బ్యాంకు ముందు భక్తకోటి
సాక్షి, తిరుమల: శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులకు పెద్ద నోట్ల ఇబ్బందుల నంచి కొంత ఊరట లభించింది. నగదు డిపాజిట్ చేసేందుకు భక్తులు, స్థానికులు గురువారం తిరుమలలోని బ్యాంకుల్లో బారులు తీరారు. రూ.500 , రూ.1,000 నోట్లు డిపాజిట్ చేసి, రూ.4 వేల చొప్పున 100 నోట్లు తీసుకున్నారు. తిరుమలలోని అన్ని ప్రధాన బ్యాంకులు, పోస్టాఫీసు వద్ద సందడి కనిపించింది. భక్తులకు నగదు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక కౌంటర్లు ప్రారంభించాలని టీటీడీ ఈవో సాంబశివరావు ఆదేశించారు. ఈ మేరకు తిరుమలలోని ఆంధ్రాబ్యాంకు మేనేజర్ సుబ్రహ్మణ్యం, సబ్ మేనేజర్ రాజగోపాల్ ఏఎన్‌సీ, పద్మావతి, టీబీసీ నగదు రీఫండ్ కౌంటర్ల వద్ద రూ.100 కరెన్సీ నోట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.