ఏటీఎంలో విలువైన సేవలు మరెన్నో.. | Sakshi
Sakshi News home page

ఏటీఎంలో విలువైన సేవలు మరెన్నో..

Published Mon, Dec 5 2016 2:57 AM

ఏటీఎంలో విలువైన సేవలు మరెన్నో..

ఎక్కడికి వెళ్లినా ఏదో ఒక బ్యాంకు ఏటీఎం కనిపించకుండా ఉండదు. కేవలం నగదు ఉపసంహరణ, నగదు డిపాజిట్‌ల కోసమే ఏటీఎం అని పొరపడకండి. మరెన్నో సేవలను ఏటీఎంల ద్వారా పొందే సౌలభ్యం ఉంది.

 ఫిక్స్‌డ్ డిపాజిట్: ఏటీఎం నుంచి ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడం, అప్పటికే చేసి ఉన్న డిపాజిట్‌ను రద్దు చేసుకోవడం చిటికెలో పని. బ్యాంకింగ్ ఆప్షన్‌లో ఓపెన్ ఫిక్స్‌డ్ డిపాజిట్ ను ఎంచుకుని కాల వ్యవధి, నగదు మొత్తాన్ని ఎంటర్ చేసి ఓకే చేస్తే చాలు. కాకపోతే మీ ఖాతాలో డిపాజిట్‌కు సరిపడా నగదు ఉండాలి.

 రీచార్జ్: ఏటీఎం నుంచి మొబైల్ బ్యాలన్‌‌స రీచార్జ్ కూడా చేసుకోవచ్చు. కేవలం మీ ఫోన్‌కు అనే కాదు, కుటుంబ సభ్యులు, స్నేహితుల ఫోన్ నంబర్లకు కూడా రీచార్జ్ చేసుకునే సౌలభ్యం ఉంది. ఇందుకోసం ఏటీఎం మెనూలో మొబైల్ రీచార్జ్ ఆప్షన్‌ను ఎంచుకుని మొబైల్ నంబర్‌ను రెండు సార్లు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రీచార్జ్ మొత్తాన్ని ఎంటర్ చేసి ఓకే చేస్తే లావాదేవీ పూర్తవుతుంది.

 ట్యాక్స్ చెల్లింపులు: కొన్ని బ్యాంకులు తమ ఏటీఎంల నుంచి ఆదాయపన్ను చెల్లింపునకు అవకాశం కల్పిస్తున్నారుు. అడ్వాన్‌‌స ట్యాక్స్, సెల్ఫ్ అసెస్‌మెంట్ ట్యాక్స్, ట్యాక్స్ బకారుులు సైతం చెల్లించే వెసులుబాటు ఇస్తున్నారుు. అరుుతే, ఇందుకోసం ముందుగా బ్యాంకు శాఖలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఏటీఎం ద్వారా పన్ను చెల్లించిన అనంతరం వచ్చే యూనిక్ నంబర్‌ను నోట్ చేసుకుని దీని సాయంతో బ్యాంకు వెబ్‌సైట్ నుంచి రసీదు పొందవచ్చు.

 బీమా ప్రీమియం: బీమా పాలసీల ప్రీమియం చెల్లించే సౌలభ్యం కూడా ఏటీఎంలలో ఉంది. బీమా కంపెనీలు ఇందుకోసం పలు బ్యాంకులతో కూడా టై అప్ అయ్యారుు. ఏటీఎంలో బిల్ పే ఆప్షన్‌ను ఎంపిక చేసుకున్న తర్వాత పాలసీ నంబర్‌ను ఎంటర్ చేసి ప్రీమియం మొత్తాని నిర్ధారించుకుని చెల్లించాల్సి ఉంటుంది.

రుణానికి దరఖాస్తు: వ్యక్తిగత రుణం కావాలంటే బ్యాంకు శాఖ వరకూ వెళ్లాల్సిన శ్రమ అక్కర్లేదు! దగ్గర్లో బ్యాంకు ఏటీఎం ఉంటే చాలు. ప్రైవేటు రంగ బ్యాంకులు కొన్ని ఏటీఎంల ద్వారా పర్సనల్ లోన్‌‌సకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారుు. సంబంధిత ఖాతాదారుడి రుణ చరిత్ర ఆధారంగా బ్యాంకు రుణాన్ని ఇచ్చేదీ, లేనిదీ నిర్ణరుుస్తుంది. ఖాతాదారుడి లావాదేవీలు, వేతన జమల వివరాలను తదితర సమాచారం ఆధారంగా అర్హత ఉంటే పర్సనల్ లోన్‌ను దరఖాస్తు చేసుకున్న రోజు నుంచి రెండు రోజుల్లోనే ఆ మొత్తాన్ని ఖాతాలో జమ చేస్తారుు. దీంతో ఏటీఎం నుంచే ఆ రుణాన్ని సైతం డ్రా చేసుకోవచ్చు.

నగదు బదిలీ: నెట్‌బ్యాంకింగ్ ద్వారా నగదు బదిలీ చేసుకోవచ్చు. నెట్‌బ్యాంకింగ్ సౌకర్యం లేని వారు కార్డు ఉంటే ఏటీఎం కేంద్రానికి వెళ్లడం ద్వారా ఆన్‌లైన్ మనీ ట్రాన్‌‌సఫర్ చేసుకునే వీలుంది. అరుుతే, నగదు పొం దాల్సిన వ్యక్తిని(బ్యాంకుకు వెళ్లి) బెనిఫీషియరీగా యాడ్ చేసుకోవాలి. 

బిల్స్ చెల్లింపులు: టెలిఫోన్ బిల్లు, విద్యుత్ బిల్లు, గ్యాస్ బిల్లు చెల్లింపులను సైతం ఏటీఎం నుంచి చేసుకునే సౌలభ్యం ఉంది. అరుుతే, బిల్లర్ వివరాలను బ్యాంకు సైట్‌లో నమోదు చేసుకోవాలి.

 డీసీబీ బ్యాంకు ‘సిప్పీ’ వాలెట్
హైదరాబాద్: ప్రైవేటు రంగంలోని డీసీబీ బ్యాంకు ‘సిప్పీ’ పేరుతో వాలెట్ యాప్‌ను రూపొందించింది. మొబైల్, ట్యాబ్లెట్ పీసీకి అనుగుణంగా దీనిని తీర్చిదిద్దారు. ఇందులోని స్ప్లిట్ బిల్ ఫీచర్‌తో ఒకే క్లిక్‌తో స్నేహితులు, బంధువులకు సమంగా నగదు పంపవచ్చు. వాలెట్స్ విభాగంలో భారత్‌లో తొలిసారిగా ఈ ఫీచర్ పొందుపరిచినట్టు బ్యాంకు రిటైల్ హెడ్ ప్రవీణ్ కుట్టి తెలిపారు. ఫోన్ కెమెరాతో వర్తకుల వద్ద ఉన్న ఎంవీసా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి పేమెంట్ పూర్తి చేయవచ్చు. యాప్ నుంచి మొబైల్, డీటీహెచ్ తదితర బిల్లులు చెల్లిం చొచ్చు. ఎవరికై నా నగదు పంపొచ్చు. అలాగే స్వీకరించవచ్చు. ప్రతి లావాదేవీ స్టేటస్‌ను వాట్సాప్, ఎస్‌ఎంఎస్, ఈ-మెరుుల్ ద్వారా ఇతరులకు షేర్ చేయొచ్చు.

Advertisement
 
Advertisement
 
Advertisement