద్దె పెంపు తదితర కారణాలతో రెండేళ్లు... మూడేళ్లకు ఒక సారి నివాసాలను మార్చుతుంటారు. ప్రతి సారి గ్యాస్ కనెక్షన్ల అడ్రస్ మార్పిడి చేయకుండా పాత అడ్రస్ లేదా డెలివరీ బాయ్స్‌తో పరిచయాలతో రీఫిల్ తీసుకుంటుండం సర్వసాధారణంగా మారింది. ఆయితే ఆయిల్ కంపెనీలు మాత్రం అడ్రస్ ఆధారంగా గ్యాస్ కనెక్షన్లను సమీప ఏజెన్సీలకు బదిలీ చేస్తుండటం వినియోగదారులకు శాపంగా తయారైంది. 40 వేల కనెక్షన్లు దాటితే.... నగరంలోని గ్యాస్ ఏజెన్సీలకు 40 వేల కనెక్షన్ల వరకు పరిమితి ఉంది. ఆ సంఖ్య దాటితే ఆయిల్ కంపెనీలు మాస్ క్యాంపియన్లో అడ్రస్ ఆధారంగా కొన్ని కనెక్షన్లను సంబంధిత ఏరియాలకు బదిలీచేసి చేస్తుంటాయి. ఒక ఏజెన్సీకి కేవలం 24 వేల రీఫిల్ సామర్థ్యం వరకు పరిమితం మాత్రమే ఉండటంతో 40 వేల కనెక్షన్లు దాటకుండా ఎప్పటి కప్పుడు సంబంధిత ఆయిల్ కంపెనీ పర్యవేక్షిస్తోంది. ఒక ఏజెన్సీపై అదనపు భారం లేకపోవడంతోపాటు సేవలందించేందుకు మరింత వెసులుబాటు కోసం వినియోగదారులకు దగ్గర లోకి కనెక్షన్ బదిలీ చేస్తోంది. ఆయిల్ కంపెనీల నిబంధన ప్రకారం ఒక ఏజెన్సీ నుంచి మరొక ఏజెన్సీకి కనెక్షన్ బదిలీ జరిగినప్పుడు సదరు వినియోగదారులకు సెల్‌ఫోన్ ద్వారా సమచారం అందించాల్సి ఉంటుంది. గ్యాస్ బుకింగ్ సమయంలో సైతం ఏజెన్సీ మారిందన్న సమాచారాన్ని వెల్లడించాల్సి ఉంటుంది. కానీ, ఇదేమి లేకుండానే ఆయిల్ కంపెనీలు ఇష్టానుసారం ఏజెన్సీలను మార్చి వినియోగదారులకు తిప్పలకు గురిచేస్తోంది. కనెక్షన్లు ఇలా.. మహా నగర పరిధిలో మూడు ప్రధాన చమురు సంస్థలకు చెందిన 125 డిస్ట్రిబ్యూటర్లకు పైగా ఉన్నారు. వారి పరిధిలో సుమారు 28.21లక్షల వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రతి రోజు డిమాండ్‌ను బట్టి ఆయిల్ కంపెనీల నుంచి డిస్ట్రిబ్యూటర్లకు రీఫిల్ స్టాక్ సరఫరా అవుతుంది. డిస్ట్రిబ్యూటర్లు అన్లైన్ బుకింగ్‌ను బట్టి వినియోగదారులకు డోర్ డెలివరీ చేస్తుంటారు. ప్రధానంగా ఐఓసీ కి సంబందించిన 11.94 లక్షలు, బీపీసీఎల్‌కు సంబంధించిన 4.96 లక్షలు,హెచ్పీసిఎల్కు సంబధించిన 11.31 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. పరిమితికి మించి ఉంటే కనెక్షన్ల బదిలీ గ్యాస్ ఏజెన్సీలకు కనెక్షన్లు, రీఫిల్‌పై పరిమితి ఉంటుంది. పరిమితికి మించితే ఆయిల్ కంపెనీలు వినియోగదారుడి ఆడ్రస్ ఆధారంగా సమీపంలోని గ్యాస్ ఏజెన్సీలకు కనెక్షన్లను బదిలీ చేస్తారు. బదిలీ జరిగిన సమయంలో వినియోగదారుల సెల్ఫోన్లకు తప్పని సరిగా సమాచారం వస్తుంది. కేవలం ఏజెన్సీలపై అదనపు భారం లేకుండా వినియోగదారులకు మరింత వెసులు బాటు కల్పించేందుకు ఎల్పీజీ కనెక్షన్ల బదిలీ ప్రక్రియ. – అశోక్ కుమార్, అధ్యక్షుడు, గ్రేటర్ హైదరాబాద్ ఎల్పీజీ గ్యాస్ డీలర్ల సంఘం. -
‘ఉజ్వల స్కీమ్’కు మరింత సబ్సిడీ!
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఉజ్వల స్కీమ్’ కింద ఇప్పటి వరకు దేశంలోని 7.30 కోట్ల పేద కుటుంబాలకు ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లను మంజూరు చేశారు. 2020 సంవత్సరం నాటికి దేశంలోని ఎనిమిది కోట్ల పేద కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఈ లక్ష్యంలో ఇప్పటికే 91.25 లక్ష్యాన్ని సాధించింది. కనుక మిగతా లక్ష్యాన్ని పూర్తి చేయడంలో మరెంతో సమయం పట్టదు. ఇన్ని కోట్ల గ్యాస్ కనెక్షన్లను మంజూరు చేసినప్పటికీ గత రెండేళ్ల కాలంలో దేశంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల వినియోగం పెరిగింది మాత్రం 0.8 శాతం మాత్రమే. పెరిగిన వినియోగదారుల సంఖ్య కూడా ఆరు శాతమే. ఇలా ఎందుకు జరుగుతోంది ? ఉజ్వల స్కీమ్ కింద వంట గ్యాస్ కనెక్షన్లు తీసుకున్న వారిలో ఎక్కువ మంది గ్యాస్ సిలిండర్లను కొనుగోలు చేయడం లేదనేది సులభంగానే అర్థం అవుతోంది. ఉజ్వల స్కీమ్ కింద వినియోగదారులంతా కలిసి ఏడాదికి తలసరి 3.4 శాతం సిలిండర్లు వినియోగిస్తున్న ప్రభుత్వ లెక్కలే తెలియజేస్తున్నాయి. ‘కొలాబరేటివ్ క్లీన్ ఏర్ పాలసీ సెంటర్’ ప్రకారం వీరు తలసరి కనీసం తొమ్మిది సిలిండర్లు వినియోగించాలి. మరి ఎందుకు వినియోగించడం లేదు. గ్యాస్ సిలిండర్ల ఖరీదును భరించలేక వారంతా ఇప్పటికీ వంట చెరకు, పిడకలపైనే ఆధారపడి వంట చేసుకుంటున్నారు. దేశం మొత్తం మీదుండే ఐదొంతుల గ్రామీణ ప్రజల్లో రెండొంతుల మంది బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనే ఉన్నారు. వారిలో 85 శాతం మంది ఇప్పటికీ సంప్రదాయ వంట చెరకునే వాడుతున్నారని ‘ఇండియా స్పెండ్’ పరిశోధన సంస్థ వెల్లడించింది. వంట కోసం కట్టెలు, పిడకలు, ఊక ఉపయోగించడం వల్ల రోజురోజుకు వాతావరణ కాలుష్యం పెరుగుతోంది. మొత్తం కాలుష్యంలో వీటి వాటా 25 నుంచి 30 శాతం ఉంటుంది. వంట కాలుష్యం వల్ల ఏటా 4,80.000 మంది అకాలంగా మరణిస్తున్నారన్నది క్లీన్ ఏర్ పాలసీ సెంటర్ అంచనా. వంట గ్యాస్‌ను ఉపయోగించడం ఈ అకాల మరణాలను సులభంగా అడ్డుకోవచ్చు. ఈ పేద వినియోగదారుల ఇంటికి గ్యాస్ సిలిండర్‌ను కచ్చితంగా పంపించడం వల్ల ఒక్కొక్క వినియోగదారుడి ఆరోగ్యం ప్రభుత్వం పెడుతున్న ఖర్చును 3,800 నుంచి 1,800 రూపాయల వరకు ఆదా చేయవచ్చు. వంటగ్యాస్ సబ్సిడీ కోసం కేంద్రం ఖర్చు పెడుతున్న మొత్తం 2019–20 బడ్జెట్ అంచనాల ప్రకారం 32,989 కోట్ల రూపాయలు. ఇంత పెద్ద మొత్తంలో ఖర్జు పెడుతున్నా ఆశించిన ఫలితం రాకపోవడం బాధాకరం. ఉజ్వల స్కీమ్ కింద పేద వినియోగదారుడికి సిలిండర్‌కు ఆరేడు వందల రూపాల భారం పడుతోంది. అది ఏ నాలుగు వందల రూపాయల లోపల వస్తేగానీ, అంటే 350 రూపాయలకు వస్తేనేగానీ ఆ వినియోగదారుడు కొనుగోలు చేయడానికి సాహసించలేడు. అందుకని ఈ మేరకు పేదలపై సిలిండర్ సబ్సిడీని పెంచి, మిగతా వినియోగదారులపై తగ్గించాలని ‘సీసీఏపీసీ’ కేంద్రానికి సిఫార్సు చేసింది. -
అంగన్వాడీ టీచర్ల జీతం 50 శాతం పెంపు
-
బడ్జెట్ 2019 : అంగన్వాడీల వేతనాలు పెంపు
న్యూఢిల్లీ : బడ్జెట్లో మోదీ ప్రభుత్వం మహిళలకు పెద్ద పీట వేసిందని పీయూష్ గోయల్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని 8 కోట్ల మందికి ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వాడానికి రూపొందించిన ‘ప్రధాన్ మంత్రి ఉజ్వాలా యోజన ’పథకంలో భాగంగా ఇప్పటికే 6 కోట్ల మందికి ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చినట్లు తెలిపారు. అంతేకాక అంగన్వాడీ సిబ్బంది వేతానాన్ని 50 శాతం పెంచుతున్నట్లు ప్రకటించారు. అంతేకాక ‘ప్రధాన్ మంత్రి ముద్రా యోజన’ పథకంలో 75 శాతం మంది మహిళా లబ్ధిదారులున్నట్లు తెలిపారు. ‘మాతృత్వ యోజన’ పథకం ద్వారా మహిళా ఉద్యోగులకు 26 వారాల సెలవు దినాలు ఇస్తున్నట్లు తెలిపారు. -
పైప్ గ్యాస్ 400 జిల్లాల్లో
న్యూఢిల్లీ: రాబోయే 2–3 ఏళ్లలో దేశవ్యాప్తంగా 400 జిల్లాల్లో పైప్‌లైన్ ద్వారా ఇళ్లకు గ్యాస్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తామని ప్రధాని మోదీ తెలిపారు. దేశంలోని సీఎన్జీ స్టేషన్ల సంఖ్యను 2020 నాటికి 10,000కు పెంచుతామన్నారు. పారిస్ వాతావరణ సదస్సు(కాప్ 21) సందర్భంగా కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా కాలుష్య నియంత్రణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 129 జిల్లాల్లోని ఇళ్లకు పైప్‌లైన్ ద్వారా వంటగ్యాస్ అందించే సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్(సీజీడీ) నెట్వర్క్ పనులకు ప్రధాని మోదీ గురువారం ఢిల్లీలో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. 10వ రౌండ్ గ్యాస్ లైసెన్స్ బిడ్డింగ్‌ను ప్రారంభించారు. 90 % కుటుంబాలకు ఎల్పీజీ సౌకర్యం.. ‘కేంద్ర ప్రభుత్వం గత నాలుగేళ్లలో 12 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చింది. వీటిలో దాదాపు 6 కోట్ల ఉజ్వల ఉచిత కనెక్షన్లు ఉన్నాయి. మా ప్రభుత్వం చొరవతో దేశంలో 90 శాతం కుటుంబాలకు గ్యాస్ సౌకర్యం లభించింది. కానీ నాలుగేళ్ల క్రితం దేశంలోని 55 శాతం మందికి మాత్రమే ఎల్పీజీ సౌకర్యం ఉండేది. అంటే గత 60 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కేవలం 13 కోట్ల మందికి మాత్రమే ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చింది. యూపీఏ హయాంలో 24 లక్షలుగా ఉన్న పైప్‌లైన్ గ్యాస్ కనెక్షన్లు గత నాలుగేళ్లలో 2 కోట్లకు చేరుకున్నాయి. 2014లో దేశ ప్రజలు కేవలం ప్రభుత్వాన్నే కాదు.. పనిచేసే విధానం, సంస్కృతిని మార్చేశారు అంటే అతిశయోక్తేమీ లేదు’ అని ప్రధాని మోదీ తెలిపారు. కాలుష్యానికి అడ్డుకట్ట.. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి దేశంలోని 66 జిల్లాల్లో మాత్రమే సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉండేదని ప్రధాని వెల్లడించారు. ‘ప్రస్తుతం దేశంలోని సీజీడీల సంఖ్యను పెంచేందుకు ఎన్డీయే ప్రభుత్వం కృషి చేస్తోంది. 18 రాష్ట్రాల్లోని 129 జిల్లాల్లో(50 జియోగ్రాఫికల్ ఏరియాలుగా విభజించారు) ఇళ్లకు వంటగ్యాస్ అందించే పనులకు శ్రీకారం చుట్టాం. 10వ రౌండ్ బిడ్డింగ్ పూర్తయితే దేశంలోని 70 శాతం జనాభాకు గ్యాస్ అందుబాటులోకి వస్తుంది. స్వేచ్ఛాయుత గ్యాస్ మార్కెట్, ధరల నియంత్రణ కోసం ట్రేడింగ్ ఎక్ఛ్సేంజ్‌తో పాటు స్వతంత్ర రవాణా వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. దేశీయ గ్యాస్ ధరలను అంతర్జాతీయ మార్కెట్‌తో అనుసంధానిస్తాం. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేవారి ఆసక్తులను పరిరక్షిస్తాం. పంట వ్యర్థాలను బయో–సీఎన్జీగా మార్చే 5వేల ప్లాంట్లను ఏర్పాటుచేస్తాం’ అని అన్నారు. బిడ్డింగ్‌లో నెల్లూరుకు చోటు సీఎన్జీ పర్యావరణ హితమైనదనీ, దీని ఖర్చు పెట్రోల్, డీజిల్, ఎల్పీజీతో పోల్చుకుంటే తక్కువని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. 10వ రౌండ్ బిడ్డింగ్ లో భాగంగా నెల్లూరు(ఏపీ), కొల్లామ్, అలప్పుజా(కేరళ), ఉజ్జయిని, గ్వాలియర్, మొరేనా(మధ్యప్రదేశ్), మైసూర్, గుల్బర్గా(కర్ణాటక), ముజఫర్‌పూర్(బిహార్) సహా 19 నగరాల్లో సీజీడీ నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ, రాజస్తాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికల నిబంధనల నేపథ్యంలో ఈ రాష్ట్రాల్లో శంకుస్థాపనను నిలిపివేశామని స్పష్టం చేశారు. 2030 నాటికి దేశ విద్యుత్ అవసరాల్లో 40 శాతాన్ని సంప్రదాయేతర ఇంధన వనరుల నుంచి ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. -
మహిళలకు బడ్జెట్ బొనాంజా
సాక్షి, న్యూఢిల్లీ : మహిళలను ప్రసన్నం చేసుకునేలా 2018-19 బడ్జెట్లో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వారిపై వరాలు కురిపించారు. దేశవ్యాప్తంగా 8 కోట్ల పేద మహిళలకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు అందచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశించుకుందని వెల్లడించారు. గత బడ్జెట్లలోనూ జైట్లీ ఉచిత ఎల్పీజీ కనెక్షన్లను పెద్ద ఎత్తున పేద మహిళలకు అందుబాటులోకి తెస్తామని ప్రకటిస్తూ వచ్చారు. అయితే మహిళల వంటింటి బడ్జెట్ పెరుగుతున్న క్రమంలో గ్యాస్, ఇతర నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణను మాత్రం జైట్లీ ప్రస్తావించకపోవడం గమనార్హం. -
ఇక నిలకడగా సిలెండర్ ధర
సబ్సిడీ వంటగ్యాస్ సిలెండర్ ధరను నెలకు రూ. 4 చొప్పున పెంచుతూ వచ్చే మార్చినాటికి సబ్సిడీని పూర్తిగా ఎత్తేయాలని సంకల్పించుకున్న కేంద్ర ప్రభుత్వానికి వ్రత భంగమైంది. ఇకపై ధర పెంచొద్దని చమురు రంగ సంస్థలకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. మౌఖికంగా చెప్పడం వల్లనో ఏమో... వాస్తవానికి మొన్న అక్టోబర్ నుంచే సబ్సిడీ గ్యాస్ సిలెండర్ ధర పెరగడం ఆగింది. అందుకు సంబంధించిన లిఖితపూర్వక ఉత్తర్వులు ఇప్పుడొచ్చాయి. ఈ నిర్ణయం తీసుకోవడం వెనక కారణా లేమిటో మాకు చెప్పలేదని చమురు సంస్థలు అంటున్నాయి. ప్రజలకు చెప్పిన కారణమైతే అంత హేతుబద్ధంగా లేదు. ఓ వైపు ఉజ్వల పథకం కింద పేదలకు ఉచితంగా ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వడం... మరోవైపు సిలెండర్ ధర పెంచుకుంటూ పోవడం పరస్పర విరుద్ధమైన విధానాలుగా గుర్తించడంవల్ల ఈ నిర్ణయం తీసుకు న్నామని కేంద్రం ప్రకటించింది. ‘కారణమేదైనా ధర పెరగదన్నారు అదే పదివేల’ని మధ్యతరగతి ప్రజలు ఊపిరి పీల్చుకుంటారు. ఇంతకూ తాజా నిర్ణయానికి కారణ మేమిటి? దారిద్య్ర రేఖకు దిగువనున్న కుటుంబాలకు వచ్చే మూడేళ్లలో ఉచితంగా 5 కోట్ల వంటగ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలన్న లక్ష్యంతో నిరుడు మే నెలలో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన(పీఎంయూవై) పథకాన్ని ప్రారంభించింది. అది విజయవంతంగా అమలవుతోంది. దానికింద ఇప్పటికి 3.2 కోట్ల మంది లబ్ధి పొందారు. ఆ పథకం ప్రారంభమైన రెండు నెలలకే...అంటే నిరుడు జూన్‌లో సబ్సిడీ సిలెండర్ ధరను నెలకు రూ. 2 చొప్పున పెంచాలని కేంద్రం ఆదేశా లిచ్చింది. మొన్న జూన్ నుంచి ఆ రెండు రూపాయలు కాస్తా రూ. 4 అయింది. ఇలా పెంచుతూ వచ్చే మార్చి నాటికి సబ్సిడీని పూర్తిగా తొలగించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. పీఎంయూవై పథకానికీ, సబ్సిడీ సిలెండర్ ధర పెంచుకుంటూ పోవాలన్న నిర్ణయానికీ మధ్య వైరుధ్యం ఉన్నదని గుర్తించడానికి ఏణ్ణర్ధం పట్టిందంటే అది నమ్మదగినదిగా లేదు. ఎందుకంటే ప్రభుత్వ విధానాలనూ, నిర్ణయాలనూ ప్రకటిం చేది వివిధ శాఖల మంత్రులు కావొచ్చుగానీ... ఆ నిర్ణయానికొచ్చే ముందు వేర్వేరు స్థాయిల్లో మథనం జరుగుతుంది. పలు కోణాల్లో ఉన్నతాధికారులు, నిపుణులు పరి శీలించి తమ అభిప్రాయాలు చెబుతారు. ఈ క్రమంలో ఏ దశలోనూ వైరుధ్యం ఉన్నట్టు తాను గుర్తించలేదని ప్రభుత్వం చెప్పడమంటే నిర్ణయం తీసుకునే ప్రక్రియ సరిగా లేదని అంగీకరించినట్టు లెక్క. సిలెండర్ ధర పెంపును ఆపేయాలని మొన్న అక్టోబర్‌లో మౌఖికంగా చమురు సంస్థలకు చెప్పినప్పుడే పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గించాలని కూడా కేంద్రం నిర్ణయించింది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం ప్రారంభమై దాని ప్రభావం పెట్రోల్, డీజిల్‌పై చూపడం మొదలయ్యాక జనంలో ఆగ్రహా వేశాలు మొదలయ్యాయి. అందువల్లే వాటిపై ఎక్సైజ్ సుంకం తగ్గించాలని నిర్ణయిం చారు. ఇదిగాక గత నెలాఖరులో చమురు ఎగుమతి దేశాల సంస్థ(ఒపెక్)కూ, రష్యాకూ మధ్య చమురు ఉత్పత్తి కోతపై ఒప్పందం కుదిరాక చమురు ధరలు మరింత పెరగడం మొదలైంది. 2018లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్ గఢ్లతోపాటు ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్, మిజోరం, మేఘాలయ అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. కొందరు అంచనా వేస్తున్నట్టు వాటితోపాటు లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు వచ్చినా రావొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం, వాటికి అనుగుణంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలెండర్ ధరలు పెరగడం కేంద్ర ప్రభుత్వానికి క్షేమం కాదు. మన పాలకుల్లో సంస్కరణలు అమలు చేయాలన్న తహతహకూ, వాటి పర్య వసానంగా ఇబ్బందులెదుర్కొంటున్న ప్రజల ప్రయోజనాలకు మధ్య ఎప్పుడూ వైరుధ్యం ఉంది. ధరలు పెరిగితే ప్రజలు వెనువెంటనే రోడ్లపైకొచ్చి ఉద్యమాలు చేయకపోవచ్చుగానీ... ఎన్నికల్లో అధికార పక్షాన్ని శిక్షించిన దాఖలాలు గతంలో చాలానే ఉన్నాయి. ఈమధ్య జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అనుకున్న స్థాయిలో స్థానాలు లభించకపోవడం వెనకున్న అనేక కారణాల్లో ధరల పెరుగుదల కూడా ఒకటి. ఇప్పటికే సబ్సిడీ సిలెండర్లకు రకరకాల కారణాలతో కోత మొదలైంది. రూ. 10 లక్షల వరకూ వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలకు ఏడాదికి 12 సిలెండర్లు మాత్రమే ఇవ్వాలని యూపీఏ ప్రభుత్వం పదవినుంచి వైదొలగే ముందు నిర్ణయించింది. అంతకు మించితే ఆ వర్గాలవారు మార్కెట్ ధర చెల్లించి సిలెండర్లు కొనుక్కోవలసి వస్తోంది. అదిగాక ఆధార్‌తో అనుసంధానించడం తప్పని సరి చేయడంతో 3.5 కోట్ల వంటగ్యాస్ కనెక్షన్లు రద్దయ్యాయని, అందువల్ల రూ. 21,261 కోట్లు ఆదా అయ్యాయని కేంద్రం చెబుతోంది. దీనికితోడు కారున్న కుటుంబాలకు వంటగ్యాస్ సబ్సిడీ తొలగించాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని ఆమధ్య వార్తలొచ్చాయి. దేశంలో ఆర్ధిక సంస్కరణలు మొదలైనప్పటి నుంచీ సంక్షేమ భావన కొడిగడుతోంది. కేంద్రంలో ఏ కూటమి పరిపాలించినా ఈ సంస్కరణల విషయంలో ఒకేలా ఆలోచిస్తున్నాయి. విపక్షంలో ఉండగా వ్యతి రేకించడం, అధికారంలోకొచ్చాక ఆ విధానాలనే కొనసాగించడం ఆనవాయితీగా మారింది. అయితే దాదాపు ప్రతి ఏటా ఏదో ఒక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వస్తుండటం వల్ల ఈ సంస్కరణలకు అప్పుడప్పుడు బ్రేకులు పడుతున్నాయి. బహుశా అందుకే కావొచ్చు... ఈమధ్య లోక్‌సభకూ, అసెంబ్లీలకూ జమిలి ఎన్ని కలు జరగాలన్న వాదన తెరపైకొచ్చింది. ఏదేమైనా వంటగ్యాస్ సిలెండర్ ధర పెంపుదలకు బ్రేక్ పడిందన్న వార్త పేద, మధ్యతరగతి ప్రజలకు ఊరటనిస్తుంది. పనిలో పనిగా చమురు సంస్థలపై విధిస్తున్న రకరకాల పన్నులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హేతుబద్ధం చేస్తే వీటి ధరలు నిలకడగా ఉండటంకాదు... గణ నీయంగా తగ్గుతాయి కూడా. మన పాలకులు ఆ దిశగా ఆలోచించాలని అందరూ కోరుకుంటున్నారు. -
దీపం.. వేగవంతం
వంటగ్యాస్ కనెక్షన్ లేని దారిద్య్రరేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) కుటుంబాలకు దీపం కనెక్షన్లు ఇచ్చేందుకు అధికారులు ప్రక్రియను వేగవంతం చేశారు. రెండేళ్ల కిందట జిల్లాకు మంజూరైన కనెక్షన్లు వివిధ కారణాల వల్ల ఇప్పటికీ పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు చేరలేదు. వీలైనంత త్వరగా వీటిని పేద కుటుంబాలకు ఇవ్వాలని జిల్లా పౌర సరఫరాల శాఖ సంకల్పించింది. దరఖాస్తు చేసుకున్న అర్హులకు దాదాపు 20 రోజుల్లో కనెక్షన్లు అందజేయాలని యోచిస్తోంది. సాక్షి,రంగారెడ్డి జిల్లా: జిల్లాకు 2015–16 సంవత్సరంలో 41,746 దీపం కనెక్షన్లు (కొత్త రంగారెడ్డి జిల్లా కోటా) మంజూరయ్యాయి. వీటి కోసం జిల్లా వ్యాప్తంగా 24,243 లబ్ధిదారులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో నిబంధనల ప్రకారం అర్హులను గుర్తించిన యంత్రాంగం.. 23,978 దరఖాస్తులను ఆమోదించింది. వీరిలో 14,482 మందికి వంటగ్యాస్ కనెక్షన్లు అందజేశారు. ఆమోదం పొందిన వాటిలో మిగిలిన లబ్ధిదారులకు వీలైనంత త్వరగా ఇచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే జిల్లాకు మంజూరైన మొత్తం 41,746 కనెక్షన్లలో 58 శాతం కనెక్షన్లకు మాత్రమే దరఖాస్తులు అందగా.. మిగిలిన 42 శాతం అంటే 17,768 కనెక్షన్లకు దరఖాస్తులు రాలేదు. క్షేత్రస్థాయిలో బీపీఎల్ కుటుంబాలకు సమాచారం చేరకపోవడం, అధికారులు ప్రచారం కల్పించడకపోవడం తదితర కారణాల వల్ల స్పందన అంతంతమాత్రంగానే వచ్చింది. ఈ నేపథ్యంలో కనెక్షన్లు అవసరం అనుకున్న బీపీఎల్ కుటుంబాలు దరఖాస్తు చేసుకుంటే మంజూరు చేస్తామని అధికారులు తెలిపారు. క్షేత్రస్థాయిలో అర్హులైన లబ్ధిదారులు ఉంటే దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించాలని వంటగ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు జిల్లా పౌరసరఫరాల అధికారులు సూచించారు. అలాగే కిరోసిన్ తీసుకుంటున్న కుటుంబాలకు దీపం కనెక్షన్లు పొందేలా చూడాలని చౌక ధరల దుకాణాల యజమానులకు చెప్పినట్లు అధికారులు అంటున్నారు. దరఖాస్తు ప్రక్రియ ఇలా... ► ఆహార భద్రత (రేషన్)కార్డు కలిగి ఉండి వంటగ్యాస్ కనెక్షన్ లేని కుటుంబాలు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఆధార్‌కార్డు తప్పనిసరి. ► తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించాలి. ► నిబంధనల మేరకు అర్హులుగా గుర్తిస్తే.. లబ్ధిదారులు తమ వాటాగా సుమారు రూ.వెయ్యి చెల్లించాలి. ► గ్యాస్ నింపిన బండ, నాణ్యమైన రెగ్యులేటర్, పైపు అందజేస్తారు. ► స్టౌని లబ్ధిదారులు మార్కెట్లో గానీ, వంటగ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల వద్దనైనా కొనుగోలు చేసుకోవచ్చు. ► ఒకవేళ మార్కెట్లో స్టౌను కొనుగోలు చేస్తే డిస్ట్రిబ్యూటర్‌కు ఇన్స్టలేషన్ చార్జీల కింద రూ.250 చెల్లించాలి. -
ఎనిమిది నెలల్లో 1.5 కోట్ల గ్యాస్ కనెక్షన్లు
చెన్నై: ప్రధానమంత్రి ఉజ్వల యోజన(పీఎంయూవై) పథకం కింద కేవలం 8 నెలల కాలంలోనే కేంద్రప్రభుత్వం 1.5 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు జారీచేసింది. ప్రస్తుతం ఈ పథకం దేశవ్యాప్తంగా అమల్లో ఉంది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న మహిళలకు కేంద్రప్రభుత్వం డిపాజిట్ రహిత ఎల్పీజీ కనెక్షన్ కు రూ.1,600 ఆర్థికసాయం అందిస్తోంది. ఈ పథకం కోసం కేంద్రం బడ్జెట్లో రూ.8000 కోట్లు కేటాయించింది. ముఖ్యంగా జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌లలో పథకాన్ని మరింత విస్తృతస్థాయిలో అమలుచేయాలని కేంద్రం నిర్ణయించింది. అత్యధికంగా యూపీలో 46 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. తొలి ఐదు రాష్ట్రాల జాబితాలో పశ్చిమబెంగాల్(19లక్షలు), బిహార్(19లక్షలు), మధ్యప్రదేశ్(17లక్షలు), రాజస్థాన్ (14లక్షలు) ఉన్నాయి. -
1.5 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు
న్యూఢిల్లీ: ఏడాదిలో 1.5 కోట్ల ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు అందివ్వాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం కేవలం ఎనిమిది నెలల్లోనే చేరుకుంది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద మూడేళ్లలో 5 కోట్ల నిరుపేద కుటుంబాలకు ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా తొలి ఏడాది 1.5 కోట్ల కనెక్షన్లు జారీచేయాలని నిర్దేశించుకుంది. మూడేళ్లకు రూ.8 వేల కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని 2016–17 బడ్జెట్లో ప్రకటించారు. సామాజిక, ఆర్థిక, కుల గణన(ఎస్ఈసీసీ) సమాచారం ఆధారంగా గుర్తించిన నిరుపేద కుటుంబ మహిళ పేరిట ఉచితంగా ఎల్పీజీ కనెక్షన్ జారీచేస్తారు. -
రూ.22 వేల కోట్లు ఆదా చేశాం: ధర్మేంద్ర ప్రధాన్
గడిచిన రెండేళ్లలో నకిలీ ఎల్పీజీ కనెక్షన్లు తొలగించడం ద్వారా రూ.22 వేల కోట్లు ఆదా చేశామని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. రానున్న ఐదేళ్లలో గ్యాస్, చమురు కేంద్రాల్లో లక్షకోట్ల పెట్టుబడులు సిద్ధంగా ఉన్నాయని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఓఎన్జీసీ, రిలయన్స్ సంస్థలు ఇన్వెస్ట్ చేయనున్నాయని ఆయన పేర్కొన్నారు. పెట్రో కెమికల్ పరంగా ఏపీకి చాలా ప్రాధాన్యం ఉందన్నారు. ఇప్పటికే విశాఖలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గుర్తుచేశారు. -
‘దీపం’ పేరుతో దోపిడీ
తిరువూరు : తెలుగు మహిళలు కట్టెల పొయ్యిపై వంట చేయడం చూడలేక అందరికీ దీపం పథకం కింద వంటగ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతుండగా, ఆ కనెక్షన్లకు అధిక ధరలు వసూలు చేస్తూ తెలుగు తమ్ముళ్లు మహిళల్ని మోసగిస్తున్నారు. ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు రూ. 1600 సబ్సిడీపై దీపం కనెక్షన్లను మంజూరు చేస్తుండగా, లబ్ధిదారులు కేవలం రూ.920 మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. జిల్లాలోని ప్రతి మండలంలో 200 నుంచి 350 మంది డ్వాక్రా గ్రూపుల మహిళల్ని ఎంపిక చేసి గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వంటగ్యాస్ కనెక్షన్లు ఇవ్వడానికి అధికారులు నిర్ణయించగా, ఇంతవరకు పంపిణీ పూర్తికాలేదు. సాధారణంగా గ్యాస్ ఏజెన్సీల నుంచి నేరుగా కొనుగోలు చేసినా రూ.2,500 మించి ధర ఉండదు. అదీకాకుండా అదనంగా మరో రూ.వెయ్యి దండుకుంటున్న వైనంపై అధికారులు సైతం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అధిక రేట్ల వసూలు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు రెట్టింపు వసూలు చేస్తూ దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. వంటగ్యాస్ రీఫిల్లింగ్, పాస్‌బుక్, ఇన్స్టాలేషన్ రుసుం మాత్రమే లబ్ధిదారు చెల్లించాల్సి ఉండగా, అదనంగా గ్యాస్ స్టవ్‌ను డీలర్లు అంటగడుతున్నారు. దీని ధర రూ.900 లోపే ఉన్నప్పటికీ రెట్టింపు ధర వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల గంపలగూడెంలో లబ్ధిదారులు గ్యాస్ ఏజెన్సీలో అధిక ధరలు వసూలు చేయడంపై ఫిర్యాదు చేయడంతో అధికారులు నిర్ణీత ధరలను ప్రకటించారు. అయితే, గ్యాస్ ఏజెన్సీల వద్ద ఈ ధరలను ప్రదర్శిస్తే అదనపు వసూళ్లను అరికట్టవచ్చని పలువురు భావిస్తున్నారు. డ్వాక్రా మహిళలకు బురిడీ దీపం పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు మాయమాటలు చెప్పి కొందరు తెలుగు తమ్ముళ్లు వారినుంచి అధిక మొత్తంలో వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం తక్కువ ధరకు వంటగ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తోందని, ఈ అవకాశం వదులుకుంటే మళ్లీ మంజూరు చేయరని చెబుతూ అదనపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. తహశీల్దారు, ఎంపీడీవో, ఇందిరా క్రాంతి పథం అధికారులతో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి దీపం పథకం సజావుగా అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు. -
గడువు మూడు రోజులే..!
సాక్షి, సిటీబ్యూరో: ఇక మూడు రోజులే గడువు. గ్రేటర్ హైదరాబాద్‌లో సబ్సిడీ ఎల్పీజీతో ఆధార్ అనుసంధానానికి ఈనెల 31 (శనివారం)తో గడువు ముగియనుంది. ఇప్పటి వరకు ఈ ప్రక్రియ కింద ఎల్పీజీ కనెక్షన్లు ఆధార్, బ్యాంక్ ఖాతాలతో అనుసంధానమైంది 34 శాతమే. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 3 నెలలుగా ప్రయోగాత్మకంగా సబ్సిడీ ఎల్పీజీకీ ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ) పథకం అమలవుతున్నా... అనుసంధాన ప్రక్రియ నత్తనడక నడుస్తోంది. గడువులోగా ఆధార్ పొందని గ్యాస్ వినియోగదారులు.. గ్యాస్ సిలిండర్‌ను మార్కెట్ ధరకే కొనుక్కోవాల్సి ఉంటుంది. మూడేళ్లుగా నమోదు ప్రక్రియ.. గ్రేటర్లో 2010 సెప్టెంబరు నుంచి ఆధార్ నమోదు ప్రక్రియ నమోదైంది. అప్పట్లో 136 కేంద్రాలు ఏర్పాటు చేశారు. గతేడాది ఫిబ్రవరి 15 నుంచి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) సాఫ్ట్వేర్ హాలిడే ప్రకటించటంతో ప్రక్రియ నిలిచిపోయింది. తిరిగి సెప్టెం బరు నుంచి కేంద్రాల్ని ప్రారంభించారు. సబ్సిడీ గ్యాస్ ఆధార్‌తో అనుసంధానం కావటం తప్పనిసరి అని ప్రకటించటంతో ఆధార్ ప్రాధాన్యం పెరిగింది. కాగా, ఒకపక్క జనాభాకు మించి ఆధార్‌లో పేర్లను నమోదు చేసుకొని ఐరిస్ ఫొటోలు దిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. వాస్తవంగా చూస్తే ఇప్పటికీ గ్రేటర్ మొత్తం మీద 52 లక్షల మందికి మించి ఆధార్ అందలేదు. కాగా, గ్రేటర్ హైదరాబాద్‌లో దాదాపు 10 లక్షల మంది ఫొటో డేటా ఎంట్రీ గల్లంతైనట్లు తెలుస్తోంది. వీరంతా వెబ్సైట్లో ‘స్టేటస్’లో కోసం అన్వేషిస్తే ‘ఎర్రర్’ అని బదులొస్తోంది. అలాగే, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సుమారు 4.68 లక్షల (హైదరాబాద్: 2,36, 622- రంగారెడ్డి: 2,31,984) దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. పేర్ల నమోదులో తేడా, వేలిముద్రల్లో లోపాలు, స్టాఫ్‌వేర్ పనితీరు వంటివి ఇందుకు కారణాలు. నమోదులో నిర్లక్ష్యం... ఎల్పీజీ వినియోగదారుడు ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతాలు సమర్పించిన తక్షణమే నమోదు జరగాలి. కానీ, డీలర్లు, బ్యాంకర్ల నిర్లక్ష్యంతో అది సరిగా జరగట్లేదు. ఒకవైపు డీలర్ల వద్ద ఎల్పీజీ సీడింగ్ 65 శాతం పూర్తయితే బ్యాంకర్ల వద్ద 34 శాతం మించట్లేదు. దీంతో కొందరు సబ్సిడీకి నోచుకోవటం లేదు. ఇక, ఆధార్ అనుసంధానంపై పౌరసరఫరాల, బ్యాంకు అధికారుల లెక్కలకు పొంతన లేదు. హైదరాబాద్- రంగారెడ్డి జిల్లాల్లో 65 శాతం వరకు ఎల్పీజీ ఆధార్‌తో అనుసంధానమైట్లు చెబుతున్నా పౌరసరఫరాల అధికారులు 34 శాతం మించి కాలేదంటున్నారు. బ్యాంకర్లు తాము 55 శాతానికి మించి ఖాతాలను అనుసంధానం చేశామంటున్నారు. హైదరాబాద్ జిల్లాలో 6,73,482 మంది బ్యాంక్ ఖాతాతో ఎల్పీజీ ఆధార్ అనుసంధానమైనట్లు బ్యాంకర్లు చెబుతుండగా, ఎన్‌పీసీఎల్ మాత్రం 4,13,487 ఖాతాలే అయ్యాయంటోంది. అనుసంధానం తప్పనిసరి ఎల్పీజీని ఆధార్‌తో అనుసంధానం చేసుకోవటం తప్పనిసరి. అలా చేసుకోని వినియోగదారులు సబ్సిడీకి దూరం కావడం ఖాయం. - డాక్టర్ పద్మ, సీఆర్వో, హైదరాబాద్ ఆదివారం కూడా బ్యాంకులు వినియోగదారుల కోసం ఆదివారమూ బ్యాంకులు నడిపిస్తున్నాం. జీరో ఖాతాల ప్రారంభానికి వీలు కల్పించాం. డీలర్ల వద్ద డ్రాప్ బాక్స్‌లు ఉంచాం. - భరత్‌కుమార్, చీఫ్ మేనేజర్, లీడ్‌బ్యాంక్, హైదరాబాద్