మోతెక్కనున్న కార్ల ధరలు
దేశంలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. వ్యక్తిగత వాహనాల సంఖ్య ఎక్కువ కావడంతో ఇటు కాలుష్యంతో పాటు అటు ట్రాఫిక్ సమస్య పెరగడం కూడా పలు నగరాల్లో కనిపిస్తోంది. ఈ పరిణామాన్ని గమనించిన కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వాహనాల ధరలు పెరిగేలా కొత్తగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెస్ ఒకదాన్ని విధించారు.
చిన్న పెట్రోలు, ఎల్‌పీజీ, సీఎన్‌జీ కార్ల మీద ఒక శాతం, డీజిల్ కార్ల మీద 2.5 శాతం విధించారు. ఇక ఎక్కువ ఇంజన్ సామర్థ్యం కలిగిన వాహనాలు, ఎస్‌యూవీల మీద అయితే 4 శాతం వరకు ఈ సెస్ విధించారు. దాంతో ఆ మేరకు వాహనాల ధరలు కచ్చితంగా పెరుగుతాయి.