Bank ATMs
-
ఏటీఎం కొత్త ఛార్జీలు.. రేపటి నుంచే..
ఏటీఎం లావాదేవీలు మరింత భారం కానున్నాయి. ఏటీఎం విత్‌డ్రావల్ కొత్త ఛార్జీలు మే 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఉచిత పరిమితిని మించి చేసే ఏటీఎం లావాదేవాలపై ఛార్జీల పెంపునకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనుమతి ఇచ్చింది. ఈ రుసుములో ఏటీఎం కొనుగోలు, నిర్వహణ, ఇతర బ్యాంకుల కస్టమర్లకు సేవలను అందించడానికి అయ్యే ఖర్చు కూడా ఉంటుంది.సవరించిన ఏటీఎం ఛార్జీలు ఇవే..మే 1 నుండి అమల్లోకి వస్తున్న కొత్త నిబంధనల ప్రకారం, వినియోగదారులు తమ ఉచిత ఉపసంహరణ పరిమితిని దాటిన తర్వాత ప్రతి లావాదేవీకి రూ.2 అదనంగా రూ .23 చెల్లించాల్సి ఉంటుంది. ఇది గతంలో రూ .21 ఉండేది. దీన్ని 2022 నుంచి అమలు చేస్తున్నారు.ఉచిత లావాదేవీలుఏటీఎం ఛార్జీల పెంపు ఉన్నప్పటికీ ఉచిత లావాదేవీ పరిమితుల్లో ఎలాంటి మార్పులు లేవు. సొంత బ్యాంకు ఏటీఎంలలో నెలకు 5 ఏటీఎం ట్రాన్సాక్షన్స్ ఉచితంగా చేసుకోవచ్చు. ఇక ఇతర బ్యాంకుల ఏటీఎంల విషయానికి వస్తే.. మెట్రో గరాల్లో అయితే 3 లావాదేవీలు, నాన్ మెట్రో నగరాల్లో 5 లావాదేవీలు ఉచితంగా చేసుకోవచ్చు.నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) సిఫారసుల మేరకు ఆర్బీఐ సవరణలో భాగంగా ఏటీఎం ఫీజులను పెంచింది. నిర్వహణ ఖర్చులు పెరుగుతుండటంతో వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు, బ్యాంకులు ఈ పెంపునకు మొగ్గుచూపుతున్నాయి.చిన్న బ్యాంకులపై ప్రభావంలావాదేవీ రుసుముల పెరుగుదల చిన్న బ్యాంకుల కస్టమర్లపై ఎక్కువ ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే వాటికి తక్కువ సంఖ్యలో ఏటీఎంలు ఉన్నాయి. దీంతో ఆయా బ్యాంకుల ఖాతాదారులు నగదు ఉపసంహరణ కోసం పెద్ద బ్యాంకుల ఏటీఎంలపై ఆధారపడుతున్నారు. ఇప్పుడు ఇలాంటి కస్టమర్లు అధిక ఛార్జీలను భరించాల్సి ఉంటుంది. -
బ్యాంకుల దోపిడీకి విఫలయత్నం
రియో డీ జనీరో: బ్రెజిల్లో బ్యాంకుల లూటీకి దొంగల ముఠా చేసిన యత్నం విఫలమయింది. ఈ సందర్భంగా ముఠా, పోలీసుల మధ్య∙కాల్పుల్లో ముఠా వద్ద బందీలుగా ఉన్నావారుసహా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు ఉన్నారు. బ్రెజిల్‌లోని మిలగ్రెస్ సిటీలో శుక్రవారం వేకువజామున ఈ ఘటన జరిగింది. సుమారు 30 మంది ఉన్న సాయుధ దొంగల ముఠా సభ్యులు రెండు బ్యాంకులున్న వీధికి అడ్డంగా ట్రక్కును ఆపారు. విషయం తెల్సుకున్న పోలీసులు రంగంలోకి దిగి కాల్పులు జరిపారు. దొంగలకు, పోలీసులకు మధ్య కాల్పులు మొదలయ్యాయి. అదే సమయంలో అటువైపుగా వచ్చిన కారును దుండగులు అడ్డగించారు. అందులోని వారిని బందీలుగా ఉంచుకున్నారు. ఇరవై నిమిషాల పాటు కొనసాగిన ఎదురు కాల్పుల్లో బందీలుగా ఉన్న ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురూ చనిపోయారు. దుండగుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా మిగతా వారు పరారయ్యారు. బందీల మృతికి కారణం పోలీసులా లేక దుండగులా అన్నది విచారణలో తేలుతుందని సియారా రాష్ట్ర గవర్నర్ తెలిపారు. -
ఏటీఎంలో విలువైన సేవలు మరెన్నో..
ఎక్కడికి వెళ్లినా ఏదో ఒక బ్యాంకు ఏటీఎం కనిపించకుండా ఉండదు. కేవలం నగదు ఉపసంహరణ, నగదు డిపాజిట్ల కోసమే ఏటీఎం అని పొరపడకండి. మరెన్నో సేవలను ఏటీఎంల ద్వారా పొందే సౌలభ్యం ఉంది. ఫిక్స్డ్ డిపాజిట్: ఏటీఎం నుంచి ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం, అప్పటికే చేసి ఉన్న డిపాజిట్‌ను రద్దు చేసుకోవడం చిటికెలో పని. బ్యాంకింగ్ ఆప్షన్లో ఓపెన్ ఫిక్స్డ్ డిపాజిట్ ను ఎంచుకుని కాల వ్యవధి, నగదు మొత్తాన్ని ఎంటర్ చేసి ఓకే చేస్తే చాలు. కాకపోతే మీ ఖాతాలో డిపాజిట్‌కు సరిపడా నగదు ఉండాలి. రీచార్జ్: ఏటీఎం నుంచి మొబైల్ బ్యాలన్స రీచార్జ్ కూడా చేసుకోవచ్చు. కేవలం మీ ఫోన్‌కు అనే కాదు, కుటుంబ సభ్యులు, స్నేహితుల ఫోన్ నంబర్లకు కూడా రీచార్జ్ చేసుకునే సౌలభ్యం ఉంది. ఇందుకోసం ఏటీఎం మెనూలో మొబైల్ రీచార్జ్ ఆప్షన్‌ను ఎంచుకుని మొబైల్ నంబర్‌ను రెండు సార్లు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రీచార్జ్ మొత్తాన్ని ఎంటర్ చేసి ఓకే చేస్తే లావాదేవీ పూర్తవుతుంది. ట్యాక్స్ చెల్లింపులు: కొన్ని బ్యాంకులు తమ ఏటీఎంల నుంచి ఆదాయపన్ను చెల్లింపునకు అవకాశం కల్పిస్తున్నారుు. అడ్వాన్స ట్యాక్స్, సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్, ట్యాక్స్ బకారుులు సైతం చెల్లించే వెసులుబాటు ఇస్తున్నారుు. అరుుతే, ఇందుకోసం ముందుగా బ్యాంకు శాఖలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఏటీఎం ద్వారా పన్ను చెల్లించిన అనంతరం వచ్చే యూనిక్ నంబర్‌ను నోట్ చేసుకుని దీని సాయంతో బ్యాంకు వెబ్సైట్ నుంచి రసీదు పొందవచ్చు. బీమా ప్రీమియం: బీమా పాలసీల ప్రీమియం చెల్లించే సౌలభ్యం కూడా ఏటీఎంలలో ఉంది. బీమా కంపెనీలు ఇందుకోసం పలు బ్యాంకులతో కూడా టై అప్ అయ్యారుు. ఏటీఎంలో బిల్ పే ఆప్షన్‌ను ఎంపిక చేసుకున్న తర్వాత పాలసీ నంబర్‌ను ఎంటర్ చేసి ప్రీమియం మొత్తాని నిర్ధారించుకుని చెల్లించాల్సి ఉంటుంది. రుణానికి దరఖాస్తు: వ్యక్తిగత రుణం కావాలంటే బ్యాంకు శాఖ వరకూ వెళ్లాల్సిన శ్రమ అక్కర్లేదు! దగ్గర్లో బ్యాంకు ఏటీఎం ఉంటే చాలు. ప్రైవేటు రంగ బ్యాంకులు కొన్ని ఏటీఎంల ద్వారా పర్సనల్ లోన్సకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారుు. సంబంధిత ఖాతాదారుడి రుణ చరిత్ర ఆధారంగా బ్యాంకు రుణాన్ని ఇచ్చేదీ, లేనిదీ నిర్ణరుుస్తుంది. ఖాతాదారుడి లావాదేవీలు, వేతన జమల వివరాలను తదితర సమాచారం ఆధారంగా అర్హత ఉంటే పర్సనల్ లోన్‌ను దరఖాస్తు చేసుకున్న రోజు నుంచి రెండు రోజుల్లోనే ఆ మొత్తాన్ని ఖాతాలో జమ చేస్తారుు. దీంతో ఏటీఎం నుంచే ఆ రుణాన్ని సైతం డ్రా చేసుకోవచ్చు. నగదు బదిలీ: నెట్‌బ్యాంకింగ్ ద్వారా నగదు బదిలీ చేసుకోవచ్చు. నెట్‌బ్యాంకింగ్ సౌకర్యం లేని వారు కార్డు ఉంటే ఏటీఎం కేంద్రానికి వెళ్లడం ద్వారా ఆన్లైన్ మనీ ట్రాన్సఫర్ చేసుకునే వీలుంది. అరుుతే, నగదు పొం దాల్సిన వ్యక్తిని(బ్యాంకుకు వెళ్లి) బెనిఫీషియరీగా యాడ్ చేసుకోవాలి. బిల్స్ చెల్లింపులు: టెలిఫోన్ బిల్లు, విద్యుత్ బిల్లు, గ్యాస్ బిల్లు చెల్లింపులను సైతం ఏటీఎం నుంచి చేసుకునే సౌలభ్యం ఉంది. అరుుతే, బిల్లర్ వివరాలను బ్యాంకు సైట్లో నమోదు చేసుకోవాలి. డీసీబీ బ్యాంకు ‘సిప్పీ’ వాలెట్ హైదరాబాద్: ప్రైవేటు రంగంలోని డీసీబీ బ్యాంకు ‘సిప్పీ’ పేరుతో వాలెట్ యాప్‌ను రూపొందించింది. మొబైల్, ట్యాబ్లెట్ పీసీకి అనుగుణంగా దీనిని తీర్చిదిద్దారు. ఇందులోని స్ప్లిట్ బిల్ ఫీచర్‌తో ఒకే క్లిక్‌తో స్నేహితులు, బంధువులకు సమంగా నగదు పంపవచ్చు. వాలెట్స్ విభాగంలో భారత్‌లో తొలిసారిగా ఈ ఫీచర్ పొందుపరిచినట్టు బ్యాంకు రిటైల్ హెడ్ ప్రవీణ్ కుట్టి తెలిపారు. ఫోన్ కెమెరాతో వర్తకుల వద్ద ఉన్న ఎంవీసా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి పేమెంట్ పూర్తి చేయవచ్చు. యాప్ నుంచి మొబైల్, డీటీహెచ్ తదితర బిల్లులు చెల్లిం చొచ్చు. ఎవరికై నా నగదు పంపొచ్చు. అలాగే స్వీకరించవచ్చు. ప్రతి లావాదేవీ స్టేటస్‌ను వాట్సాప్, ఎస్ఎంఎస్, ఈ-మెరుుల్ ద్వారా ఇతరులకు షేర్ చేయొచ్చు. -
బ్యాంకింగ్ రంగానికి 10వేల కోట్ల నష్టం
రాష్ట్రాన్ని విభజించేందుకు తాము సిద్ధమేనని కాంగ్రెస్ పార్టీ పెద్దలు చెప్పిన ఒక్క మాట విలువ ఎంతో తెలుసా... అక్షరాలా పదివేల కోట్లు!! అది కూడా కేవలం ఒక్క బ్యాంకింగ్ రంగంలోనే! తెలంగాణ ఏర్పాటుకు తాము సుముఖమేనంటూ కేంద్ర మంత్రి అజయ్ మాకెన్, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ జూలై 30వ తేదీన ఢిల్లీలో ప్రకటించారు. తత్ఫలితంగా సీమాంధ్ర ప్రాంతం ఆగ్రహావేశాలతో రగిలిపోయింది. దాదాపు గడిచిన వారం రోజుల నుంచి అక్కడ ఆందోళనలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. పాఠశాలలు, దుకాణాలు, బ్యాంకులు, చివకు ఆస్పత్రులు కూడా సరిగా పనిచేయడంలేదు. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో బ్యాంకింగ్ కార్యకలాపాలు దాదాపుగా నిలిచిపోవడం వల్ల ఆ రంగానికి దాదాపు పదివేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. ఏటీఎంలలో డబ్బులు పెట్టడానికి కూడా కుదరకపోవడంతో చాలా వరకు ఏటీఎంలు ఖాళీగానే ఉంటున్నాయి. దాదాపుగా బ్యాంకులన్నీ కలిసి ఈ పదమూడు జిల్లాల్లో మూడువేల ఏటీఎంలు, నాలుగువేల శాఖలు కలిగి ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి బి.ఎస్.రాంబాబు తెలిపారు. రాష్ట్రం మొత్తమ్మీద చూసుకుంటే ఆరువేల శాఖలలో 80 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ రెండు ప్రాంతాల్లో ఏటీఎం సేవలకు అంతరాయం కలిగిన మాట వాస్తవమేనని ఎస్బీఐ సీనియర్ అధికారి ఒకరు కూడా అంగీకరించారు. కొన్ని ప్రాంతాల్లో భద్రతాపరమైన కారణాల వల్ల ఏటీఎంలలో డబ్బులు పెట్టలేకపోతున్నామని, కానీ సాధ్యమైన చోటల్లా పెడుతున్నామని చెప్పారు. కొన్ని సందర్భాల్లో వినియోగదారుల సౌకర్యం కోసం తెల్లవారుజామునే డబ్బులు పెడుతున్నట్లు చెప్పారు. చాలా నగరాల్లో ఉద్యోగులు తమ జీతం డబ్బులు తీసుకోడానికి ఏటీఎంలే ఆధారం కాబట్టి వాటివద్ద పొడవాటి క్యూలు ఉంటున్నాయి. అయితే, తమ బ్యాంకు శాఖలకు దగ్గరగా ఉండే ఏటీఎంలలో అయితే డబ్బులు ఉంటున్నాయని ఎస్బీఐ అధికారి తెలిపారు. రాష్ట్రంలోని సీమాంధ్ర జిల్లాల్లో స్టేట్ బ్యాంకుకు దాదాపు 1200 ఏటీఎంలు ఉన్నాయి. సగటున ఒక్కో ఏటీఎంలో 300 లావాదేవీలు జరుగుతాయని, సుమారుగా 6-7 లక్షల రూపాయల వరకు డ్రా చేసుకుంటారని అన్నారు. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా బ్యాంకింగ్ కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితమైనట్లు ఆయన చెప్పారు.