
సాక్షి, న్యూఢిల్లీ : మహిళలను ప్రసన్నం చేసుకునేలా 2018-19 బడ్జెట్‌లో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వారిపై వరాలు కురిపించారు. దేశవ్యాప్తంగా 8 కోట్ల పేద మహిళలకు ఉచిత ఎల్‌పీజీ కనెక్షన్లు అందచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశించుకుందని వెల్లడించారు.
గత బడ్జెట్లలోనూ జైట్లీ ఉచిత ఎల్‌పీజీ కనెక్షన్లను పెద్ద ఎత్తున పేద మహిళలకు అందుబాటులోకి తెస్తామని ప్రకటిస్తూ వచ్చారు. అయితే మహిళల వంటింటి బడ్జెట్ పెరుగుతున్న క్రమంలో గ్యాస్, ఇతర నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణను మాత్రం జైట్లీ ప్రస్తావించకపోవడం గమనార్హం.