
బడ్జెట్ పై బాలీవుడ్ ఏమంది?
ముంబై: ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం లోక్ సభలో ప్రవేశపెట్టిన 2017-18 ఆర్థిక బడ్జెట్ పై బాలీవుడ్ నెగిటివ్ గా స్పందించింది. ప్రస్తుత ఆర్థిక బడ్జెట్ లో ఎలాంటి చిత్రపరిశ్రమకు సంబంధించి ఎలాంటి ప్రస్తావన లేకపోవడాన్ని తప్పుబట్టింది. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా, భారీ ఉద్యోగాల కల్పించే కీలకరంగంగా ఉన్న బాలీవుడ్ ను పట్టించుకోలేదని విమర్శించారు. బడ్జెట్ పై స్పందించిన బీ టౌన్ ప్రముఖులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ ఏడాది బడ్జెట్ నుంచి బాలీవుడ్ ను పక్కన పెట్టినట్టుగా భావించారు. తమ రంగానికి ఎలాంటి సహాయం. భారీ పన్నులనుంచి సడలింపు లేకుండానే ముగిసిందని వ్యాఖ్యానించారు
ముఖ్యంగా ప్రముఖ నిర్మాత ముఖేష్ భట్ దీనిపై విచారం వ్యక్తం చేశారు. చిత్ర పరిశ్రమ గురించి కనీస ప్రస్తావనకూడా లేకపోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తంచేశారు. పైరసీ భూతంపై మాట్లాడకపోవడం తమను బాధించిందన్నారు. మరో నిర్మాత కునాల్ కోహ్లీ ముఖేష్ కు మద్దతుగా నిలిచారు. బడ్జెట్ లో చలన చిత్ర రంగాన్ని చేర్చకపోవడం విచారంగా ఉందన్నారు. అంగీకరించారు.పార్లమెంటు లో సభ్యులుగా సినీరంగ ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పార్లమెంటు లోను ప్రభుత్వంలోను తమకు ప్రతినిధులుగా ఉన్న సభ్యులు దీనిపై మాట్లాడాలన్నారు. చిత్రపరిశ్రమ ప్రధాన ఆదాయ వనరుగా ఉందనీ, ఉద్యోగాల కల్పనలో ను కీలక పాత్ర పోషిస్తోందని ఆయన గుర్తు చేశారు. వినోద పన్నువిధింపులో రాష్ట్నానికి మధ్య రాష్ట్రానికి మధ్య తేడాలున్నాయనీ, మొత్తం చలన చిత్రపరిశ్రమకు యూనిఫారం టాక్స్ సిస్టం ఉండాలని అభిప్రాయపడ్డారు. అలాగే మిగిలిన దేశాలు ఇస్తున్నట్టుగా విదేశాల్లో షూటింగ్ నిమిత్తం కేంద్రం కూడా సబ్సిడీ ఇవ్వాలన్నారు. ఒక్క ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఇలాంటి సబ్సిడీ ఇస్తోందని తన ట్విట్ లో పేర్కొన్నారు.
మరోవైపు గాయకుడు, సంగీత దర్వకుడు విశాల్ దొడ్లాని బడ్జెట్ పై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా నల్లధనాన్ని అరికట్టేందుకు ప్రభుత్వ చర్య ఆకట్టుకుందన్నారు. వరుస ట్వీట్లను చేసిన ఆయన ఎగువ మధ్య తరగతి పన్ను మినహాయింపులేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు.