Cash deposit
-
కొత్త ఫీచర్: చేతిలోని క్యాష్.. ఈజీగా అకౌంట్లోకి..
యూపీఐ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చాక డిజిటల్ చెల్లింపుల్లో ఎప్పటికప్పుడు సరికొత్త మార్పులు వస్తున్నాయి. ఎవరికి నగదు పంపాలన్నా యూపీఐ యాప్‌ల ద్వారా క్షణాల్లో పంపించేస్తున్నాం. మరి క్యాష్ డిపాజిట్ అయితే ఏం చేస్తాం.. నేరుగా సంబంధిత బ్యాంకుకు వెళ్లి అకౌంట్లో వేయడమో లేదా ఆ బ్యాంకు ఏటీఎం మెషీన్లో డిపాజిట్ చేయడమో చేస్తాం. కానీ బ్యాంకుతో సంబంధం లేకుండా కేవలం యూపీఐ యాప్‌తో ఏ బ్యాంకు ఖాతాకైనా భౌతిక నగదును డిపాజిట్ చేసే అవకాశం ఉంటే బాగుంటుంది కదా.. అలాంటి కొత్త ఫీచర్ ఇప్పుడు వచ్చింది.ఏ బ్యాంక్ ఖాతాకైనా..యూపీఐ ఇంటర్ఆపరబుల్ క్యాష్ డిపాజిట్ (UPI-ICD) అనే కొత్త ఫీచర్ ఏటీఎంలలో నగదు డిపాజిట్ చేసే విధానాన్ని మరింత సులువుగా మార్చనుంది. ఈ వినూత్నమైన ఫీచర్లో ఏ యూపీఐ యాప్‌ను ఉపయోగించైనా, ఏ బ్యాంక్ ఖాతాలోకైనా నగదును డిపాజిట్ చేయవచ్చు. యాక్సిస్ బ్యాంక్, యూనియన్ బ్యాంకులకు చెందిన ఎంపిక చేసిన ఏటీఎంలలో ప్రస్తుతానికి ఈ ఫీచర్ అందుబాటులో ఉన్నప్పటికీ, సమీప భవిష్యత్తులో మరిన్ని బ్యాంకులు ఈ సౌలభ్యాన్ని అందించే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ఈ బ్యాంకులో ఎఫ్డీ.. మంచి వడ్డీ!డిపాజిట్ ఇలా.. » యూపీఐ-ఐసీడీని సపోర్ట్ చేసే అధునాతన నగదు రీసైక్లర్ మెషీన్లతో కూడిన ఏటీఎంలను గుర్తించండి.» మీ యూపై యాప్‌ని తెరిచి ఏటీఎం స్క్రీన్‌పై వచ్చే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయండి.» మీరు డిపాజిట్ చేయాలనుకుంటున్న మొత్తాన్ని నమోదు చేసి, లబ్ధిదారు ఖాతాను ఎంచుకోండి.» డిపాజిట్ స్లాట్‌లో నగదు పెట్టండి.» వివరాలను ధ్రువీకరించి యూపీఐ పిన్ ఉపయోగించి లావాదేవీని పూర్తి చేయండి.ప్రయోజనాలు» నగదు తక్షణమే లబ్ధిదారుల ఖాతాకు జమవుతుంది.» ఏటీఎం నగదు రీసైక్లర్ యంత్రం డిపాజిట్ చేసిన నోట్ల ప్రామాణికతను ధ్రువీకరిస్తుంది.» ఒక్కో లావాదేవీకి గరిష్టంగా రూ.50,000 డిపాజిట్ చేసేందుకు వీలు.» మొత్తం ప్రక్రియ డిజిటల్‌గా జరగుతుంది. ఎలాంటి కార్డ్స్, భౌతిక స్లిప్‌ల అవసరం ఉండదు.» ఇతర యూపీఐ లావాదేవీల మాదిరిగానే వీటికీ భద్రత ఉంటుంది. -
ఆర్బీఐ శుభవార్త : యూపీఐతో క్యాష్ డిపాజిట్.. ఎలా చేయొచ్చంటే?
ముంబై : బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త. త్వరలో క్యాష్ డిపాజిట్ చేసేందుకు బ్యాంక్‌కు వెళ్లే అవసరం లేకుండా యూపీఐ ద్వారా బ్యాంకుల్లో క్యాష్ డిపాజిట్ చేసే అవకాశాన్ని ఆర్బీఐ కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైన కొత్త ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష సమావేశ నిర్ణయాలను శక్తికాంత దాస్ శుక్రవారం వెల్లడించారు. ఈ సందర్భంగా బ్యాంకు ఖాతాదారులు తమ క్యాష్ డిపాజిట్ చేసేందుకు బ్యాంక్‌కు వెళ్లే అవసరం లేకుండా బ్యాంకుల్లో ఉన్న ‘క్యాష్ డిపాజిట్ మెషీన్ల’(సీడీఎంఏ)లో నేరుగా యూపీఐ ద్వారా బ్యాంకుల్లో క్యాష్ డిపాజిట్ చేసేలా కొత్త విధానాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. పెరిగిపోతున్న యూపీఐ వినియోగం దేశంలో రోజురోజుకి పెరిగిపోతున్న యూపీఐ వినియోగంతో బ్యాంకులు, ఏటీఎంలలో నగదు లావాదేవీల్లో పలు మార్పులు చేస్తున్నామన్న శక్తికాంత్ దాస్.. గతంలో డెబిట్ కార్డ్ సాయంతో ఏటీంఎలో డబ్బుల్ని డ్రా చేసే వీలుండేది. యూపీఐ రాకతో ఏటీఎంలలో కార్డ్ లేకుండా డబ్బుల్ని డ్రా చేసుకుంటున్నట్లు తెలిపారు. అదే విధంగా బ్యాంకుల్లో డబ్బుల్ని డిపాజిట్లను సీడీఎంఏ మెషీన్లలలో యూపీఐ ద్వారా చేసుకోవచ్చని సూచించారు. త్వరలో అమలుకు సంబంధించిన సూచనలను ప్రకటిస్తామని అన్నారు. పీపీఐ లింక్ థర్డ్ పార్టీ యూపీఐ అప్లికేషన్ల ద్వారా ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ (PPIs) లింక్ చేసుకోవడానికి కూడా అనుమతించాలని ఆర్బీఐ నిర్ణయించింది. ప్రస్తుతం బ్యాంక్ ఖాతాలకు లింక్ చేసిన యూపీఐ యాప్స్ ద్వారా మాత్రమే యూపీఐ పేమెంట్స్ చేయడానికి వీలవుతోంది. కానీ ఈ సదుపాయం ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ (PPIs) కు అందుబాటులో లేదు. పీపీఐలు యూపీఐ లావాదేవీలు చేయాలంటే, కచ్చితంగా పీపీఐ జారీచేసిన అప్లికేషన్లు మాత్రమే వాడాల్సి వస్తోంది. దీని వల్ల ఖాతాదారులకు ఎంతో అసౌకర్యం కలుగుతోంది. అందుకే పీపీఐ హోల్డర్లు కూడా బ్యాంక్ ఖాతాదారుల లాగా నేరుగా యూపీఐ చెల్లింపులు చేయడానికి అనుమతించాలని ఆర్బీఐ నిర్ణయించింది. -
ఒకే పేరున్న ఇద్దరికి ఒకే అకౌంట్ నంబర్
భిండ్: ఒకే పేరున్న ఇద్దరికి ఒకే ఖాతా నంబర్ ఇచ్చిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వాకమిది. ఆ ఇద్దరిలో ఒకరు డబ్బులు డిపాజిట్ చేస్తుండగా, మరొకరు వాటిని విత్‌డ్రా చేసి వాడుకున్నాడు. చివరికి విషయం కనుక్కొని ప్రశ్నించగా.. ‘మోదీజీ(ప్రధాని మోదీ)నే నా అకౌంట్లో డబ్బులు వేస్తున్నాడనుకున్నా’అని విత్ డ్రా చేసుకున్న వ్యక్తి జవాబివ్వడంతో బ్యాంక్ అధికారులు అవాక్కయ్యారు. ఈ వింత ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. హుకుమ్ సింగ్ అనే పేరున్న ఇద్దరికి ఒకే అకౌంట్ నెంబర్‌ను ఎస్బీఐ ఆలంపూర్ బ్రాంచ్ కేటాయించింది. రురాయి గ్రామానికి చెందిన హుకుంసింగ్.. స్థలం కొనుక్కునేందుకు డబ్బులు జమ చేయాలనే ఉద్దేశంతో రెగ్యులర్‌గా అకౌంట్లో డబ్బులు వేసేవాడు. వాటిని రవుని గ్రామానికి చెందిన హుకుంసింగ్ విత్ డ్రా చేసుకుని వాడుకునేవాడు. అలా దాదాపు రూ. 89 వేల రూపాయలను విత్ డ్రా చేసుకున్నాడు. డిపాజిట్ చేసిన డబ్బులు తీసుకుందామని బ్యాంక్‌కు వెళ్లిన హుకుంసింగ్‌కు తన అకౌంట్లో ఉండాల్సిన డబ్బులు విత్ డ్రా అయిన విషయం తెలిసింది. మేనేజర్‌కు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఈ విషయమై విత్ డ్రా చేసిన హుకుంసింగ్‌ను ప్రశ్నిస్తే.. ‘మోదీజీ ఇస్తున్నాడనుకున్నా. అందుకే వాడుకున్నా’అని జవాబిచ్చాడు. -
రైతులందరికీ పీఎం–కిసాన్
న్యూఢిల్లీ: ఎన్నికల హామీని నెరవేరుస్తూ.. రైతులందరికీ ప్రధానమంత్రి కిసాన్ పథకం వర్తింపజేయాలనే నిర్ణయంపై కేంద్రం శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 14.5 కోట్ల మంది రైతులకు.. వారికెంత భూమి ఉంది అన్న విషయం పరిగణనలోకి తీసుకోకుండా ఏడాదికి రూ.6 వేల చొప్పున సాయం అందజేస్తారు. మే 31న జరిగిన కొత్త ఎన్డీయే ప్రభుత్వ తొట్టతొలి సమావేశంలోనే ఇందుకు సంబంధించిన నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకాన్ని రైతులందరికీ వర్తింపజేస్తామని 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రకటించిన బీజేపీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. దీనిపై శనివారం నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర వ్యవసాయ శాఖ.. ఈ మేరకు ప్రస్తుతమున్న మినహాయింపు అంశాలను పరిగణనలోకి తీసుకుని లబ్ధిదారులను గుర్తించాల్సిందిగా కోరుతూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసింది. ప్రస్తుతమున్న భూయాజమాన్య విధానాన్ని ఉపయోగించి లబ్ధిదారులను గుర్తించాలని, పీఎం–కిసాన్ పోర్టల్‌లో కుటుంబసభ్యుల వివరాలు అప్లోడ్ చేసిన తర్వాత ప్రయోజనాన్ని వారి ఖాతాల్లోకి బదిలీ చేయాలని ఆదేశించింది. అర్హులైన లబ్ధిదారులను గుర్తించే బాధ్యత, వారి డేటా పీఎం–కిసాన్ పోర్టల్‌లో అప్లోడ్ అయ్యేలా చూడాల్సిన బాధ్యత రాష్ట్రాలపై ఉంటుంది. వీరికి వర్తించదు సంస్థాగత భూ యజమానులు, రాజ్యాంగ పరమైన పదవులు కలిగిన రైతు కుటుంబాలు, సర్వీసులో ఉన్న లేదా పదవీ విరమణ పొందిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, అలాగే ప్రభుత్వం రంగ, స్వతంత్ర ప్రతిపత్తి గల ప్రభుత్వ సంస్థల అధికారులు, ఉద్యోగులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ సిద్ధి (పీఎం–కిసాన్) పథకం కిందకి రారు. డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు వంటి వృత్తి విద్యా నిపుణలు, అలాగే నెలకు రూ.10 వేలకు పైగా పెన్షన్ పొందేవారు, గత మదింపు సంవత్సరంలో ఆదాయ పన్ను కట్టినవారికి కూడా ఈ పథకం వర్తించదు. రూ.75 వేల కోట్ల పీఎం–కిసాన్ పథకాన్ని మధ్యంతర బడ్జెట్ సందర్భంగా ప్రకటించారు. ప్రస్తుతం సవరించిన పథకం ప్రకారం.. మరో 2 కోట్ల మంది రైతులు దీనికింద లబ్ధి పొందుతారు. దీంతో దీని అంచనా వ్యయం కూడా 2019–20లో రూ.87,217.50 కోట్లకు పెరుగుతుంది. -
చెక్కులు లేదా బ్యాంకులో జమ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తమకు అందించాలనుకుంటున్న ఎకరానికి రూ. 4 వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని చెక్కుల పంపిణీ లేదా బ్యాంకులో నగదు జమ ద్వారా అందించాలని మెజారిటీ జిల్లాల రైతులు అభిప్రాయపడ్డారు. ఈ పథకం అమలుపై ఏర్పడిన మంత్రివర్గ ఉపసంఘం ఆదేశం మేరకు మంగళవారం వ్యవసాయశాఖ జిల్లాకో గ్రామంలో నిర్వహించిన గ్రామ సభల్లో ఇదే విషయాన్ని వారు వెల్లడించారు. ప్రభుత్వం తమకు చెక్కులు ఇవ్వాలని 13 జిల్లాల రైతులు కోరగా మరో 10 జిల్లాల రైతులు తమ బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇంకో 7 జిల్లాల రైతులు నేరుగా తమకే డబ్బు ఇవ్వాలని విన్నవించారు. గ్రామసభల్లో ఐదారు అంశా లపై వ్యవసాయశాఖ రైతుల అభిప్రాయాలు సేకరించింది. చెక్కులు ఇవ్వడం, బ్యాంకు ఖాతాల్లో వేయడం, నేరుగా డబ్బులు ఇవ్వడం, పోస్టాఫీసుల ద్వారా అందజే యడం, టీ వ్యాలెట్ ద్వారా, ప్రాథమిక సహకార సంఘాల ద్వారా పంపిణీ చేయడంపై గ్రామ సభల్లో రైతులను సర్వే చేసింది. నేరుగా డబ్బులిస్తే గందరగోళం ఏర్పడుతుందని 23 జిల్లాల రైతులు నిక్కచ్చిగా తేల్చిచెప్పారని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. పోస్టాఫీసుల ద్వారా అందించే విషయంపై రైతులు పెద్దగా స్పందించలేదన్నారు. టీ వ్యాలెట్ పద్ధతి తమకు తెలియదన్నారు. రైతుల అభిప్రా యాల నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘం బుధవారం మరోసారి సమావేశం కానుంది. ఈ భేటీలో రైతుల అభిప్రాయాలతో కూడిన నివేదికను వ్యవసాయశాఖ అందించనుంది. పెట్టుబడి సాయం పథకం కింద రైతులకు చెక్కులు జారీ చేస్తే వారి అప్పుల కింద ఆ డబ్బును జమ చేసుకోబోమని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి(ఎస్ఎల్బీసీ) సర్కారుకు హామీ ఇచ్చింది. దీనిపై చర్చించేందుకు మంగళ వారం ఎస్ఎల్బీసీ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఆ వివరాలను వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథి వెల్లడించారు. -
చెక్కు ఇచ్చి చెక్కేశాడు..!
⇒ప్రైవేట్ సంస్థ ఉద్యోగికి టోకరా ⇒రూ.1,46లక్షలతో పరారీ సనత్‌నగర్: నగదు డిపాజిట్ చేసేందుకు బ్యాంక్‌కు వచ్చిన ఓ వ్యక్తి దృష్టి మరల్చడమే కాకుండా బ్యాంక్ సిబ్బందిని బురిడీ కొట్టించి రూ.1,46,000లతో పరారైన సంఘటన బేగంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ రవీందర్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి..ఎస్ఆర్నగర్లోని జయ సర్జికల్ అండ్ ఫార్మా కంపెనీ ఉద్యోగి వినీల్‌రెడ్డి ఈ నెల 22న నగదు జమ చేసేందుకు బేగంపేట హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌కు వెళ్లాడు. రూ. రెండు లక్షలు ఒక కవర్లో, 1.40లక్షలు మరో కవర్లో పట్టుకుని డిపాజిట్ చేసేందుకు క్యూ లైన్లో నిలుచున్నాడు. అతని వద్దకు వచ్చిన ఓ గుర్తుతెలియని వ్యక్తి మీ కంపెనీకి రూ. 3లోలు చెల్లించాల్సింది ఉందని, మీ యజమాని చెక్ ఇవ్వమని చెప్పాడు. అయితే తమ మేడమ్ తనకు ఏమీ చెప్పలేదని వినీల్‌రెడ్డి చెప్పడంతో మీ యజమానితో మాట్లాడతానంటూ ఫోన్ చేసినట్లుగా నటించి వినీల్‌రెడ్డిని నమ్మించాడు. మీ మేడమ్ చెక్కు ఇవ్వమని చెప్పిందని, ఇద్దరం డిపాజిట్ చేద్దామంటూ లైన్లో నిల్చున్నారు. వీరిరువురి సంభాషణను బట్టి ఇద్దరు ఒకే సంస్థకు చెందిన వారిగా క్యాషియర్ భావించాడు. వినీల్‌రెడ్డి తన వద్ద ఉన్న నగదు, గుర్తుతెలియని వ్యక్తి చెక్కును ఒకేసారి క్యాషియర్‌కు ఇచ్చారు. అయితే ఇంకా కొంత నగదు ఉందని ఇప్పుడే వద్దామని బ్యాంక్ పై అంతస్తుకు వినీల్‌రెడ్డిని తీసుకెళ్లే ప్రయత్నంలో బయటికి వచ్చారు. అదే సమయంలో లిఫ్ట్ పైకి వెళ్లడంతో మరో లిఫ్ట్ ఉందేమో చూసి వస్తానని చెప్పి గుర్తుతెలియని అగంతకుడు అక్కడి నుంచి నేరుగా క్యాషియర్ దగ్గరకు వెళ్లి, ఎక్కువ మొత్తం ఉన్న కవర్‌ను ఉంచి తక్కువ నగదు ఉన్న కవర్ ఇవ్వాలని చెప్పడంతో క్యాషియర్ రూ.1.46 లక్షలు నగదు ఇచ్చాడు. కవర్ తీసుకున్న అతను అక్కడి నుంచి పరారయ్యాడు. అతను ఎంతకూ రాకపోవడంతో వినీల్‌రెడ్డి తిరిగి క్యాషియర్ దగ్గరకు వచ్చి తాను ఇచ్చిన డబ్బును డిపాజిట్ చేయాల్సిందిగా కోరడంతో ఒక కవర్ మీతో పాటు వచ్చిన వ్యక్తి తీసుకువెళ్లాడని చెప్పడంతో అవాక్కయ్యాడు. దీంతో అగంతకుడు ఇచ్చిన చెక్కును తీసుకుని బేగంపేట పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నగదు డిపాజిట్ చేసినంత మాత్రాన...నలుపు.. తెలుపైపోదు!
►డీమోనిటైజేషన్‌తో కరెన్సీ గోప్యత తొలగిపోయింది ►నల్లధనం ఎవరిదో బయటికొస్తుంది... ►భారీ డిపాజిట్లతో వడ్డీరేట్లు దిగొస్తున్నాయి ►ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యలు న్యూఢిల్లీ: బ్యాంకుల్లో నగదును డిపాజిట్ చేసినంతమాత్రాన నల్లధనం చట్టబద్ధమైనదిగా మారిపోదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హెచ్చరించారు. నోట్ల రద్దు(డీమోనిటైజేషన్)తో కరెన్సీ గోప్యత అనేది పూర్తిగా తొలగిపోయిందని.. ఇప్పుడు నల్లధనం ఎవరిదనేది బయటపడుతుందని పేర్కొన్నారు. ‘డీమోనిటైజేషన్.. గత రెండు నెలల పరిస్థితి’ పేరుతో జైట్లీ ‘ఫేస్బుక్’లో చేసిన పోస్ట్‌లో పలు అంశాలను ప్రస్తావించారు. వ్యవస్థలో ఉన్న రూ.500, రూ.1,000 నోట్లలో 97 శాతం బ్యాంకుల్లోకి వెనక్కివచ్చేసినట్లు అంచనాలు వెలువడిన సంగతి తెలిసిందే. దీంతో నల్లధనాన్ని ఏరిపారేయడంలో నోట్ల రద్దు సమర్థతపై పలువురు ఆర్థికవేత్తలు, విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో జైట్లీ తాజా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజల ఇబ్బందులు ఇక తొలగిపోయినట్లేనని... ఆర్థిక కార్యకలాపాలు మళ్లీ పుంజుకుంటున్నాయని జైట్లీ పేర్కొన్నారు. వడ్డీరేట్లు దిగొస్తున్నాయ్... డీమోనిటైజేషన్ కారణంగా బ్యాంకుల్లో డిపాజిట్లు వెల్లువెత్తడంతో వడ్డీరేట్లు దిగొచ్చేందకు దోహదం చేసిందని ఆర్థిక మంత్రి చెప్పారు. రుణ లభ్యత పెరగడంవల్ల ఆర్థిక వ్యవస్థ వృద్ధి మరింత పుంజుకుంటుందని జైట్లీ వివరించారు. ‘86 శాతం కరెన్సీని(జీడీపీలో దీని వాటా 12.2 శాతం) మార్కెట్ నుంచి వెనక్కిలాగేసి.. దీని స్థానంలో కొత్త కరెన్సీని చేర్చడం అనేది సాధారణమైన విషయమేమీ కాదు. ఈ నిర్ణయంతో గణనీయమైన పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ఇది ఎంతో సాహసోపేతమైన, శక్తియుక్తులతో కూడుకున్న చర్య. తాత్కాలికంగా కొన్ని సమస్యలు, విమర్శలు రావడం సహజం. ఆర్థిక కార్యకలాపాలపైనా ప్రతికూలత ఉంటుంది. అయితే, బ్యాంకులు, ఏటీఎంల ముందు ప్రజల బారులు ఇప్పుడు కనబడటంలేదు. కొత్త కరెన్సీ సరఫరా(రీమోనిటైజేషన్) ప్రక్రియ జోరందుకోవడమే దీనికి కారణం’ అని జైట్లీ పేర్కొన్నారు. పన్ను ఎగవేతను అనైతికంగా భావించడంలేదు... ప్రభుత్వానికి పన్ను చెల్లించకపోయినా ఏమీ కాదులే అన్న ధోరణి కారణంగా దేశానికి చాలా నష్టం వాటిల్లిందనన్నారు. ‘125 కోట్లకుపైగా ప్రజలున్న ఇంత పెద్ద దేశంలో గత ఆర్థిక సంవత్సరం(2015–16) కేవలం 3.7 కోట్లమంది మాత్రమే పన్ను రిటర్నులు దాఖలు చేశారు. పన్ను ఎగవేతల కారణంగా ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుంది. పేదరిక నిర్మూలన, జాతీయ భద్రత, ఆర్థికాభివృద్ధి విషయంలో రాజీపడాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. పన్ను ఎగవేత అనేది అనైతికంగా ఎవరూ భావించడంలేదు. జీవితంలో ఇదో భాగమైపోయింది. చాలా ప్రభు త్వాలు దీన్ని సర్వసాధారణమైన విషయంగానే కొనసాగిస్తూ వచ్చాయి. అయితే, ప్రధాని మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం ఈ ‘సాధారణ’ అంశంలో మార్పువస్తుంది. అంతేకాదు మన దేశ ప్రజల వ్యయ ధోరణులు కూడా మారతాయి. సంస్కరణలు ఏవైనాకూడా విధ్వంసపూరితంగానే ఉంటాయి. తిరోగమన పంథాలో మార్పునకు దోహదం చేస్తాయి. డీమోనిటైజేషన్‌తో నిజాయితీపరులకు ప్రయోజనం లభిస్తుంది. మోసపూరితంగా వ్యవహరించేవారికి శిక్ష తప్పదు’అని జైట్లీ పేర్కొన్నారు. త్వరలో ‘రంగు’ తేలుతుంది.. బ్యాంకుల్లోకి భారీస్థాయిలో వచ్చిన డిపాజిట్లను వడపోసే ప్రక్రియ జరుగుతోందని.. ఇందులో నల్లధనం గనుక బయటపడితే సంబంధిత వ్యక్తులను బయటికి లాగుతామని జైట్లీ చెప్పారు. ‘లెక్కచూపని సొమ్మును స్వచ్ఛందంగా వెల్లడిస్తే తక్కువ పన్నుతో బయటపడొచ్చు. అదే ఐటీ శాఖ గనుక పట్టుకుంటే భారీగా పన్ను, జరిమానా కక్కాల్సిందే’నని జైట్లీ స్పష్టం చేశారు. డీమోనిటైజేషన్ ప్రక్రియ మొదలయ్యాక ప్రజలు చాలా ఓపిక, సహనంతో వ్యవహరించారని.. అశాంతి అనేది ఎక్కడా కనబడలేదన్నారు. అదే వారిద్దరికీ తేడా... ‘ప్రధాని మోదీ భావితరం శ్రేయస్సు కోసం ఆలోచిస్తుంటే.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆలోచనంతా వచ్చే పార్లమెంటు సమావేశాలను ఎలా అడ్డుకోవాలనేదానిపైనే ఉంది. అదే వారిద్దరి మధ్య తేడా’ అని జైట్లీ విమర్శలు గుప్పించారు. ‘నోట్ల రద్దు అంశంపై ప్రతిపక్షాల ఆందోళనలన్నీ కొరగాకుండా పోయాయి. ఆర్థిక వ్యవస్థ కుదేలయిపోతుందంటూ వాళ్లు చేసిన గగ్గోలు తప్పని తేలింది. ప్రతిపక్షాల వైఖరివల్ల పార్లమెంటు సమావేశాల్లో ఒక సెషన్ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. సాంకేతికత, మార్పు, సంస్కరణలకు కాంగ్రెస్ వ్యతిరేకంగా వ్యవహరించడం దురదృష్టకరం. నల్లధనానికి అనుకూలంగా వాళ్లు పనిచేస్తున్నారనేందుకు ఇదే నిదర్శనం’ అని జైట్ల పేర్కొన్నారు. -
ఏటీఎంలో విలువైన సేవలు మరెన్నో..
ఎక్కడికి వెళ్లినా ఏదో ఒక బ్యాంకు ఏటీఎం కనిపించకుండా ఉండదు. కేవలం నగదు ఉపసంహరణ, నగదు డిపాజిట్ల కోసమే ఏటీఎం అని పొరపడకండి. మరెన్నో సేవలను ఏటీఎంల ద్వారా పొందే సౌలభ్యం ఉంది. ఫిక్స్డ్ డిపాజిట్: ఏటీఎం నుంచి ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం, అప్పటికే చేసి ఉన్న డిపాజిట్‌ను రద్దు చేసుకోవడం చిటికెలో పని. బ్యాంకింగ్ ఆప్షన్లో ఓపెన్ ఫిక్స్డ్ డిపాజిట్ ను ఎంచుకుని కాల వ్యవధి, నగదు మొత్తాన్ని ఎంటర్ చేసి ఓకే చేస్తే చాలు. కాకపోతే మీ ఖాతాలో డిపాజిట్‌కు సరిపడా నగదు ఉండాలి. రీచార్జ్: ఏటీఎం నుంచి మొబైల్ బ్యాలన్స రీచార్జ్ కూడా చేసుకోవచ్చు. కేవలం మీ ఫోన్‌కు అనే కాదు, కుటుంబ సభ్యులు, స్నేహితుల ఫోన్ నంబర్లకు కూడా రీచార్జ్ చేసుకునే సౌలభ్యం ఉంది. ఇందుకోసం ఏటీఎం మెనూలో మొబైల్ రీచార్జ్ ఆప్షన్‌ను ఎంచుకుని మొబైల్ నంబర్‌ను రెండు సార్లు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రీచార్జ్ మొత్తాన్ని ఎంటర్ చేసి ఓకే చేస్తే లావాదేవీ పూర్తవుతుంది. ట్యాక్స్ చెల్లింపులు: కొన్ని బ్యాంకులు తమ ఏటీఎంల నుంచి ఆదాయపన్ను చెల్లింపునకు అవకాశం కల్పిస్తున్నారుు. అడ్వాన్స ట్యాక్స్, సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్, ట్యాక్స్ బకారుులు సైతం చెల్లించే వెసులుబాటు ఇస్తున్నారుు. అరుుతే, ఇందుకోసం ముందుగా బ్యాంకు శాఖలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఏటీఎం ద్వారా పన్ను చెల్లించిన అనంతరం వచ్చే యూనిక్ నంబర్‌ను నోట్ చేసుకుని దీని సాయంతో బ్యాంకు వెబ్సైట్ నుంచి రసీదు పొందవచ్చు. బీమా ప్రీమియం: బీమా పాలసీల ప్రీమియం చెల్లించే సౌలభ్యం కూడా ఏటీఎంలలో ఉంది. బీమా కంపెనీలు ఇందుకోసం పలు బ్యాంకులతో కూడా టై అప్ అయ్యారుు. ఏటీఎంలో బిల్ పే ఆప్షన్‌ను ఎంపిక చేసుకున్న తర్వాత పాలసీ నంబర్‌ను ఎంటర్ చేసి ప్రీమియం మొత్తాని నిర్ధారించుకుని చెల్లించాల్సి ఉంటుంది. రుణానికి దరఖాస్తు: వ్యక్తిగత రుణం కావాలంటే బ్యాంకు శాఖ వరకూ వెళ్లాల్సిన శ్రమ అక్కర్లేదు! దగ్గర్లో బ్యాంకు ఏటీఎం ఉంటే చాలు. ప్రైవేటు రంగ బ్యాంకులు కొన్ని ఏటీఎంల ద్వారా పర్సనల్ లోన్సకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారుు. సంబంధిత ఖాతాదారుడి రుణ చరిత్ర ఆధారంగా బ్యాంకు రుణాన్ని ఇచ్చేదీ, లేనిదీ నిర్ణరుుస్తుంది. ఖాతాదారుడి లావాదేవీలు, వేతన జమల వివరాలను తదితర సమాచారం ఆధారంగా అర్హత ఉంటే పర్సనల్ లోన్‌ను దరఖాస్తు చేసుకున్న రోజు నుంచి రెండు రోజుల్లోనే ఆ మొత్తాన్ని ఖాతాలో జమ చేస్తారుు. దీంతో ఏటీఎం నుంచే ఆ రుణాన్ని సైతం డ్రా చేసుకోవచ్చు. నగదు బదిలీ: నెట్‌బ్యాంకింగ్ ద్వారా నగదు బదిలీ చేసుకోవచ్చు. నెట్‌బ్యాంకింగ్ సౌకర్యం లేని వారు కార్డు ఉంటే ఏటీఎం కేంద్రానికి వెళ్లడం ద్వారా ఆన్లైన్ మనీ ట్రాన్సఫర్ చేసుకునే వీలుంది. అరుుతే, నగదు పొం దాల్సిన వ్యక్తిని(బ్యాంకుకు వెళ్లి) బెనిఫీషియరీగా యాడ్ చేసుకోవాలి. బిల్స్ చెల్లింపులు: టెలిఫోన్ బిల్లు, విద్యుత్ బిల్లు, గ్యాస్ బిల్లు చెల్లింపులను సైతం ఏటీఎం నుంచి చేసుకునే సౌలభ్యం ఉంది. అరుుతే, బిల్లర్ వివరాలను బ్యాంకు సైట్లో నమోదు చేసుకోవాలి. డీసీబీ బ్యాంకు ‘సిప్పీ’ వాలెట్ హైదరాబాద్: ప్రైవేటు రంగంలోని డీసీబీ బ్యాంకు ‘సిప్పీ’ పేరుతో వాలెట్ యాప్‌ను రూపొందించింది. మొబైల్, ట్యాబ్లెట్ పీసీకి అనుగుణంగా దీనిని తీర్చిదిద్దారు. ఇందులోని స్ప్లిట్ బిల్ ఫీచర్‌తో ఒకే క్లిక్‌తో స్నేహితులు, బంధువులకు సమంగా నగదు పంపవచ్చు. వాలెట్స్ విభాగంలో భారత్‌లో తొలిసారిగా ఈ ఫీచర్ పొందుపరిచినట్టు బ్యాంకు రిటైల్ హెడ్ ప్రవీణ్ కుట్టి తెలిపారు. ఫోన్ కెమెరాతో వర్తకుల వద్ద ఉన్న ఎంవీసా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి పేమెంట్ పూర్తి చేయవచ్చు. యాప్ నుంచి మొబైల్, డీటీహెచ్ తదితర బిల్లులు చెల్లిం చొచ్చు. ఎవరికై నా నగదు పంపొచ్చు. అలాగే స్వీకరించవచ్చు. ప్రతి లావాదేవీ స్టేటస్‌ను వాట్సాప్, ఎస్ఎంఎస్, ఈ-మెరుుల్ ద్వారా ఇతరులకు షేర్ చేయొచ్చు. -
బ్యాంకు ముందు భక్తకోటి
సాక్షి, తిరుమల: శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులకు పెద్ద నోట్ల ఇబ్బందుల నంచి కొంత ఊరట లభించింది. నగదు డిపాజిట్ చేసేందుకు భక్తులు, స్థానికులు గురువారం తిరుమలలోని బ్యాంకుల్లో బారులు తీరారు. రూ.500 , రూ.1,000 నోట్లు డిపాజిట్ చేసి, రూ.4 వేల చొప్పున 100 నోట్లు తీసుకున్నారు. తిరుమలలోని అన్ని ప్రధాన బ్యాంకులు, పోస్టాఫీసు వద్ద సందడి కనిపించింది. భక్తులకు నగదు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక కౌంటర్లు ప్రారంభించాలని టీటీడీ ఈవో సాంబశివరావు ఆదేశించారు. ఈ మేరకు తిరుమలలోని ఆంధ్రాబ్యాంకు మేనేజర్ సుబ్రహ్మణ్యం, సబ్ మేనేజర్ రాజగోపాల్ ఏఎన్సీ, పద్మావతి, టీబీసీ నగదు రీఫండ్ కౌంటర్ల వద్ద రూ.100 కరెన్సీ నోట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. -
ఏటీఎం మోసానికి పాల్పడిన ఇద్దరి అరెస్టు
ఏటీఎంలో జమ చేయాల్సిన రూ. 10లక్షలు కాజేసిన కస్టోడియన్స్ ఆర్మూర్అర్బన్ : ఏటీఎంలలోని లొసుగులను ఆసరా చేసుకున్న ఇద్దరు కస్టోడియన్స్ రూ. 10 లక్షలను కాజేసిన సంఘటన ఆర్మూర్‌లో చోటు చేసుకుంది. వివిధ బ్యాంకులకు సంబంధించిన ఏటీఎంలలో డబ్బులను జమ చేసే ఒక సంస్థకు చెందిన ఇద్దరు ఉద్యోగులు ఈ మోసానికి పాల్పడ్డారు. ఆర్మూర్ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్‌హెచ్‌వో సీతారాం వివరాలను వెల్లడించారు. నందిపేట్‌కు చెందిన చేపూర్ శ్రీకాంత్, మండలంలోని మంథనికి చెందిన గడ్డి లింబా ద్రి రైటర్ సేఫ్ గార్డ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కస్టోడియన్లుగా విధులు నిర్వహిస్తున్నారు. వివిధ బ్యాంకులకు సంబంధించిన ఏటీఎంలలో డబ్బులను జమా చేయడం వీరి విధి. ఇందులో భాగంగా ఆర్మూర్‌లోని పిస మల్లన్న గుడి సమీపంలో గల రామ్‌నగర్ ఏటీఎంలో ఈనెల 7న రూ. 20 లక్షలు జమ చేయడానికి వచ్చారు. అనంతరం ఏటీఎంలో ఉన్న సాంకేతిక లోపాలను ఆసరాగా చేసుకున్న ఇరువురు రూ. 10 లక్షలను మాత్రమే జమా చేసి రూ. 20 లక్ష లు జమా చేసినట్లుగా అందులో అంకెలను నిక్షిప్తం చేశారు. కాజేసిన రూ. 10 లక్షల నుంచి చెరో ఐదు లక్షలను పంచుకున్నారు. మళ్లీ ఇదే నెల 13న ఏటీఎంకు వచ్చి అందులో రూ. 10 లక్షలు మాత్ర మే ఉన్నాయని కంపెనీ మేనేజర్‌కు సమాచారం ఇచ్చారు. ఏటీఎంకు చేరుకున్న మేనేజర్ రూ. 10 లక్షలు గల్లంతైన విషయాన్ని గమనించాడు. ఇదే విషయాన్ని ఈనెల 14న ఆర్మూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసు లు శుక్రవారం ఇద్దరిని ఏటీఎం వద్ద అ దుపులోకి తీసుకుని విచారించగా నేరా న్ని అంగీకరించారు. నిందితుల నుంచి రూ. 7 లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చినట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు. సమావేశం లో ఎస్సై సంతోష్ కుమార్, ఐడీ కానిస్టేబుళ్లు శ్రీను, రాములు పాల్గొన్నారు. -
ఒకే డిపాజిట్.. వేర్వేరు వడ్డీరేట్లు
ముందస్తు విత్డ్రాయెల్తో ఇకపై భిన్న వడ్డీరేటు ఆఫర్... ⇒ బ్యాంకులకు ఆర్బీఐ అనుమతి ముంబై: స్థిర డిపాజిట్లకు సంబంధించి వేర్వేరు వడ్డీ రేట్లను ఆఫర్ చేసే అవకాశం ఇకపై బ్యాంకులకు లభించనుంది. దీనితో ముందే విత్‌డ్రా చేసుకుంటే లభించే వడ్డీరేటు ఎంతో కూడా కస్టమర్‌కు డిపాజిట్ సమయంలోనే తెలిసే అవకాశం ఏర్పడింది. దీని ప్రకారం ఇకమీదట ‘డిపాజిట్ ముందస్తు విత్‌డ్రా అవకాశంతో’ భిన్న వడ్డీరేటును బ్యాంకులు ఆఫర్ చేస్తాయి. ముందే ఈ ఎంపిక అవకాశాన్ని (మెచ్యూరిటీ అనంతర విత్‌డ్రాయెల్, మెచ్యూరిటీ ముందస్తు విత్‌డ్రాయెల్) బ్యాంకులు కస్టమర్లకు కల్పించాలి. వారి ఎంపికకు వీలుగా వేర్వేరు వడ్డీరేట్లను ఆఫర్ చేయాలి. రూ.15 లక్షలు ఆలోపు డిపాజిట్లపై ఈ విధానాన్ని తప్పనిసరిగా అనుసరించాలని ఆర్బీఐ నిర్దేశించింది. అయితే రూ.15 లక్షలకు పైన ముందస్తు విత్‌డ్రాయెల్ అవకాశం లేకుండా డిపాజిట్ల ఆఫర్ చేయవచ్చని ఆర్బీఐ పేర్కొంది. ఈ మేరకు ఆర్బీఐ గురువారం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ముందస్తు విత్‌డ్రాయెల్ సదుపాయం ప్రాతిపదికన టర్మ్ డిపాజిట్లపై విభిన్న వడ్డీరేటు ఆఫర్‌కు బ్యాంకులకు అనుమతించనున్నట్లు ఫిబ్రవరిలో జరిగిన ఆరవ ద్వైమాసిక పరపతి విధానం సందర్భంగా ఆర్బీఐ ప్రకటించింది. వడ్డీరేట్లకు సంబంధించి బ్యాంకులు తప్పనిసరిగా బోర్డ్ అనుమతించిన విధానాన్ని అనుసరించాలని తెలిపింది. ఆఫర్ చేస్తున్న వడ్డీరేట్లు సహేతుకంగా, తగిన విధంగా, పారదర్శకంగా, అవసరమైతే పర్యవేక్షణా సమీక్షకు అనువైనదిగా ఉండాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది. రైతులకు కొత్త వడ్డీ సబ్సిడీ పథకంపై కసరత్తు జూన్ వరకూ పాత విధానమే... కాగా... 2015-16కు సంబంధించి రైతులకు త్వరలో కొత్త వడ్డీ సబ్సిడీ పథకాన్ని ప్రకటించనున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. ఇందుకు తగిన కసరత్తు జరుగుతున్నట్లు వెల్లడించింది. నష్టపోయిన పంటలకు అధిక పరిహారాన్ని అందజేస్తామని ప్రధాని నరేంద్రమోదీ వారం క్రితమే పేర్కొన్న నేపథ్యంలో ఆర్బీఐ ఈ ప్రకటన చేసింది. అప్పటివరకూ మధ్యంతర చర్యగా 2014-15 వడ్డీ రాయితీ పథకమే జూన్ 30 వరకూ కొనసాగుతుందని ఒక నోటిఫికేషన్లో తెలిపింది. 2014-15 పథకం ప్రకారం, రైతుకు రూ.3 లక్షల వరకూ స్వల్పకాలిక పంట రుణాల విషయంలో 2 శాతం రాయితీ లభిస్తుంది. అంటే వారికి 7 శాతానికే రుణ సదుపాయం లభిస్తుంది. రుణాలు సకాలంలో చెల్లించిన రైతుకు అదనంగా.. 3 శాతం వడ్డీరేటు రాయితీ లభిస్తుంది. ఏ బ్యాంకు మిషన్ నుంచైనా క్యాష్ డిపాజిట్..! అన్ని నగదు డిపాజిట్ మిషన్లను నేషనల్ ఫైనాన్షియల్ స్విచ్ (ఎన్ఎఫ్ఎస్)కు అనుసంధానించాలని రిజర్వ్ బ్యాంక్ భావిస్తోంది. దీనివల్ల ఏ బ్యాంక్ మిషన్ నుంచైనా తమ బ్యాంక్ అకౌంట్స్‌లో కస్టమర్లు క్యాష్ డిపాజిట్ చేసుకోగలుగుతారు (ఇంటర్ఆపరబుల్). ఎన్ఎఫ్ఎస్కు ఇప్పటికే అన్ని ఏటీఎంల అనుసంధానం జరిగింది. ఇప్పుడు అన్ని క్యాష్ డిపాజిటింగ్ మిషన్లనూ ఎన్ఎఫ్ఎస్కు అనుసంధానించాలన్న ప్రతిపాదన నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) నుంచి వచ్చినట్లు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ హెచ్ఆర్ ఖాన్ తెలిపారు. ఏ మిషన్ నుంచైనా నగదు లావాదేవీ నెరపే సౌలభ్యం అన్ని బ్యాంకుల కస్టమర్లకూ లభిస్తుందని అన్నారు. అంతకుమందు ఆయన ముంబైలో దేనా బ్యాంక్ సెల్ఫ్ సర్వీస్ ఈ-స్మార్ట్ సౌలభ్యాన్ని ప్రారంభించారు. -
రూ.40 లక్షల సొమ్ము మాయం
ఏటీఎంలలో పెట్టకుండానే స్వాహా ఏజెన్సీ సిబ్బందిలో ఒకరు పరారీ ఒంగోలు, న్యూస్‌లైన్: ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో ఏటీఎంలలో ఉంచాల్సిన రూ.40 లక్షల మేర నగదును సంబంధిత ఏజెన్సీ ఉద్యోగి స్వాహా చేశారు. ఏటీఎంలో నగదు డిపాజిట్, విత్‌డ్రాయల్స్‌కు సంబంధించిన మినీస్టేట్మెంట్తో సహా ఆ ఉద్యోగి పరారయ్యాడు. ఈ విషయమై సేఫ్‌గార్డ్ ఏజెన్సీ ఆడిటర్ నాగరాజు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రకాశం జిల్లాలో పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకుల ఏటీఎంలలో నగదు ఉంచే బాధ్యతను రెండేళ్లుగా విజయవాడ కేంద్రంగా ఉన్న రైటర్స్ సేఫ్‌గార్డ్స్ ఏజెన్సీ నిర్వహిస్తోంది. ఏటీఎంలలో నగదు ఉంచేందుకు ఒంగోలు గాంధీనగర్‌కు చెందిన పూరిమిట్ల రవి, కరణం అశోక్‌లను కస్టోడియన్లుగా నియమించుకుంది. పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంలలో సోమవారం మధ్యాహ్నానికే నగదు అయిపోయినట్లు బ్యాంకు అధికారులకు సమాచారం వచ్చింది. ఏజెన్సీకి అందజేసిన నగదుకు, ఏటీఎంల లావాదేవీలకు తేడా వచ్చిందని గమనించిన బ్యాంకు మేనేజర్లు ఏజెన్సీకి తెలిపారు. దీంతో నాగరాజు.. రవి, అశోక్‌లతో కలిసి ఏటీఎంలలో నగదును పరిశీలించారు. ఉండాల్సిన మేరకు నగదు లేదని గమనించిన ఆడిటర్ మినీ స్టేట్మెంట్ను జిరాక్స్ తీయించుకురమ్మని రవికి ఇచ్చి పంపించారు. రవి మినీ స్టేట్మెంట్తో సహా పరారయ్యాడు. మొత్తంమీద రూ.39 లక్షల 73 వేలు గోల్మాల్ అయినట్టు ఆడిటర్ కనుగొన్నారు. నగదు ఉంచేందుకు ఏటీఎం తెరుచుకోవడానికి కస్టోడియన్లకు పిన్ నంబర్లు ఇస్తారు. అశోక్ పిన్ నంబరు కూడా తెలుసుకుని రవి నగదును అపహరించి ఉంటాడని అనుమానిస్తున్నారు. కాగా ఏటీఎంలలో ఉంచేందుకు బ్యాంకులో నగదు తీసుకునేటప్పుడు కస్టోడియన్లు ఇద్దరూ మేనేజరు సమక్షంలో ఏజెన్సీ నుంచి వచ్చే చెక్కు మీద సంతకం చేయాలి. పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకుల్లో రెండో కస్టోడియన్ లేకుండానే పలుమార్లు నగదు తీసుకున్నట్టు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా ఒక్కరికే నగదు ఇవ్వడంతో ఈ వ్యవహారంలో బ్యాంకు అధికారుల పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.