కేంద్ర బడ్జెట్ వాయిదా వేయాలన్న ప్రతిపక్షాల డిమాండ్ పై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు.
న్యూఢిల్లీ: కేరళ ఎంపీ ఈ. అహ్మద్ మృతి నేపథ్యంలో కేంద్ర బడ్జెట్ వాయిదా వేయాలన్న ప్రతిపక్షాల డిమాండ్ పై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు. కేంద్ర బడ్జెట్ పవిత్రతను ప్రతి ఒక్కరూ కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఎంపీ మృతి నేపథ్యంలో బడ్జెట్‌ను వాయిదా వేయాలా? వద్దా? అన్నది లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తుది నిర్ణయం తీసుకుంటారని ఆయన స్పష్టం చేశారు. కాగా, బడ్జెట్ వాయిదా వేయాలన్న ప్రతిపక్షాల డిమాండ్ ను స్పీకర్ మహాజన్, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తోసిపుచ్చారు. ముందుగా అనుకున్న ప్రకారమే కేంద్ర బడ్జెట్ యతాథతంగా ఉంటుందని వారు వెల్లడించారు.